విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా.. | Newlyweds Eliminate in Road Accident Thiruvallur Tamil Nadu | Sakshi
Sakshi News home page

విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..

Published Tue, Nov 2 2021 7:09 AM | Last Updated on Tue, Nov 2 2021 7:24 AM

Newlyweds Eliminate in Road Accident Thiruvallur Tamil Nadu - Sakshi

కార్తీక, మనోజ్‌ (ఫైల్‌)  

సాక్షి, తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందిన విషాదకర ఘటన తిరువళ్లూరు జిల్లా మప్పేడులో చోటుచేసుకుంది. వివరాలు.. అరక్కోణానికి చెందిన మనోజ్‌కుమార్‌ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక (30)కు అక్టోబర్‌ 28న వివాహం జరిగింది. సోమవారం ఉదయం కారులో పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు.

తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని కూవం వద్ద వెళుతుండగా అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న సిమెంట్‌ ట్యాంకర్‌ లారీ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో మనోజ్‌కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. మప్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన  మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి చేసిన జంట విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.   

చదవండి: (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement