ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఎంతోకాలంగా స్నేహంగా ఉన్న మనోజ్-మౌనికలు తాజాగా పెళ్లిబంధంతో భార్యభర్తలుగా మారారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు..కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చూడముచ్చటైన ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా వాటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
భార్య, పిల్లలతో తమ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. రీసెంట్‌గా మంచు లక్ష్మీ మనోజ్ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఒక్క ఫోటోలో కూడా విష్ణు కనిపించలేదు. అటు విరానికా, విష్ణు దంపతులు కూడా మనోజ్ పెళ్లికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మంచు వారి వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment