
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం.
మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.
మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment