
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా భాకారాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్‌లో బస చేస్తున్న మనోజ్ వద్దకు పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను వారు పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని వారు ప్రశ్నించారు. ఇక్కడ సెలబ్రిటీలకు అంత సురక్షితం కాదని వారు సూచించారు. అయితే, ఇదంతా పోలీసుల డ్రామా అంటూ వారి తీరును మనోజ్ తప్పుపట్టారు. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అంటూ ఆయన ప్రశ్నించారు.
అయితే, పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. 'నేను టెర్రరిస్టా.. నేను దొంగనా.. అర్థరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు. సీఎం పేరు ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారు. అసలు మీరు నాదగ్గరకు ఎందుకు వచ్చారు..? మమల్ని ఎందుకు బెదిరించారో, చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.' అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపై మంచు మనోజ్ బీష్మించుకుని కూర్చున్నారు.
సుమారు రాత్రి 12 గంటల తర్వాత ఈ గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్దిచెప్పడంతో మనోజ్ ఆందోళన విరమించారు. కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ వ్యవహారాల్లో కూడా మనోజ్ జోక్యం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనతో పాటు కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారని సమాచారం ఉంది. మరోసారి యూనివర్శిటీ వద్ద మనోజ్ తన బౌన్సర్లతో ఏమైనా గొడవ చేస్తాడనే ఆలోచనతో మోహన్ బాబు నుంచి వచ్చిన సమాచారం వల్ల పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!
Case filled by #MohanBabu Concerning Family Matters
Stay Strong @HeroManoj1 brother
We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025
Comments
Please login to add a commentAdd a comment