నాకు, ధైరవ్‌కు చోటిచ్చినందుకు థ్యాంక్స్‌: మనోజ్‌ భార్య ఎమోషనల్‌ | Manchu Manoj Wife Bhuma Mounika Shares Special Post For 1st Wedding Anniversary, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Bhuma Mounika: ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చింది.. ధైరవ్‌కు చోటిచ్చినందుకు థ్యాంక్స్‌ హజ్బెండ్‌..

Published Sun, Mar 3 2024 5:56 PM | Last Updated on Sun, Mar 3 2024 6:49 PM

Manchu Manoj Wife Bhuma Mounika Shares 1st Wedding Anniversary Post - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే గతేడాది ఈ పెళ్లి జరిగింది. ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్‌ అనే కుమారుడు ఉన్నాడు. ప్రియురాలిని పెళ్లాడిన మనోజ్‌.. ధైరవ్‌ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. త్వరలోనే ధైరవ్‌తో ఆడుకునేందుకు బుజ్జి పాపాయి రానుంది. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే!

మన మధ్య బోలెడు జ్ఞాపకాలు..
నేడు (మార్చి 3) మనోజ్‌- మౌనికల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తాము కలిసున్న ఫోటోలు షేర్‌ చేసింది మౌనిక. 'హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ హజ్బెండ్‌.. ఈ జీవితం మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్‌కు నీ హృదయంలో చోటిచ్చినందుకు థ్యాంక్స్‌.. ఫ్రెండ్‌షిప్‌, పార్ట్‌నర్‌షిప్‌, క్రేజీషిప్‌.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్‌కు కూడా థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను.

ఐ లవ్యూ..
ఎందుకంటే, నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేశాయి. సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుకుందాం.. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్‌.. ఐ లవ్యూ.. నా మనసులో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది మౌనిక. క్షణాల్లో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

చదవండి: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement