Mounika Reddy
-
పెళ్లిరోజు భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
-
'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!
ఒకప్పుడు ఏమో ఇప్పుడు పెళ్లి-విడాకుల వ్యవహారం మరీ సాధారణమైపోయింది. సామాన్యుల సంగత కాస్త పక్కనబెడితే నటీనటులు చాలామంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. చప్పుడు చేయకుండా విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మెగాడాటర్ నిహారిక విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు మరో తెలుగు నటి కూడా విడాకులు తీసుకోనుందా అనే సందేహాం వస్తోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: ఊహించని సర్ప్రైజ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!) షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. 'సూర్య' వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయింది. 'భీమ్లా నాయక్'తోపాటు పలు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది. అలానే కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో ఈమె రిలేషన్లో ఉంది. అలా మనసులు కలిసిన తర్వాత గతేడాది డిసెంబరులో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే తన పెళ్లి టైంలో మౌనిక చాలా ఎగ్జైట్ అవుతున్న వీడియో అప్పట్లో చాలా పాపులర్ అయింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో తాజాగా ఈమె.. పెళ్లి ఫొటోలు అన్నింటినీ ఇన్ స్టాలో డిలీట్ చేసింది. అలానే భర్త సందీప్ ని కూడా అన్ ఫాలో చేసింది. దీంతో వీళ్లిద్దరి బంధం బ్రేక్ అయిందా అనే రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి దీని గురించి ఎలా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 షోలోకి ప్రభాస్ హీరోయిన్!) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) -
మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి కుమారుని బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
Manchu Manoj : మహా రుద్ర యాగంలో పాల్గొన్న మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి (ఫొటోలు)
-
మంచు మనోజ్- భూమా మౌనిక లవ్‌స్టోరీ.. సినిమాకు మించి ట్విస్టులు!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మీ నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా మనోజ్ అభిమానులతో పంచుకున్నారు. అయితే వీరిద్దరి లవ్‌స్టోరిపై ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఎక్కడ కలుసుకున్నారు? మనోజ్ ఫ్యామిలీకి, భూమా కుటుంబానికి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది? అన్న విషయాల గురించి మంచు మనోజ్ ఇటీవల హాజరైన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (ఇది చదవండి: ఓటీటీకి విరూపాక్ష.. స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్!) మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'మా కుటుంబాల మధ్య 15 ఏళ్లుగా స్నేహం ఉంది. ఇరు కుటుంబాల సభ్యులు ఏ ఫంక్షన్ జరిగిన తప్పకుండా హాజరయ్యేవాళ్లం. అనుకోకుండా ఇద్దరికీ మరొకరితో పెళ్లి కావడంతో.. వేర్వేరు దారుల్లో వెళ్లిపోయాం. అయితే నాకు డైవర్స్ అయ్యాక ఇద్దరం కలిసి ప్రయాణించాలని అనుకున్నాం. అప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. నా కోసం ఓ బిడ్డతో ఎదురుచూస్తున్న అమ్మాయి కోసం సినిమాలను కూడా వదిలేసి వెళ్లాలని అనుకున్నా. ఆ సమయంలో నేను చేస్తున్న ఓ సినిమాను మధ్యలో వదిలేశా. మౌనికను తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. చెన్నైలోనే ఏడాదికి పైగా సహజీవనం చేశాం. అయితే మేమిద్దరం చెన్నైలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు' అని అన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్- భూమా మౌనిక లవ్ స్టోరీకి సంబంధించిన ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మంచు మనోజ్, భూమా మౌనికలు మార్చి 3న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
Manchu Manoj Marriage Photos: పెళ్లి వీడియో షేర్ చేసిన మంచు మనోజ్.. ఫోటోలు చూశారా?
-
నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే: మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్ తన పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఏం మనసో అంటూ' సాగే వీడియో సాంగ్‌తో పాటు మౌనికతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు మనోజ్. మంచు మనోజ్ ట్వీట్లో రాస్తూ.. 'ఇలాంటి ప్రేమ జీవితంలో ఎవరికైనా ఒక్కసారే దక్కుతుంది. నువ్వు నా కోసమే పుట్టావని నాకు తెలుసు. నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ వారి పెళ్లికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. మనోజ్, మౌనిక పెళ్లివేడుకను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశాడు. ట్వీట్‌తో పాటు ఇద్దరు కలిసి ఉన్న అరుదైన ఫోటోను పంచుకున్నారు. మౌనిక వైపు తన చేతులు చూపిస్తూ నవ్వుతున్న ఫోటో చూస్తే చూడముచ్చటగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I OFFER YOU ALL OF ME TODAY AND FOR ALWAYS. THANK YOU FOR SHOWING ME HOW IT FEELS TO BE LOVED" @BhumaMounika 💓 ▶️ https://t.co/BeOXs0pJ5n pic.twitter.com/ctcK8WqSDK — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 18, 2023 -
తొలిసారి మనోజ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన మౌనిక రెడ్డి
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో తమ బంధాన్ని పదిల పర్చుకున్నారు. ఇక మనోజ్ తొలిసారిగా తన భార్య మౌనికను ఓ టాక్ షోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తమ ప్రేమ, పెళ్లి వరకు సాగిన మానసిక సంఘర్షణలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే మౌనిక రెడ్డి తొలిసారిగా భర్త మంచు మనోజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనోజ్‌తో పోలిస్తే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని మౌనిక పెళ్లి ఫోటోలను ఇంతవరకు బయటపెట్టలేదు. తాజాగా ఓ టాక్ షోకి హాజరైన నేపథ్యంలో ఇద్దరూ దిగిన ఫోటోను తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో పంచుకుంది. ఇక ఇందులో మౌనిక సెలబ్రిటీ స్టైలిస్ట్ సబ్యసాచి శారీను ధరించింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
భార్యతో క్యూట్ వీడియోను షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది.ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్- మౌనికలు గత నెలలో ఒక్కటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే వీరి పెళ్లయి నేటికి సరిగ్గా నెలరోజులవుతుంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి ఓ క్యూట్ వీడియోను పంచుకున్నారు మనోజ్. దీనికి 'ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు' అంటూ క్యాప్షన్ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల విషయంలోనూ జోరు పెంచారు మనోజ్. -
మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదా? ఆయన ఏమన్నారంటే..
యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఇటీవలె ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే మనోజ్ పెళ్లి విషయంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వివాహానికి కూడా ఆయన హాజరు కారంటూ వార్తలు వినిపించాయి. కానీ వీటిని పటాపంచెలు చేస్తూ దగ్గరుండి మనోజ్ పెళ్లి జరిపించి వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు మనోజ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''మనోజ్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఓసారి ఆలోచించమన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను అన్నాడు. ఇంకేముంది చేసుకో.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకంటాను. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలను నువ్వు ఆపుతావు?'' అంటూ మనోజ్ పెళ్లిపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. -
మంచు మనోజ్ మాటలకు ఎమోషనల్ అయిన మౌనిక
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనికతో ఇటీవలె ఏడుడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మోహన్‌బాబు 71 జన్మదిన వేడుకలు తిరుపతిలో జరగ్గా, మనోజ్ తన భార్య మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఎమోషనల్‌గా ప్రసంగించారు. ''జీవితంలో గెలుపోటములు సహజం. అందరి జీవితాల్లో ఏదో ఒక ఫేజ్‌లో అందకారం చుట్టేస్తోంది. నాకు కూడా గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడింది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు వెలుతురులా మౌనిక కనిపించింది. ప్రతి మగాడి గెలుపు వెనుకాల ఆడవారు ఉంటారు. ఆడవారి విజయం వెనుక కూడా మగాళ్లు ఉండాలి'' అంటూ మనోజ్ పేర్కొనగా ఆ మాటలకు మౌనిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. -
మనోజ్- మౌనిక దంపతులకు గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్
మంచు మనోజ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మోహన్‌బాబు తనయుడిగా నటనను అందిపుచ్చుకున్న మనోజ్ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆదివారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ చేరుకున్నారు మనోజ్. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన మనోజ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులంతా ఒక్కసారిగా నూతన దంపతులకు ఆహ్వానం పలికారు. తాజాగా ఈ వీడియోను మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కారులో శ్రీ విద్యానికేతన్ చేరుకున్న మనోజ్, మౌనికలకు వేలమంది విద్యార్థులు వరుసలో నిలబడి ఘనస్వాగతం పలికారు. విద్యాసంస్థలోకి మనోజ్ అడుగు పెట్టగానే విద్యార్థుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాకుండా ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు నూతన వధువరులు. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ నెక్ట్స్ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆదివారం మార్చి 19న తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. మోహన్ బాబు బర్త్‌డే వేడుకలను శ్రీ విద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
పెళ్లిలో మంచు మనోజ్ ఎమోషనల్ (ఫొటోలు)
-
డెస్టినీ కలిపింది.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టంలా నిలుస్తుంది.ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దక్కదు. వాళ్లిద్దరికి వివాహబంధంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా మంచు మనోజ్ విడిపోగా, అనుకోని పరిస్థితుల్లో మౌనిక కూడా విడాకులు తీసుకున్నారు. కానీ డెస్టినీ(విధి)వీళ్లిద్దరిని కలిపింది. ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న మనోజ్-మౌనికలు తమ బంధాన్ని పెళ్లితో పదిలం చేసుకున్నారు. ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరికి ఒకరం తోడుండామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని వెడ్డింగ్ పిక్స్‌ని మంచు లక్ష్మీ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. 'రెండు హృదయాలు, కానీ మనసు ఒక్కటే. ఇలాగే ఎప్పటికీ'.. అంటూ వెడ్డింగ్ మూమెంట్స్‌ని షేర్ చేసింది. నిజమేనేమో మరి..పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనోజ్-మౌనికల జీవితంలో కూడా ఇలాంటిదే జరిగినట్లుంది. అందుకే విడివిడిగా జీవితం ప్రారంభించిన వీళ్లు చివరికి భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలో పెళ్లి సమయంలో మనోజ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగిఉన్న ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టకున్నారు. అటు మౌనిక కూడా మోహన్ బాబును పట్టుకొని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమ్ముడి పెళ్లిలో గెస్టులా మంచు విష్ణు.. అసలేమైంది?
ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఎంతోకాలంగా స్నేహంగా ఉన్న మనోజ్-మౌనికలు తాజాగా పెళ్లిబంధంతో భార్యభర్తలుగా మారారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు..కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చూడముచ్చటైన ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా వాటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భార్య, పిల్లలతో తమ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. రీసెంట్గా మంచు లక్ష్మీ మనోజ్ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఒక్క ఫోటోలో కూడా విష్ణు కనిపించలేదు. అటు విరానికా, విష్ణు దంపతులు కూడా మనోజ్ పెళ్లికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మంచు వారి వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. -
మీ అందరి ఆశీస్సులతో మౌనికతో పెళ్లయ్యింది : మంచు మనోజ్
పెళ్లి తర్వాత మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు కర్నూలుకు చేరుకున్నరు. వివాహం తర్వాత తొలిసారి తన భార్య మౌనికతో కలిసి మనోజ్ అత్తారింటికి వెళ్లారు. మంచు లక్ష్మీ ఇంటి నుంచే భారీ కాన్వాయ్ మధ్య కొత్త దంపతులు కర్నూలుకు చేరుకున్నారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మనోజ్ దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక కర్నూలు వెళ్లగానే ముందుగా మౌనిక తాత ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి)ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో నాకు మౌనికతో పెళ్లయ్యింది. కర్నూలు నుంచి ఆళ్లగడ్డ, కడప ఆ తర్వాత తిరుపతికి వెళ్తున్నాం.మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం అంటూ మనోజ్ పేర్కొన్నాడు. Rocking star @HeroManoj1 & #BhumaMounika are heading to Kurnool with a huge convoy!!🔥🔥#ManchuManoj #ManojWedsMounika pic.twitter.com/64HGfSMGfe — MediaMic Tollywood (@MMTollywood) March 5, 2023 -
పెళ్లి తర్వాత భార్య మౌనికతో మంచు మనోజ్.. ఫోటో వైరల్
మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి వార్తలు తెరమీదకి రాగా, వాటినే నిజం చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్ మౌనిక మెడలో మూడుముళ్లు వేశాడు. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారి భార్యభర్తలయ్యారు. మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లిపనులు దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మీ ఆ ఫోటోలను షేర్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్-మౌనికల పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో మౌనిక కొడుకు ధైరవ్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మనోజ్-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. -
పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి
మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా -
మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనికా రెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే!
