Who Is Manchu Manoj Wife Bhuma Mounika Reddy, Know Interesting Facts About Her In Telugu - Sakshi
Sakshi News home page

Bhuma Mounika Reddy: మనోజ్‌కు కాబోయే భార్య మౌనిక రెడ్డి ఎవరు? మంచు ఫ్యామిలీతో అనుబంధం ఎలా?

Published Fri, Mar 3 2023 1:34 PM | Last Updated on Fri, Mar 3 2023 3:46 PM

Who Is Bhuma Mounika Reddy What We Know About Manoj Wife To Be - Sakshi

మంచు మనోజ్‌ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. గత కొద్దిరోజులుగా భూమా మౌనిక రెడ్డిని మనోజ్‌ వివాహం చేసుకోనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మనోజ్‌ తన కాబోయే భార్యను పరిచయం చేశాడు.

'పెళ్లికూతురు భూమా మౌనిక'.. మనోజ్‌ వెడ్స్‌ మౌనిక అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ తన పెళ్లిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశాడు. దీంతో పలువురు అభిమానులు మనోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే అసలు మౌనిక రెడ్డి ఎవరనే విషయాలపై నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు. దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి. పొలిటికల్‌ ఫ్యామిలీకి చెందిన భూమా కుటుంబంతో మంచుఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. 

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గణేష్‌ రెడ్డితో మౌనిక రెడ్డికి 2016లో ఘనంగా వివాహం జరిగింది. వీరికి 2018లో ధైరవ్‌ రెడ్డి అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్‌ కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొంతకాలంగా మనోజ్‌- మౌనికల మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యారు. మంచు లక్ష్మీ ఇంట్లోనే ఈ రోజు(శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు మనోజ్‌- మౌనిక వివాహం జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement