
ప్రణీతతో ప్రేమలో పడ్డ మనోజ్!
త్వరలో మంచువారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. పీకల్లోతు ప్రేమలో పడ్డ మంచు మనోజ్ తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. యంగ్ హీరోల్లో ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన మనోజ్ ...ప్రణిత రెడ్డిపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ప్రణిత రెడ్డి అనుకుంటున్నారా? బిట్స్ పిలానీలో చదువుతుకుంటున్న ఆమె మంచు ఫ్యామీలికి సన్నిహితురాలే. అయితే ఇంతకు మించి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
మనోజ్కు చాలా రోజుల క్రితమే ప్రణీత తెలుసునని, వీరిద్దరూ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబుతున్నారని, ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు సమాచారం. అయితే మనోజ్ మాత్రం తన ప్రేమ, పెళ్లి వార్తలపై పెదవి విప్పటం లేదు. త్వరలోనే ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ అఫిషీయల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. కరెంట్ తీగ సక్సెస్తో జోష్ మీద ఉన్న మనోజ్ ..తదుపరి చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.