మంచు మనోజ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. గత కొద్దిరోజులుగా భూమా మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం చేసుకోనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మనోజ్ తన కాబోయే భార్యను పరిచయం చేశాడు. 'పెళ్లికూతురు భూమా మౌనిక'.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు. దీంతో పలువురు అభిమానులు మనోజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు మౌనిక రెడ్డి ఎవరనే విషయాలపై నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి. పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా కుటుంబంతో మంచుఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో మౌనిక రెడ్డికి 2016లో ఘనంగా వివాహం జరిగింది. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్ కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతకాలంగా మనోజ్- మౌనికల మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యారు. మంచు లక్ష్మీ ఇంట్లోనే ఈ రోజు(శుక్రవారం) రాత్రి 8.30 గంటలకు మనోజ్- మౌనిక వివాహం జరగనుంది. -
సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా
మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈరోజు(శుక్రవారం)8.30 నిమిషాలకు వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే పెళ్లి వేడకు జరగనుంది. ఇప్పటికే మనోజ్ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య ఫోటోను షేర్ చేస్తూ.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ పెళ్లిపై ప్రకటన చేశాడు. ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంసభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. చాలాకాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి కూడా మనోజ్ హాజరయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆమెనే మనువాడబోతుండం విశేషం. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకోగా మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. కొంతకాలంగా మనోజ్- మౌనికలు రిలేషన్లో ఉండగా ఇప్పుడు పెల్లిబంధంతో ఒక్కటి కానున్నారు. -
కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇవాళ(మార్చి 3న) భూమ మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా కాబోయే భార్య ఫొటోను షేర్ చేశాడు. కొత్తపెళ్లి కూతురు అంటూ ముస్తాబైన మౌనిక ఫొటోను తన ట్విటర్లో పంచుకున్నాడు. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత అంతేకాదు దీనికి ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేశాడు. కాగా తన సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఇక మనోజ్ ట్వీట్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు విషెస్ తెలుపుతున్నారు. Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
మంచు వారి ఇంట పెళ్లి సందడి? ఆమెతో మనోజ్ పెళ్లి ఫిక్స్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కానీ వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యిందని, రేపు(మార్చి 3వ తేదీ) వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మనోజ్-మౌనికలు ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం. కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా గతంలో మనోజ్, మౌనికలు పలుమార్లు జంటగా ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆ మధ్య మీడియాతో మాట్లాడిన మనోజ త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ హింట్ ఇచ్చాడు. అతడి రెండో పెళ్లి గురించే అంటూ అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. అయితే గతంలో మనోజ్‌కు ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటూ మౌనికకు కూడా ఇదివరకే పెళ్లై, విడాకులైన విషయం విధితమే. ఇక మనోజ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు. చదవండి: HYD: కేబీఆర్ పార్క్‌లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ.. 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి -
‘భీమ్లా నాయక్’ఫేం మౌనికా రెడ్డి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుంది?
వెండితెరపై నటించాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే రావచ్చు. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో వెండితెర చాన్స్‌లూ కొట్టేస్తున్నారు. అలా వచ్చిన నటే మౌనికా రెడ్డి.. ► మౌనికారెడ్డి వైజాగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తూనే నటనపై ఉన్న మక్కువతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. ► ఓవైపు సిల్వర్ స్క్రీన్ చాన్స్ కోసం వేచి చూస్తూనే ఇంకోవైపు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడం మొదలు పెట్టింది . ‘అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు’ అనే సిరీస్‌తో అప్పుగారిలా అలరించి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. ► బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్‌తో కలసి నటించిన ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ సక్సెస్‌తో సినిమా ఆఫర్లూ రావడం ప్రారంభమయ్యాయి. ► పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్‌గా నటించింది. ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ► ఇప్పుడు.. ఇటు సినిమాలు.. అటు షార్ట్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ► ఈ మధ్యనే పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంది. ► మిగతా ప్రొఫెషన్స్లాగే యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషనే. అందుకే సక్సెస్‌ని పెద్దగా తల తలకెక్కించుకోను అంటుంది మౌనికా రెడ్డి.