
గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్' పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు.
'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్‌లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇందులో రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment