![Jagannath Movie Teaser Launched by Manchu Manoj](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/jagannath-%283%29.jpg.webp?itok=UMVHBi2R)
‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం అంత సులభం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఫ్యాషన్‌తో ‘జగన్నాథ్’(Jagannath) చిత్రం తీశారు. కోటి రూ పాయలతో తీసిన సినిమా చిన్నది, వెయ్యి కోట్లతో తీసినది పెద్ద చిత్రం అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే ఆ సినిమా బాగుందా? బాగాలేదా అనేదే ఉంటుంది’’ అని నటుడు మంచు మనోజ్ అన్నారు.
రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన చిత్రం ‘జగన్నాథ్’. భరత్, సంతోష్ దర్శకత్వంలో పీలం పురుషోత్తం నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్(Manchu Manoj) మాట్లాడుతూ– ‘‘భరత్‌కి ‘జగన్నాథ్’ తొలి సినిమా అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్‌గా నటించాడు. ఈ మూవీ హిట్ కావాలి’’ అన్నారు. రాయలసీమ భరత్ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. ఐదేళ్లు కష్టపడి ‘జగన్నాథ్’ చిత్రం పూర్తి చేశాం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం–నేపథ్య సంగీతం: శేఖర్ మోపూరి.
Comments
Please login to add a commentAdd a comment