thiruvallur
-
చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు
సాక్షి, చెన్నై: చెన్నై వైపు వస్తున్న మైసూరు–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ నుంచి చెన్నై శివారులోని అరక్కోణం, పెరంబూరు, గుమ్మిడిపూండి మార్గం మీదుగా బిహార్ వైపు ప్రయాణించే దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ రైలు రాత్రి 8.30 గంటల సమయంలో పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి గుమ్మడిపూండి సమీపంలోని కవరపేట వద్ద భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ప్రమాదం జరిగిన క్షణాలలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. #TrainAccident 🚨Visuals from the area where Mysuru - Darbhanga Train collided with a Goods train & derailedMore than 12 Coaches derailed & the condition is worst. Still there's "No Accountability" 😑 pic.twitter.com/UeeOGBGBOt— Veena Jain (@DrJain21) October 12, 2024 ప్రమాదం జరిగిన పరిసరాలు చిమ్మచీకటిగా ఉండడంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనతో భీతావహులయ్యారు. ప్రమాద సమాచారంతో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే గోవిందరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రభుశంకర్,ఎస్పీ శ్రీనివాస పెరుమాల్, రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఈశ్వరన్ నేతృత్వంలో బృందం సహాయక చర్యలకు పూనుకుంది. అప్పటికే గ్రామస్తులు రైలు బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అరక్కోణం నుంచి వచి్చన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. ›ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చెన్నైకు తరలించారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. Train accident in chennai Tamilnadu near ghumdipundiTrain no. 12578 please help us @AshwiniVaishnaw @PiyushGoyal @PMOIndia @AmitShah @GMSRailway pic.twitter.com/UqPCzaisIE— Rahul (@kumarsankarBJP) October 11, 2024సిగ్నల్ సమస్యే కారణమా? రైలు 109 కిలోమీటర్ల వేగంతో వెళుతూ భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లోకి మళ్లింది. గార్డ్ సకాలంలో స్పందించి వేగాన్ని క్రమంగా 90 కి.మీ.కి తగ్గించారు. అప్పటికే ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొంది. ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏసీ బోగీలలో స్వల్పంగా మంటలు చెలరేగినా సకాలంలో ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్ వైపు చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు మధ్యలోనే ఆగాయి. అలాగే, గుమ్మిడిపూండి మీదుగా చెన్నైకు రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ రైల్వే యంత్రాంగం 044 25354151, 2435499, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హెల్ప్ లైన్ 0866–2571244 నంబర్‌ను ప్రకటించింది. తిరుచి్చ–హౌరా, ఎర్నాకులం–టాటా నగర్, కాకినాడ–దర్బంగా భాగమతి ప్రత్యేక రైలు సేవలను గూడురు మార్గంలో నిలుపుదల చేశారు. వీటిని ప్రత్యామ్నయ మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి: Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్ -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
ఆ ఒక్క బిస్కెట్ విలువ రూ.1 లక్ష !
తిరువల్లూర్(తమిళనాడు): చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది. -
బెడిసికొట్టిన ‘మద్యం చోరీ’ స్కెచ్.. పోలీసులకు చిక్కిన మందుబాబులు
చెన్నై: తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఇద్దరు మందుబాబుల ‘మద్యం చోరీ’ స్కెచ్ బెడిసికొట్టింది. మద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొని ఓ వైన్ షాప్ గోడకు కన్నం వేసిన దొంగలు.. తీరా లోపలున్న మందు సీసాలను చూశాక కాస్త ప్లాన్ మార్చుకున్నారు. ముందుగా ఓ రెండు పెగ్గులేసి గొంతు తడుపుకొని ఆ తర్వాత ‘పని’కానిద్దామనుకున్నారు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గోడకున్న రంధ్రాన్ని చూసి షాపు వద్దకు వచ్చి చూడగా లోపలి తతంగం వారి కంటపడింది. అయితే దుకాణానికి తాళం వేసి ఉండటంతో వెళ్లిన ‘దారి’లోనే బయటకు రావాలని దొంగలను పోలీసులు ఆదేశించారు. దీంతో తిరిగి వారు రంధ్రంలోంచి బయటకు వచ్చాక అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి -
భర్త నుంచి విడిపోయి పాండిచ్చేరిలో ప్రియుడితో సహజీవనం.. కుళ్లిన స్థితిలో..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్న వివాహిత మహిళ కుళ్లిన స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఎరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన బాబు(36) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అముద(30). వీరికి కుమార్తె జయశ్రీ(10), కుమారుడు కిషోర్(07) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుండి విడిపోయిన అముద అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరన్ అనే వ్యక్తితో కలిసి సహాజీవనం చేస్తోంది. పాండిచ్చేరిలో ప్రియుడితో కలిసి ఉన్న అముదను గత 20 రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకొచ్చి బాబుతో కలిపి వెళ్లారు. అయితే వారం రోజుల తరువాత అముద మళ్లీ భర్తను వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అముద కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని పెద్దకుప్పంలో మహిళ మృతదేహాం కుళ్లిన స్థితిలో కనిపించింది. మహిళ మృతదేహాన్ని వైద్యశాలకు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ అముదగా గుర్తించారు. ఈ సంఘటనపై బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం
తిరువళ్లూరు: విద్యార్థిని ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామే కారణం అని.. సీబీసీఐడీ అధికారులు నిర్ధారించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యానికి గురికావడంతో బంధువులు 2021లో వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి ఆమెను తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి నాగదోషం ఉన్నట్లు నమ్మించి తరచూ యువతిని ఆశ్రమానికి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యువతి బంధువులు ఆశ్రమానికి తీసు కెళ్లారు. రెండు రోజుల తరువాత హేమామాలిని అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత ఫలించక మృతి చెందింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మునస్వామిని మాత్రం అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి మార్చాలని ఆందోళనలు ఉద్ధృమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులు యువతిపై ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి పలుమార్లు అత్యాచారం చేసాడని, తరచూ తనకు లొంగాలని యువతిని వేదించడం వల్లే మనస్థాపం చెంది హేమామాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
20 నిమిషాల పాటు ఫోన్లో.. రైలుకు ఎదురెళ్లి..
చెన్నై: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువళ్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పుట్లూరుకు చెందిన దివ్య(30) బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో రెండు వారాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు పార్లర్‌ను మూసివేసి పుట్లూరులోని ఇంటికి బయలుదేరింది. రైల్వేట్రాక్ వద్ద సుమారు 20 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడింది. ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వెళ్లింది. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చిన్నారిపై ఉపాధ్యాయుడి ఆత్యాచారాయత్నం.. బాలిక వీపుపై..) -
విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..
సాక్షి, తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందిన విషాదకర ఘటన తిరువళ్లూరు జిల్లా మప్పేడులో చోటుచేసుకుంది. వివరాలు.. అరక్కోణానికి చెందిన మనోజ్‌కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక (30)కు అక్టోబర్ 28న వివాహం జరిగింది. సోమవారం ఉదయం కారులో పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు సమీపంలోని కూవం వద్ద వెళుతుండగా అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో మనోజ్‌కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. మప్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి చేసిన జంట విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్ట్) -
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్: తండ్రీకూతురు దుర్మరణం
తిరువళ్లూరు: డివైడర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆవడి సమీపంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు గ్రామానికి చెందిన భాస్కరన్. ఇతను కానిస్టేబుల్‌గా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భాస్కరన్ సోదరి లోకనాయగి ఇంటి గృహ ప్రవేశానికి హాజరై శనివారం రాత్రి పది గంటలకు కుమార్తె ప్రీతితో కలిసి వేపంబట్టుకు బైక్‌లో బయలుదేరారు. ఆవడి సమీపంలోని మోరై వద్ద వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో భాస్కరన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ప్రీతిని స్థానికులు చెన్నై వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు ప్రీతి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో మృతి? టీ.నగర్: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్ కుమారుడు డ్రైవర్ బాలమురుగన్. అతన్ని ఒక కిడ్నాప్ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఎస్ ఆనంద్ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్ 14న రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. -
సిగరెట్ అడిగితే ఇవ్వలేదని..
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సిగరెట్ తీసివ్వడానికి నిరాకరించిన యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని మేట్టుకాలనీకి చెందిన శ్యామ్ అలియాస్ శ్యామ్‌వేల్(20) ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలోని లాల్‌బహుదూర్ శాస్త్రీ వీధిలో వెళుతున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పొన్రాజ్ శ్యామ్, అతని స్నేహితులను పిలిచి తనకు సిగరెట్ కావాలని కోరాడు. అయితే ఇందుకు నిరాకరించిన శ్యామ్ స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో పొన్‌రాజ్‌కు శ్యామ్‌కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన పొన్రాజ్.. సిగరెట్ ఇవ్వని నీకు బతికే అర్హత లేదంటూ కత్తితో శ్యామ్‌ను దారుణంగా పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు, స్నేహితులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలియడంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు నిందితుడి కారును దగ్ధం చేసి నానా రసాభా సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. తిరువళ్లూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కామాంధుడికి పదేళ్ల జైలుశిక్ష
సాక్షి, చెన్నై : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు, 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ముత్తాపుదుపేట గ్రామానికి చెందిన మోసస్ ప్రసన్న దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017 జనవరి 23న ఎనిమిదేళ్ల కుమార్తె ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన ఆంథోని బాలికను సమీపంలోని పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలి పెట్టాడు. ఈ క్రమంలో ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కామాంధుడిపై ఆవడి మహిళా పోలీసు స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ తిరువళ్లూరు మహిళ కోర్టులో సాగింది. విచారణలో నిందితుడు బాలికపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో ఆంథోనికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సెల్వనాథన్ తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
భర్త ప్రియురాలిపై భార్య..!
► చిక్సిత పొందుతూ బాధితురాలి మృతి ► నిందితురాలి అరెస్టు తిరువళ్లూరు: భర్త ప్రియురాలిపై ఓ మహిళ కిరోసిన్ పోసి నిప్పటించింది. ఈ సంఘటనలో బాధితురాలు చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు ప్రాంతానికి చెందిన రాజేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన వైరం అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి సంతోష్, సంజయ్ అనే ఇద్దరు కుమారులున్నారు. వైరం తరచూ ఇంటికి రాకుండా ఉంటుండంతో రాజేశ్వరికి అనుమానం ఏర్పడి విచారించింది. తన భర్తకు వెళ్లవేడులో టీ స్టాల్ నిర్వహిస్తున్న అమ్ములుతో వివాహేత సంబంధం ఉన్నట్టు తెలుసుకుంది. వెళ్లవేడు పోలీసులకు, జిల్లా కలెక్టర్‌కు రాజేశ్వరి వినతి పత్రం సమర్పించింది. అయినా తనకు న్యాయం జరగలేదని పది రోజుల క్రితం రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంటికి పంపారు. అనంతరం బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లవేడుకు వెళ్లిన రాజేశ్వరికి తన వైరం, అమ్ములు సన్నిహితంగా ఉండడం కనిపించింది. దీంతో ఆగ్రహించిన రాజేశ్వరి టీస్టాల్లో ఉన్న కిరోసిన్‌ను తీసుకుని అమ్ములుపై పోసి నిప్పంటించింది. 90 శాతం వరకు కాలిపోయిన అమ్ములును పోలీసులు చెన్నైలోని వైద్యశాలకు తరలించారు. చిక్సిత పొందుతూ శుక్రవారం అమ్ములు మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇంటిలోకి చొరబడిన పాము
తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని వెన్‌మనముదూర్ ప్రాంతంలోని నివాస ప్రాంతంలో చొరబడిన నాగుపామును అగ్నిమాపక సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తిరువళ్లూరు జిల్లా వెన్‌మనముదూర్ గ్రామంలో ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ ఇంటిలోకి నాగుపాము చొరబడడం చూసి ప్రజలు పరుగులు పెట్టారు. నాగుపాము చొరబడడంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అడుగుల నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా వెన్‌మనముదూర్ ప్రాంతంలో నాగుపాము నివాస ప్రాంతంలో చొరబడడం స్థానికంగా సంచలనం కలిగించింది. -
తిరువళ్లూరులో కాల్‌గర్ల్స్
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువళ్లూరులో కాల్ గర్ల్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామి ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ఇక్కడ వ్యభిచార కూపాలు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా శుక్రవారం రాత్రి ఏడుగురు వ్యభిచార నిర్వాహకులు పట్టుబడ్డారు. పది మందికిపైగా ఆంధ్రాకు చెందిన బాలికలు విముక్తి పొందారు. తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వేపంబట్టుకు చెందిన ప్రియా, తిరుపతికి చెందిన మహాలక్ష్మి, నెల్లూరుకు చెందిన రమాదేవితోపాటు మరో నలుగురు బ్రోకర్లను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల విచారణ లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రోకర్లు పేదరికంలో ఉన్న బాలికలపై దృష్టి పెడతారు. ఆ తరువాత వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తిరువళ్లూరుకు రప్పించి వ్యభిచార కూపంలో దింపుతున్నట్టు విచారణలో తేలింది. రెండువారాల నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పది మంది బాలికలు ఈ కూపం నుంచి బయటపడగా, వీరందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సరైన ఉపాధి లేకపోవడం వలన, ఉద్యోగం ఆశ చూపి 15 నుంచి 17 ఏళ్ల బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రోజుకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే వీరిని అడ్డంగా పెట్టుకుని వ్యభిచార గృహ నిర్వాహకులు లక్షల్లో సంపాదిస్తున్నారని వివరించారు. బాలికలను వ్యభిచార కూపంలో దింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి బాలికలను అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. -
గోడౌన్లో మంటలు: నలుగురు సజీవ దహనం
చెన్నై: ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగి నలుగురు కార్మికులు సజీవ దహనమైన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ... భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సజీవ దహనమైన కార్మికులు గోడౌన్లో నిద్రిస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిట్టింగ్ ఎంపీకే పట్టం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలలో సిట్టింగ్ అన్నాడీఎంకే ఎంపీ వేణుగోపాల్ తన స్థానాన్ని దక్కించుకన్నారు. అన్నాడీఎంకే భారీ మోజారిటీతో విజయం సాధించడంతో అ పార్టీ కార్యకర్తలు సంబరాలలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని విజయోత్సవ ర్యాలీనీ నిర్వహించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి గత ఏప్రిల్ 24న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి న ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభిచారు. మొత్తానికి అన్ని రౌండ్లలో తమ సత్తా చాటిన అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ తమ సమీప ప్రత్యర్థి రవికుమార్‌పై మూడు లక్షలపైగా ఓట్లతో తేడాతో విజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలుపొందిన వేణుగోపాల్‌కు కలెక్టర్ వీరరాఘవరావు, ఎన్నికల పరిశీలకుడు అనంతరామ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించండి: మంత్రి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర మంత్రి రమణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా కల్యాణకుప్పం గ్రామంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. సమావేశానికి యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ, విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే మణిమారన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రమణ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని డీఎంకే పార్ట్టీ, కరుణానిధి కుటుంబం దోచుకుని వందేళ్ల అభివృద్ధిలో వెనక్కు నెట్టారని ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లోప్రకటించిన హామీలను నిలబెట్టుకునే విధంగా వాటికి కట్టుబడి వుంటామని రమణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ఆదర్శవంతమైన పాలన అందిస్తే, డీఎంకే అవినీతివంతమైన పాలన అందించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరిస్తే తాము మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రమణ హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని డీఎంకే కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి అన్నాడీఎంకే పార్టీ నేతలతో పాటు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
బాబాసాహెబ్‌కు ఘననివాళి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని ఆయిల్‌మిల్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పురచ్చిభారతం పార్టీ నేతలు మహ, శ్రీధర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది ర్యాలీగా వచ్చి అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు మహ మాట్లాడుతూ నేటి యువత రాజ్యాం గం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని ముందకు సాగాలన్నారు. అనంతరం వీసీకే పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మీరా థియేటర్ వద్ద నుంచి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పార్టీ జిల్లా కన్వీనర్ తలబది సుందరం అధ్యక్షత వహించగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అదే విధంగా బస్టాండు వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి, యువజన నేత రజని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇదే విదంగా అంబేద్కర్ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర ఉపకార్యదర్శి ద్రావిడ సెల్వం ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. -
వెట్టిచాకిరి నుంచి పది మందికి విముక్తి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పదేళ్ల పాటు కట్టెలు కొట్టే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న పది మందికి సబ్ కలెక్టర్, ఆర్డీవో అభిరామి ఆదివారం విముక్తి కల్పించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని ఉట్కోట్టం ప్రాంతానికి చెందిన కుమార్(45) అదే ప్రాంతంలో కట్టెల దొడ్డిని నిర్వహిస్తున్నాడు. ఇతను కడంబత్తూరు ప్రాంతంలోని అదిగత్తూరు ప్రాంతానికి చెందిన పది మందితో పదేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తమకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ బాధితులు ఆదివాసి సంక్షేమ సంఘం ప్రతినిధులను ఆశ్రయించారు. సంఘం ప్రతినిధులు తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి రహస్య సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం కట్టెల దొడ్డిపై ఆమె తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరి చేస్తున్న పది మంది కి విముక్తి కల్పించారు. అనంతరం కుమార్‌పై కేసు నమోదు చేశారు. పది మంది బాధితులకు తాత్కాలిక సహాయం కింద రూ.1000 అందజేశారు. స్వయం ఉపాధి చేసుకోవడానికి రూ.25 వేల చొప్పున అందజేస్తామని ఆర్డీవో అభిరామి వివరించారు.