Manchu Manoj Emotional While Wedding With Mounika Reddy - Sakshi
Sakshi News home page

Manchu Manoj : ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణమది..  ఆనందంతో మనోజ్‌ కన్నీళ్లు

Published Sun, Mar 5 2023 7:51 PM | Last Updated on Thu, Mar 9 2023 2:05 PM

Manchu Manoj Emotional While Wedding With Mounika Reddy - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టంలా నిలుస్తుంది.ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దక్కదు. వాళ్లిద్దరికి వివాహబంధంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా మంచు మనోజ్‌ విడిపోగా, అనుకోని పరిస్థితుల్లో మౌనిక కూడా విడాకులు తీసుకున్నారు. కానీ డెస్టినీ(విధి)వీళ్లిద్దరిని కలిపింది. ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న మనోజ్‌-మౌనికలు తమ బంధాన్ని పెళ్లితో పదిలం చేసుకున్నారు.

ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరికి ఒకరం తోడుండామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని వెడ్డింగ్‌ పిక్స్‌ని మంచు లక్ష్మీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. 'రెండు హృదయాలు, కానీ మనసు ఒక్కటే. ఇలాగే ఎప్పటికీ'.. అంటూ వెడ్డింగ్‌ మూమెంట్స్‌ని షేర్‌ చేసింది.

నిజమేనేమో మరి..పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనోజ్‌-మౌనికల జీవితంలో కూడా ఇలాంటిదే జరిగినట్లుంది. అందుకే విడివిడిగా జీవితం ప్రారంభించిన వీళ్లు చివరికి భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలో పెళ్లి సమయంలో మనోజ్‌ కూడా చాలా ఎమోషనల్‌ అయ్యారు.  జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగిఉన్న ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టకున్నారు. అటు మౌనిక కూడా మోహన్‌ బాబును పట్టుకొని ఎమోషనల్‌ అయిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement