newly wedded couple
-
మీ అందరి ఆశీస్సులతో మౌనికతో పెళ్లయ్యింది : మంచు మనోజ్
పెళ్లి తర్వాత మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు కర్నూలుకు చేరుకున్నరు. వివాహం తర్వాత తొలిసారి తన భార్య మౌనికతో కలిసి మనోజ్ అత్తారింటికి వెళ్లారు. మంచు లక్ష్మీ ఇంటి నుంచే భారీ కాన్వాయ్ మధ్య కొత్త దంపతులు కర్నూలుకు చేరుకున్నారు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మనోజ్ దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక కర్నూలు వెళ్లగానే ముందుగా మౌనిక తాత ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి)ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. మీ అందరి ఆశీస్సులతో నాకు మౌనికతో పెళ్లయ్యింది. కర్నూలు నుంచి ఆళ్లగడ్డ, కడప ఆ తర్వాత తిరుపతికి వెళ్తున్నాం.మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం అంటూ మనోజ్ పేర్కొన్నాడు. Rocking star @HeroManoj1 & #BhumaMounika are heading to Kurnool with a huge convoy!!🔥🔥#ManchuManoj #ManojWedsMounika pic.twitter.com/64HGfSMGfe — MediaMic Tollywood (@MMTollywood) March 5, 2023 -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పూలకుంట సర్పంచ్ కాటప్పగారి కృష్ణారెడ్డి కుమారుడు కాటప్పగారి అజయ్ విక్రాంత్‌రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఆశీర్వదించారు. అజయ్ విక్రాంత్‌రెడ్డికి 10 రోజుల క్రితం పులివెందులకు చెందిన దీప్తితో వివాహమైంది. నవ దంపతులు శనివారం రాత్రి ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. చదవండి: (భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ) -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో మూడు నూతన జంటలను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారు (పరిశ్రమలు) రాజోలి వీరారెడ్డి కుమారుడు, కోడలు సాయి శరణ్‌రెడ్డి, జయశాంతిలను ఆశీర్వదించారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుమార్తె హారిక, అల్లుడు పవన్ కుమార్‌రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాధవీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడు రషీద్‌ఖాన్, కోడలు డా.నిషా షేక్‌లను ఆశీర్వదించారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్ యాదవ్ కుమార్తె హేమలత వివాహం గంగాధరతో ఈనెల 3వ తేదీన పులివెందులలో జరిగింది. బుధవారం నూతన వధూవరులను భాకరాపురంలోని ముఖ్యమంత్రి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్, కుమారుడు రామలింగేశ్వర, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి -
పెళ్లి కోసం వధూవరుల సాహసం.. వరద నీటిలోనే..!
చెన్నై: తమిళనాడులో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. దీంతో పలు వివాహాలు సైతం రద్దయ్యాయి. పులియంతోపులలోని ఆంజనేయుడి ఆలయంలో శుక్రవారం జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయి. ఆంజనేయుడి సన్నిధి మొత్తం నీటితో నిండిపోయింది, పరిసరాల్లో సైతం ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో ఆ వరద నీటిలోనే ఐదు జంటలు వివాహం చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితమే ఖరారు చేసిన ముహూర్తం కావడంతో వరదతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ తంతును పూర్తి చేశారు. పై నుంచి చినుకులు రాలుతుండగా.. వరద నీటిలో గొడుగు పట్టుకుని నూతన వధూవరులు ఆలయానికి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వర్షంలోనూ ఎంతో సంతోషంగా ఆలయానికి చేరుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి కొత్త జంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు. చెన్నై సహా చుట్టు పక్కల జిల్లాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. చెన్నై, చెంగల్పెట్, కాంచీపురం, తిరువల్లూర్, విల్లుపురమ్ జిల్లాల్లో పాక్షికంగా మూతపడ్డాయి. #WATCH | Tamil Nadu: 5 weddings that were scheduled at Anjineyar temple in Pulianthope were delayed due to rainfall today. Couples lined up for wedding ceremonies were drenched as they walked through the water logged inside the temple. These weddings were scheduled months ago. pic.twitter.com/OA96wQEiz2 — ANI (@ANI) November 11, 2022 ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
వధూవరులకు సీఎం జగన్ దంపతుల ఆశీర్వాదం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన ఈ రిసెప్షన్లో వరుడు హసిత్, వధువు శ్రీజలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి ఆశీర్వదించారు. చదవండి: (ఇంటింటికి అమృతధార) -
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి సమీప బంధువు, గుంపుల తిరుమలగిరి ఉప సర్పంచ్ నల్లబోలు రాఘవరెడ్డి కుమార్తె వివాహ మహోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సోనియారెడ్డి, నవకిరణ్రెడ్డిని ఆశీర్వదించారు. ఆమె వెంట పిట్టా రాంరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: (రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్ చేస్తా’) -
వివాహం జరిగి ఏడాది నిండలేదు.. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని..
సాక్షి, సీతంపేట/పాడేరు రూరల్: విహారయాత్రలో విషాదం నెలకొంది. వివాహం జరిగి ఏడాది కూడా నిండని దంపతులపై విధి కన్నెర్ర చేసింది. వారి అన్యోన్యతను, ప్రేమానురాగాలను చూసి ఓర్వ లేకపోయింది. భార్యతో కలిసి బైకుపై విహారయాత్రకు వెళ్లగా.. రోడ్డు ప్రమాద రూపంలో వారిని విడదీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ... సీతంపేట కనకమ్మ వీధిలో నివసిస్తున్న జోగా తరుణ్, అతని భార్య హేమలత, మరో నలుగురు స్నేహితులతో కలిసి వంజంగి హిల్స్ చూడటానికి శనివారం బైకులపై బయలుదేరారు. మరో అరగంటలో వారు అందాలను తిలకించే ప్రదేశానికి చేరుకుంటారనగా... పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని వంతాడపల్లి చెక్‌పోస్టు సమీపంలో మలుపు వద్ద తరుణ్ ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారు ఆ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్ వెనుక కూర్చున్న హేమ రోడ్డుపై పడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. బైక్ నడుపుతున్న తరుణ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని కాలర్ బోన్, వెన్నెముక విరిగినట్లు తెలిసింది. ముందుగా తరుణ్‌ను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం కేజీహెచ్‌కు తరలించారు. చదవండి: (2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు) సీతంపేటలో విషాదచాయలు ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సీతంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. వచ్చే నెలలో మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి ఇలా బలితీసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తరుణ్ ల్యాబ్ టెక్నీషియన్. పెదవాల్తేర్‌లో సొంతంగా క్లినికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. గతేడాది డిసెంబర్లో గాజువాకకు చెందిన హేమతో వివాహం జరిగింది. ఇటీవల వంజంగి హిల్స్ అందాలపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆకర్షితులయ్యారు. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరో నలుగురు స్నేహితులతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బైకులపై బయలుదేరారు. వర్షంలో తడుస్తూ.. అక్కడక్కడా ఆగుతూ పాడేరు సమీపంలోకి చేరుకున్నారు. ఇంతలో ప్రమాదం జరిగింది. వంజంగి వెళ్తున్నట్టు తరుణ్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఉదయం 8 గంటల సమయంలో పాడేరు నుంచి ఫోన్ వచ్చాక విషయం తెలిసి.. వారంతా షాక్‌కు గురయ్యారు. హేమ మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే కుటుంబ సభ్యులు పాడేరు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..
సాక్షి, తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందిన విషాదకర ఘటన తిరువళ్లూరు జిల్లా మప్పేడులో చోటుచేసుకుంది. వివరాలు.. అరక్కోణానికి చెందిన మనోజ్‌కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక (30)కు అక్టోబర్ 28న వివాహం జరిగింది. సోమవారం ఉదయం కారులో పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని కూవం వద్ద వెళుతుండగా అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో మనోజ్‌కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. మప్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి చేసిన జంట విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్ట్) -
కరోనా వేళ కొత్త జంట ఔదార్యం
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ సమయంలో నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలందుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా తమ వివాహ తంతు పూర్తి చేయడంతో పాటు కరోనా రోగులకు సహాయపడేలా వినూత్న నిర్ణయం తీసుకుంది ఈ కొత్త జంట. కోవిడ్-19 సంరక్షణ కేంద్రానికి 50 బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర వస్తువులను దానం చేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో స్థానికంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, కమ్యూనిటీ కిచెన్ ద్వారా బాధితులను ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత పట్టణాలకు వెళ్లే వలస కార్మికులకు కూడా సాయపడ్డారట. వివరాలను పరిశీలిస్తే..వాసాయిలోని నందాఖల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) చాలా నిరాడంబరగా పెళ్లి చేసుకున్నారు. కేవలం 22 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. అనంతరం సత్పాలా గ్రామంలో కొవిడ్-19 ఆస్పత్రికి అవసరమయ్యే 50 బెడ్లను, ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇచ్చి తమ ఔదారాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా దిండ్లు, బెడ్షీట్లు, కవర్లు తదితర వస్తువులను కూడా విరాళంగా ఇచ్చారు. వివాహ దుస్తుల్లోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. (కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే) మహమ్మారి కారణంగా చాలామంది మరణిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో, సుమారు 90 మంది మరణించారు.1,500 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నామని లోబో చెప్పారు. ఒక సాధారణ క్రైస్తవ వివాహానికి సుమారు 2వేల మంది అతిథులు హాజరవుతారు. వైన్, మంచి ఆహారం అన్నీ కలిపి భారీగానే ఖర్చవుతుంది. అందుకే భిన్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో సహాయపడటం ద్వారా తమ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనతో మార్చిలో స్థానిక ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్‌ను సంప్రదించి, దీనికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాస్ షిండే ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. మరోవైపు సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచారంటూ ఎరిక్, మెర్లిన్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఠాకూర్ ఈ జంట చేసిన గొప్ప పనికి అభినందనలు తెలిపారు. వాసాయి-విరార్ నివాసితులు సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారనీ, రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. -
నవ దంపతులకు హనీమూన్ కష్టాలు!
మాలీ : హనీమూన్ కోసం మెక్సికో వెళ్లిన ఆ జంట లాక్డౌన్ కారణంగా మాల్దీవులలో చిక్కుకుపోయింది. తీరం తెలియని ప్రయాణంలా వారి హనీమూన్ సాగుతోంది. దేశదేశాలు తిరిగి కష్టాలతో ఎదురీదుతోంది హనీమూన్ వెళ్లిన ఆ నవ దంపతుల జంట. వివరాల్లోకి వెళితే.. ఈజిప్టుకు చెందిన ఖలెద్ మోక్తర్, పెరి అబోజెడ్లు గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్‌లో నివాసముంటున్నారు. గత మార్చి 6న స్వదేశంలోని కైరోలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం మెక్సికోకు వెళ్లారు. ఆ తర్వాత మార్చి 19న టర్కీకి తిరుగు ప్రయాణమయ్యారు. టర్కీనుంచి దుబాయ్‌కి కనెక్షన్ ఫ్లైట్ ఉండటంతో విమానం ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగానే పెరి మిత్రులు ఆమెకో షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా యూఏఈ విమానాల రాకపోకలను నిలిపివేసిందని వివరించారు. వారు టర్కీలో లాండ్ అవ్వగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు కూడా దుబాయ్ వెళ్లే విమానాలు రద్దయ్యాయని వెల్లడించారు. దీంతో తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఎక్కడ గడపాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో ఉండటం సాధ్యపడదని వారు భావించారు. ఈ నేపథ్యంలో వారికి ఈజిప్టు వాసులకు వీసా అవసరం లేని మాల్దీవులు గుర్తుకువచ్చాయి. వెంటనే అక్కడికి వెళ్లిపోయారు. ( నవ దంపతులకు హనీమూన్ కష్టాలు ) మాల్దీవుల్లోనూ తప్పని కష్టాలు ఖలెద్ మోక్తర్, పెరి అబోజెడ్ల జంట మార్చి 27న మాల్దీవులకు చేరుకుంది. అయితే అదే సమయంలో అక్కడ కూడా విమానాల రాకపోకలు, రిసార్టు సేవలు రద్దయ్యాయి. దీంతో దాదాపు 70 మంది ఉంటున్న ఐసోలేషన్ సెంటర్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాలను కాపాడుకోవటానికి సెల్ఫోన్లలో పనులు చేసుకుంటున్నారు. ( మాల్దీవులు చేరుకున్న నౌక.. 1000 మంది..) దీనిపై వారు మాట్లాడుతూ.. ‘‘ ఐసోలేషన్ సెంటర్ వాళ్లు మాకు సరైన సదుపాయాలు కల్పించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. సాయంత్రాలు పాటలు పాడతారు, ప్రతిరోజూ డీజే ఉంటుంది. ఒక్కోసారి ఎవ్వరూ డ్యాన్స్ చేయకపోవటంతో చాలా బాధగా ఉంటుంది. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. మా జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. బాగా ఒత్తిడికి గురవుతున్నాము. న్యూస్ చదవగానే ఏదో నమ్మకం సరిహద్దులు తెరుస్తారని, కానీ, ప్రతిరోజూ కొత్తగా ఉంటోంది. సరైన వ్యక్తితో ఇలా చిక్కుకు పోవటంలోనూ ఓ ఆనందం ఉంది. ఇదొక్కటే మాకు సంతోషాన్నిచ్చే విషయం ’’ అని పేర్కొన్నారు. -
కోవిడ్: కొత్త జంట పరార్
సాక్షి, కాజీపేట: కరోనా వైరస్ మహమ్మారి ఒకవైపువిజృంభిస్తోంటే.. మరోవైపు బాధ్యతగా ఉండాల్సిన పౌరులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు చేతికి వేసిన స్టాంప్ (క్వారంటైన్ మార్క్) ను కూడా లెక్క చేయకుండా ఓ కొత్త జంట పలువురి రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టిన వైనం కాజీపేట్ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులు అప్రమత్తంగా కావడంతో అలర్ట్ అయిన అధికారులు ఆ జంటను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. రైలు ఉదయం 9.45 గంటలకు కాజీపేట స్టేషన్‌కు చేరుకుంది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉపయోగిస్తుండగా, సహ ప్రయాణికులు చేతిపై ఉన్న ముద్రను గమనించి టీటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాజీపేటలో రైలు ఆపి వైద్యులతో సహా ప్లాట్‌ఫాంపైకి వచ్చి వారిద్దరినీ అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వారు ప్రయాణిస్తున్న బీ-3 కోచ్‌లోని ప్రయాణికులను మరో బోగీలోకి పంపించారు. అలాగే బీ-3 కోచ్ ను శానిటైజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా వీరి ఢిల్లీకి బయలుదేరారని తెలిపారు. కాగా శనివారం నాటికి దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 271 కి చేరింది. -
మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి...
పెళ్లి చూపులలోను, పెళ్లిలోను కూడా అమ్మాయిలకు మేకప్ చేసి చూపించడం సర్వసాధారణం. అయితే అది ఒక మాదిరిగా ఉంటే పర్వాలేదు గానీ.. ఏకంగా పూర్తిగా రూపాన్నే మార్చేసేలా ఉంటే కష్టమే. తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంటలోని సదరు మహిళామణి.. సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె వేసుకున్న మేకప్ మొత్తం చెరిగిపోయింది. షార్జాలోని అల్ మంజార్ బీచ్‌లో ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. అది ముగిసిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. నకిలీ కనురెప్పలతో సహా అనేక రకాల మేకప్ సామగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించిందని, తీరా చూస్తే ఆమె అసలురంగు తెలిసిందని సదరు భర్త వాపోయాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆమె డాక్టర్ అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆమె కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడంతో పాటు పెళ్లికి ముందు పలురకాల కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. తాను భర్తకు వాస్తవం ఏంటో చెబుదామని అనుకున్నాను గానీ అప్పటికే బాగా ఆలస్యమైందని చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు ఆమెకు విడాకులు ఇచ్చేశాడట. -
నవ వధూవరుల ఆత్మహత్యాయత్నం.. వధువు మృతి
అనంతపురం(తాడెపత్రి): పెళ్లి అయి మూడు రోజుల కూడా కాకుండానే నూతన వధూవరులు ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన జంటలో వ ధువు మృతిచెందగా వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి లోని నంద్యాల రోడ్డు కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రికి చెందిన పకీరప్ప(25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి(20)తో ఈ నెల 8న వివాహమైంది. అయిత బుధ వారం నూతన వధూవరులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో పడిఉన్న జంట కనిపించింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే నూతన వధువు విజయలక్ష్మి చనిపోగా.. వరుడు పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.