
మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి వార్తలు తెరమీదకి రాగా, వాటినే నిజం చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్ మౌనిక మెడలో మూడుముళ్లు వేశాడు.
స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారి భార్యభర్తలయ్యారు. మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లిపనులు దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మీ ఆ ఫోటోలను షేర్‌చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మనోజ్-మౌనికల పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో మౌనిక కొడుకు ధైరవ్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మనోజ్-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment