
పెళ్లి తర్వాత మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు కర్నూలుకు చేరుకున్నరు. వివాహం తర్వాత తొలిసారి తన భార్య మౌనికతో కలిసి మనోజ్ అత్తారింటికి వెళ్లారు. మంచు లక్ష్మీ ఇంటి నుంచే భారీ కాన్వాయ్ మధ్య కొత్త దంపతులు కర్నూలుకు చేరుకున్నారు.
పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మనోజ్ దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక కర్నూలు వెళ్లగానే ముందుగా మౌనిక తాత ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి)ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో నాకు మౌనికతో పెళ్లయ్యింది. కర్నూలు నుంచి ఆళ్లగడ్డ, కడప ఆ తర్వాత తిరుపతికి వెళ్తున్నాం.మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం అంటూ మనోజ్ పేర్కొన్నాడు.
Rocking star @HeroManoj1 & #BhumaMounika are heading to Kurnool with a huge convoy!!🔥🔥#ManchuManoj #ManojWedsMounika pic.twitter.com/64HGfSMGfe
— MediaMic Tollywood (@MMTollywood) March 5, 2023