యోధుడిగా మంచు మనోజ్.. 'మిరాయ్‌' గ్లింప్స్‌ విడుదల | Mirai The Black Sword Glimpse Out Now | Sakshi
Sakshi News home page

యోధుడిగా మంచు మనోజ్ లుక్‌.. 'మిరాయ్‌' గ్లింప్స్‌ విడుదల

Published Mon, May 20 2024 1:54 PM | Last Updated on Mon, May 20 2024 2:01 PM

Mirai The Black Sword Glimpse Out Now

తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్‌' ది సూపర్‌ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తిక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది బ్లాక్‌ స్వాడ్‌' గ్లింప్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మంచు మనోజ్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. బాలీవుడ్‌ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. అసలుసిసలైన యోధుడిగా కత్తితో చేస్తున్న పోరాట సన్నివేశాన్ని చూపించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మిరాయ్‌ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్‌ కార్తిక్‌ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement