
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి రోజు నేడు. 2023 మార్చి 3న ప్రియురాలు భూమా మౌనిక (Mounika Bhuma Manchu) మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇంట్లో ఈ శుభకార్యం జరిగింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే! మౌనికకు అప్పటికే ధైరవ్ అనే బాబున్నాడు. అతడి బాధ్యత కూడా తనదేనని వేదమంత్రాల సాక్షిగా మాటిచ్చాడు మనోజ్. గతేడాది మనోజ్-మౌనికల దాంపత్యానికి గుర్తుగా కూతురు జన్మించింది.
మనోజ్- మౌనిక పెళ్లిరోజు
తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఇద్దరూ తెగ సంతోషపడిపోయారు. పాపాయికి దేవసేన శోభ ఎమ్‌ఎమ్ అని నామకరణం చేశారు. ఇదిలా ఉంటే నేడు పెళ్లిరోజు సందర్భంగా మౌనిక సోషల్ మీడియా వేదికగా ఓ అందమైన పోస్ట్ షేర్ చేసింది. మనిద్దరి జీవితం మంచిగా ముందుకు సాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మనం ఒకరికొకరు తారసపడినందుకు, ఒకరిపై ఒకరం నమ్మకం పెట్టుకున్నందుకు, ప్రేమ కురిపించుకున్నందుకు థాంక్యూ చెప్పాలనుకుంటున్నాను.
మురిసిపోయిన మంచు లక్ష్మి
ఇంత అందమైన కుటుంబాన్ని పొందినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు మనోజ్.. దడదడలాడిద్దాం.. అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు ధైరవ్‌ను మౌనిక, పాపను మనోజ్ ఎత్తుకున్న ఫోటోను జత చేసింది. ఈ పోస్ట్ చూసిన లక్ష్మి మంచు (Lakshmi Manchu) నీ పోస్ట్ భలే బాగుంది. మీ నలుగుర్నీ ఎంతో ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ సంతోషంగా, ప్రేమగా ఇలాగే కలిసుండాలి కోరుకుంటున్నాను అని కామెంట్ చేసింది.
చదవండి: నాని 'ప్యారడైజ్' గ్లింప్స్.. ఇది కాకుల కథ
ఆస్కార్ వేదికపై 'హిందీ'.. నామినీలకు రూ.1.9 కోట్లు