తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment