Sashikanth
-
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
ఆ హిట్ సినిమాలు ఈ బ్యానర్వే
సాధారణంగా హీరోల పేర్లు చెప్తే సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఈ బ్యానర్ పేరు చెప్తే ఆ సినిమాపై నమ్మకంతో థియేటర్‌కు దారిపడతారు చాలా మంది. డిఫరెంట్ సినిమాలతో, ప్రజలు మెచ్చే కథలతో జనాల్లోకి చొచ్చుకుపోయింది వైనాట్ స్టూడియో. ఇది ఆవిర్భవించి నేటికి సరిగ్గా పదేళ్లవుతోంది. 2010లో నిర్మాత ఎస్. శశికాంత్ వైనాట్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్ నుంచి వెలువడ్డ తొలి సినిమా ‘తమిజ్ పదమ్’. సీఎస్ అముధన్ దర్శకత్వంలో శివ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అందరి దృష్టినీ ఆకట్టుకుంది. అలా తొలి సినిమానే విజయం సాధించడంతో తమ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు తప్పకుండా ప్రజలను ఎంటర్టైన్ చేసేలా, ఆకట్టుకునేలా ఉండాలని ఆ నిర్మాతలు నిర్ణయించుకున్నారు. హద్దులు చెరిపేస్తూ.. సినిమాకు ఆయువుపట్టైన స్క్రిప్ట్‌ను పరిశీలించిన తర్వాత, అది బలంగా ఉందని నమ్మితేనే ఆయా చిత్రాలు నిర్మిస్తారు. ఇప్పటివరకు ఈ బ్యానర్‌పై 18 సినిమాలు తెరకెక్కాయి. హద్దులు చెరిపేసుకుంటూ తమిళ, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లోనూ భాగస్వామ్యం అయింది. ఏఆర్ రెహ్మాన్, రాజ్‌కుమార్ హిరానీ, ఆనంద్ ఎల్ రాయ్ వంటి పలువురు ప్రముఖులతో పనిచేసింది. ‘గురు’, ‘గేమ్ ఓవర్’ వంటి వైవిధ్యభరిత చిత్రాలు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. ఈ చిత్రాలతో కమర్షియల్ హిట్‌ను సాధించిందీ బ్యానర్. మరింతగా విస్తరించిన సంస్థ వైనాట్ స్టూడియో కాలానికనుగుణంగా విస్తరించింది. వైనాట్ సంస్థ 2018లో వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీతో జత గట్టి సంయుక్తంగా సినిమాలను నిర్మించడమే కాక డిస్ట్రిబ్యూట్ రంగంలోకి ప్రవేశించింది. వైనాట్ఎక్స్(YNOTX) ద్వారా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వైనాట్ మ్యూజిక్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ పది సంవత్సరాల ప్రయాణానికి కారణమైన ప్రతి ఒక్కరికీ వైనాట్ వ్యవస్థాపకుడు శశికాంత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ అందించిన ప్రోత్సాహాభిమానాలతో మరిన్ని మంచి సినిమాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. -
ప్రత్యూష అంత పిరికిది కాదు: కిషన్‌రావు
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అల్వాల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత ప్రత్యుష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన అల్లుడు శశికాంత్‌రావే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుషకు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లేవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టచెప్పాడు. అయితే మళ్లీ కొద్దిరోజులుగా భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో ప్రత్యుష బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని, ఆత్మహత్య కాదని చెబుతున్నారు. ఆరేళ్ల నుంచి తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శశికాంత్‌రావు గతంలో బినామీలు పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, ఎక్స్ సర్వీస్‌మెన్ కృష్ణారెడ్డి భూమిని లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడని కిషన్‌రావు తెలిపాడు. ప్రత్యుష అనుమానాస్పద మృతితో పాటు, శశికాంత్‌రావు కబ్జాలపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
మిగిలిన డబ్బు ఫండ్స్‌లో పెట్టండి!
నా పేరు శశికాంత్. వయసు 35 ఏళ్లు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. నా నెల జీతం రూ.75,000. ఇంటద్దెతో కలిసి ప్రతి నెలా రూ.35,000 ఖర్చవుతోంది. నా ఇన్వెస్ట్మెంట్ విషయానికొస్తే ఎల్ఐసీకి చెందిన రెండు న్యూ బీమా గోల్డ్ పాలసీలు తీసుకున్నా. ఈ రెండింటి బీమా రక్షణ మొత్తం రూ.8.50 లక్షలు. ఇందుకోసం ఏటా ప్రీమియం రూపంలో రూ.45,000 చెల్లిస్తున్నా. అలాగే పన్ను మినహాయింపుల కోసం ఏప్రిల్, 2014 నుంచి నెలకు రూ. 2,000 చొప్పున ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. దీంతోపాటు ఏప్రిల్ 2011 నుంచి నెలకు రూ.3,000 చొప్పున ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు సరిగానే ఉన్నాయా? లేక ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా? - శశికాంత్, హైదరాబాద్ - దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒకటోరెండో ఫండ్స్‌ను నమ్మొద్దు - మార్కెట్ రిస్క్‌ను తట్టుకోవాలంటే వైవిధ్యం ఉండాలి - శశికాంత్! జీతానికి తగ్గ బీమా రక్షణ కూడా తీసుకోండి - రైట్ హొరైజన్స్ సీఈఓ అనిల్ రెగో సూచన శశికాంత్! బోలెడన్ని సాధనాలవైపు చూడకుండా మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలైన బీమా, మ్యూచువల్ ఫండ్స్‌కే కేటాయించడాన్ని అభినందిస్తున్నాను. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలో మీరు కొద్దిస్థాయి రిస్క్ చేయగలరని అర్థమవుతోంది. మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో అత్యధిక భాగం... అంటే 62.57 శాతం బీమాకు కేటాయిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌కి 37.43 శాతం కేటాయించారు. మీరు 20 ఏళ్ళ కాలానికి దీర్ఘకాలిక సంప్రదాయ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే బీమా పథకాలపై 6 శాతం రాబడిని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ రూ. 9.47 లక్షలు. బీమా.. ప్రస్తుతం మీకు బీమా రక్షణ రూ. 8.5 లక్షలు మాత్రమే ఉంది. మీ ఆదాయానికి, బాధ్యతలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. కాబట్టి మరింత బీమా రక్షణ పెంచుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను తీసుకోండి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు తగినంతగా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్.. మీరు రెండు మంచి ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పథకాల్లోకి పెట్టుబడిని మరింత పెంచడంతో పాటు పోర్ట్ఫోలియోలకి మరిన్ని ఫండ్స్‌ను జత చేసుకోండి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసం మిడ్ అండ్ స్మాల్ క్యాప్, బ్యాలెన్స్డ్ ఫండ్ కేసి చూడండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో సంపద పెరగడంతో పాటు, పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. దీర్ఘకాలిక ఈక్విటీ రాబడులపై ఎటువంటి పన్ను ఉండదన్న సంగతి తెలుసు కదా!. మ్యూచువల్ ఫండ్స్‌లో మరింత పెట్టుబడుల కోసం ఈ పక్కనున్న పథకాలను పరిశీలించండి. - ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ క్యాప్ ఫండ్స్ - ఐసీఐసీఐ వేల్యూ డిస్కవరీ ఫండ్ - ఎల్ అండ్ టీ ఈక్విటీ ఫండ్ - ఎడల్వీజ్ ఎడ్జ్ టాప్ 100 ఫండ్ - టాటా బ్యాలెన్స్డ్ ఫండ్ - హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ ఇలా చేయండి.. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిం చుకోవాలి. అలాగే తగినంత జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణను కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోండి. ఇది అత్యవసర సమయాల్లో వైద్య చికిత్సావ్యయాలకు అక్కరకు వస్తుంది. ముఖ్యాంశాలు.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకేరకమైన వాటిల్లో కాకుండా పెట్టుబడిలో వైవిధ్యం ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఒడిదుడుకులను తట్టుకోగలరు. ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే కాకుండా మధ్యమధ్యలో వాటి పనితీరును పరిశీలించండి. అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటే చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధానం అనుసరించడం ద్వారా మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు. మీ పెట్టుబడులు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇలా మార్చుకోవాలి ఇక మీ ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఇంకా రూ.31,000 పొదుపు చేసే సామర్థ్యం మీకుంది. ఈ మొత్తాన్ని పట్టికలో చూపిన విధంగా ఇన్వెస్ట్ చేయండి. -
పట్టపగలే.. నడిరోడ్డుపై హత్యాయత్నం
కాపుకాచి దాడికి పాల్పడిన ప్రత్యర్థులు మదనపల్లె రూరల్: పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిపై మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్వీఆర్ లేఅవుట్లో నివాసముంటున్న క్రిష్ణమూర్తి కుమారుడు శశికాంత్(28). బసినికొండ నుంచి ద్విచక్ర వాహనంలో నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్‌కు వస్తున్నాడు. ఇంతలో కాపుకాచిన ప్రత్యర్థులు ఎన్‌జేఆర్ కల్యాణ మండపం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చి శశికాంత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. కిందపడిన వెంటనే మారణాయుధాలతో ఒంటిపై పొడిచారు. ఆపై స్థానికుల రాకను గమనించి పరారయ్యారు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా విచారణలో గాయపడిన శశికాంత్ రెండు రోజులక్రితం బర్మావీధిలోని అరుణ్ ఐస్‌క్రీమ్ పార్లల్లో గొడవపడ్డట్టు తెలిసింది. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిలో నగేంద్ర, ఈశ్వర్, ప్రదీప్, కిషోర్ ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజాలు దేవుడికెరుక: తప్పు ఎవరిది?
నమ్మకం బంధాల్ని నిలబెడుతుంది. కానీ అతడు నమ్మకానికి తూట్లు పొడిచాడు. బంధాన్ని కాలరాశాడు. కాలనాగై కాటు వేశాడు. అలాంటివాడిని శిక్షించాలా? క్షమించి వదిలేయాలా? ఈ ప్రశ్నలకు తనకు తానే సమాధానం వెతుక్కుంది ప్రజక్త. కానీ ఆమెకు దొరికిన సమాధానం ఆమె జీవితాన్నే మార్చేసింది. అసలు ప్రజక్త జీవితంలో ఏం జరిగింది? జూలై 9, 2009. ముంబైలోని డోంబ్వలీ. అనుపమ నగర్‌లోని ఆటస్థలం వద్ద జనం గుమిగూడి ఉన్నారు. గుసగుసలాడు కుంటున్నారు. అంతలో పోలీసు సైరన్ వినిపించింది. పోలీసు జీపు వేగంగా వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ మెహతా కానిస్టేబుళ్లతో దిగాడు. వారిని చూడగానే ఓ వ్యక్తి ఎదురు వెళ్లాడు. ‘అక్కడ సర్’ అంటూ చూపిం చాడు. పోలీసుల అటువైపు నడిచారు. ఓ మూలగా... ఇసుకలో బోర్లా పడివుంది ఓ నలభయ్యేళ్ల వ్యక్తి మృతదేహం. మరణించి చాలా సమయం అయినట్టుగా ఉంది చూస్తుంటే. శరీరం మీద నల్లప్యాంటు, చారల చొక్కా ఉన్నాయి. చెప్పులు దూరంగా పడివున్నాయి. కానిస్టేబుళ్లు బోర్లా పడివున్న మృతదేహాన్ని తిప్పి వెల్లకిలా పడుకోబెట్టారు. కత్తిపోట్లు కానీ, తుపాకీతో కాల్చిన గుర్తులు కానీ లేవు. ముఖం రక్తంతో తడిసి ముద్దయ్యింది. తల పగిలిపోయి వుంది. అంటే ఏదో బరువైన వస్తువుతో తలమీద మోది చంపారని అర్థమైంది మెహతాకి. ఆ వస్తువు కోసం పెద్దగా గాలించాల్సిన పని లేకుండా పోయింది. మృతదేహానికి కాస్త దూరంలోనే ఓ బండరాయి కనిపించింది. ‘‘బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపండి. ఆ రాయిని కూడా ల్యాబ్‌కి పంపించండి’’ అంటూ జీపువైపు నడిచాడు. ఎక్కబోతూ ‘సర్’ అన్న పిలుపు వినిపిండంతో ఆగి చూశాడు. కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. ‘‘వాళ్ల బాబాయ్ కనబడటం లేదని మొన్న కంప్లయింట్ ఇచ్చాడు కద సర్. అతనిచ్చిన ఫొటోలోని వ్యక్తి వేసుకున్న బట్టలు, ఇప్పుడీ బాడీ మీద ఉన్న బట్టలు ఒకేలా ఉన్నాయి సర్.’’ కానిస్టేబుల్ షార్పనెస్కి ముచ్చట పడ్డాడు మెహతా. ‘‘అతణ్ని పిలిపించు. బాడీని గుర్తుపడతాడేమో చూద్దాం’’ అంటూ జీపెక్కాడు. కానిస్టేబుల్ సెల్యూట్ చేశాడు. జీపు వేగంగా వెళ్లిపోయింది. ‘‘బాబాయ్’’... మృతదేహాన్ని చూస్తూనే ఘొల్లుమన్నాడా యువకుడు. ‘‘సర్... ఈయన మా బాబాయే సర్. నాలుగు రోజుల్నుంచీ కనిపించడం లేదు. ఇప్పుడేమో ఇలా...’’ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఊరుకోమన్నట్టుగా అతడి భుజం తట్టాడు మెహతా. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ అర్జున్... నాకు కొన్ని వివరాలు కావాలి’’ కళ్లు తుడుచుకున్నాడు అర్జున్. అడగమన్నట్టుగా చూశాడు మెహతా వైపు. ‘‘మీ బాబాయ్ పేరు...’’ ‘‘సంతోష్ శంకర్ పవార్. మంత్రాలయం కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు.’’ ‘‘ఆయనకెవరైనా శత్రువులున్నారా?’’ ‘‘లేదు సర్. ఆయన అందరితోనూ ప్రేమగా ఉంటారు. చాలా మంచి వ్యక్తి.’’ ‘‘సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎవరితోనైనా గొడవపడటం గానీ, ఎవరైనా ఆయనను బెదిరించడం లాంటివి గానీ జరిగాయా?’’ లేదన్నట్టుగా తలూపాడు అర్జున్. ‘‘మీరడిగినవేమీ జరగలేదు కానీ... కనిపించకుండా పోకముందు బాబాయ్ చివరిసారిగా శశికాంత్ ని కలిశారు.’’ ‘‘శశికాంత్ ఎవరు?’’ ‘‘మా బాబాయ్ సొంత తమ్ముడి అల్లుడు శశికాంత్. ఆ రోజు రాత్రి తనను కలవడానికే వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.’’ ‘‘మరి శశికాంత్‌ని అడగలేదా?’’ ‘‘అడిగాం సర్. కానీ తనను కలిశాక బాబాయ్ ఇంటికి వెళ్లిపోయారని చెప్పాడు. తనొక్కడే చెబితే అనుమానించేవాళ్లం. కానీ మా చెల్లి, అంటే శశికాంత్ భార్య ప్రజక్త కూడా అదే చెప్పింది.’’ ఒక్కసారిగా వెయ్యి ఆలోచనలు ముప్పిరిగొన్నాయి మెహతా పోలీసు బుర్రలో. అర్జున్‌ని తీసుకుని శశికాంత్ ఇంటికి బయలుదేరాడు. కానీ అక్కడ అతడు గానీ, అతడి భార్య కానీ లేరు. ఇద్దరూ నాలుగు రోజుల క్రితమే ఊరికెళ్లారని శశిధర్ తల్లి చెప్పింది. దాంతో మెహతా అనుమానాలు బలపడ్డాయి. నాలుగు రోజుల క్రితం అంటే... సంతోష్ పవార్ హత్య జరిగిన రోజే వాళ్లు వెళ్లిపోయి ఉంటారు. కాదు... పారిపోయి ఉంటారు. వెంటనే తన బలగాలను రంగంలోకి దింపాడు. శశిధర్ స్నేహితులు, ప్రజక్త స్నేహితులందరి గురించీ వాకబు చేశారు. శశిధర్వాళ్లు ఊరెళ్లినప్పట్నుంచీ అతడి స్నేహితులు ముగ్గురు ఊళ్లో కనిపించడం లేదని తెలిసింది. వాళ్ల వివరాలు కూడా చేతబట్టుకుని వెతకడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు వారి అన్వేషణ ఫలించింది. ముంబైలోని ఓ చిన్న హోటల్ గదిలో అందరినీ ఒకేసారి పట్టుకున్నారు. ‘‘పవార్‌ని ఎందుకు చంపారు?’’ మాట్లాడలేదు ప్రజక్త. మౌనంగా తల దించుకుని కూచుంది. ‘‘మౌనంగా ఉంటే కుదరదు ప్రజక్తా... ఆయన్నెందుకు చంపారు?’’ పెదవి మెదపలేదు ప్రజక్త. తల ఎత్తకుండా అలానే ఉంది. మెహతా కానిస్టేబుల్ వైపు చూశాడు. అతడు లాఠీ తీసుకుని సెల్‌లోకి వెళ్లాడు. శశికాంత్‌ని, అతడి ముగ్గురు స్నేహితుల్నీ చితకబాదడం మొదలుపెట్టాడు. ప్రజక్త కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. తన భర్త బాధాపూరిత ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుంది. అది చూసి కొట్టడం ఆపమన్నట్టు సైగ చేశాడు మెహతా. కానిస్టేబుల్ ఆపేశాడు. ‘‘చూశావ్‌గా ప్రజక్తా... నీ మౌనం నీ భర్తను హింసకు గురి చేస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పు. లేదంటే నీ భర్తని, అతడి స్నేహితులని మళ్లీ చూడలేవు.’’ ‘‘వద్దు’’ అరిచినట్టే అంది. ‘‘వాళ్లు నా కోసమే ఇదంతా చేశారు. వాళ్లని విడిచి పెట్టండి’’... చేతులు జోడించింది. ‘‘నువ్వు నిజం చెబితే మేం వాళ్ల ఒంటిమీద చేయి కూడా వెయ్యం. చెప్పు.’’ ‘‘అతణ్ని మేమేం చంపాం.’’ ఆశ్చర్యపోయాడు మెహతా. పెద్ద ఖరీదు చేయని జార్జెట్ చీర, వాలు జడ, కుంకుమతో సంప్రదాయబద్దంగా ఉంది ప్రజక్త. ఓ మనిషిని చంపేంత రాక్షసత్వం ఉందా ఆమెలో? ‘‘ఛ... నీలాంటివాళ్ల వల్లనే ఆడాళ్లందరికీ చెడ్డపేరు వస్తోంది. సొంత పెదనాన్నని, అందులోనూ నిన్ను పెంచినవాడిని చంపింది కాక, ఎంత తెగింపుతో చెబుతున్నావ్ చంపేశానని! నీలాంటివాళ్లని...’’ ‘‘ఏం చేయాలి సర్’’... అతడి మాట పూర్తి కాకుండానే అడ్డుపడింది ప్రజక్త. ‘‘ఏం చేయాలి సర్... ఉరి తీయాలా, నరికేయాలా? ఏం చేయాలంటే అది చేయండి. వాడికి తగిన శిక్ష నేను వేశాను. అందుకు నాకు శిక్ష మీరు వేయండి.’’ ‘‘శిక్ష వేశావా? అతడేం చేశాడు?’’ ‘‘నన్ను బతికున్న శవాన్ని చేశాడు. రాబందులు కూడా శవాలనే పీక్కు తింటాయి. కానీ వీడు బతికుండగానే నన్ను కాల్చుకు తిన్నాడు. వాడు మనిషి కాదు. పశువు. వాడికి అదే సరైన శిక్ష.’’ ప్రజక్త అరుపులకు కోపం రాలేదు మెహతాకి. తన సొంత పెదనాన్నని ఎందుకు చంపిందో ఆమె చెబుతుంటే విని విస్తుపోయాడు. ముంబైకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ప్రజక్త కుటుంబం నివసిస్తోంది. ప్రజక్త బడి చదువు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో పిల్లలు లేని తన సొంత అన్న ఇంట్లో ఆమెను వదిలిపెట్టాడు తండ్రి. సంతోష్ పవార్ భార్య ప్రజక్తను ప్రేమగా చూసేది. పవార్ కూడా బాగానే చూసేవాడు. కానీ ఆ చూడటం వెనుక ఉన్న ఉద్దేశం వేరు. అతడి ప్రేమ మలినమైంది. అతడి మంచితనం కపటమైనది. వాటిని గుర్తించడం చిన్నపిల్ల అయిన ప్రజక్త వల్ల కాలేదు. అందుకే అతడి చేతిలో ఆటబొమ్మ అయ్యింది. కూతురని కూడా చూడకుండా కాటు వేస్తుంటే... కన్నీటిని దిగమింగుకుంది. ఎవరికైనా చెబితే నిన్నే తప్పుగా అనుకుంటారు అని అంటే నిజమేననుకుని నిజాన్ని గుండెల్లో దాచేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించింది. అంతలో శశికాంత్ పరిచయమ య్యాడు. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడు ఆటో డ్రైవర్ కావడంతో ప్రజక్త తండ్రి ఒప్పుకోలేదు. కానీ సంతోష్ పవార్ మాత్రం పెద్ద మనసును ప్రదర్శించాడు. వాళ్లిద్దరి పెళ్లికీ తమ్ముడిని ఒప్పించాడు. అన్నకి తన కూతురి మీద ఉన్న అనురాగాన్ని చూసి మురిసిపోయాడు ప్రజక్త తండ్రి. వేరే ఎవరికైనా ఇచ్చి చేస్తే ప్రజక్త తన నుండి దూరమైపోతుందన్న ఉద్దేశంతో అన్నగారు ఆ పని చేశాడని అర్థం చేసుకోలేకపోయాడు. ప్రజక్తకు పెళ్లయ్యింది. తల్లిలా చూసుకునే అత్తగారు, గుండెల్లో దాచుకునే భర్త నీడలో కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ పాత జీవితపు నీడ ఆమెను వదిలిపెట్టలేదు. కూతురి మీద బెంగ అంటూ సంతోష్ పవార్ మాటిమాటికీ రావడం మొదలుపెట్టాడు. అందరూ ఉన్నప్పుడు పెదనాన్నలా... ఎవరూ లేనప్పుడు పశువులా ప్రవర్తించేవాడు. అతడికి ఎదురు చెప్పలేక, తన వేదనను ఎవరికీ చెప్పు కోలేక ప్రజక్త నలిగిపోసాగింది. ఆమె మథనాన్ని శశికాంత్ గమనించాడు. ఏం జరిగిందని నిలదీశాడు. అర్థం చేసుకుంటాను చెప్పమన్నాడు. దాంతో జరిగినదంతా వివరించింది ప్రజక్త. నిర్ఘాంతపోయాడు శశికాంత్. ఎలాగైనా మామగారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన భార్య, స్నేహితులతో కలిసి ప్లాన్ చేసి సంతోష్ పవార్‌ని అనుపమ నగర్ ఆటస్థలం వద్దకు రప్పించాడు. ఇంకోసారి తన భార్య జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. కానీ పవార్ వినలేదు. ఎదురు తిరిగాడు. దాంతో ఆవేశంలో అతణ్ని హతమార్చారు. ‘‘చెప్పండి సార్... నాలాంటివాళ్ల వల్లే ఆడవాళ్లందరూ చెడిపోతున్నారని అన్నారు కదా. మరి ఇలాంటి వాళ్ల వల్ల నాలాంటి వాళ్లు ఎందరో చెడిపోవడం లేదా సర్?’’ ప్రజక్త ప్రశ్న మెహతా గుండెల్లోకి దూసుకుపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ‘‘నీకు చాలా అన్యాయమే జరిగింది ప్రజక్తా... కానీ అలాంటివాళ్లని చట్టానికి పట్టించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. సారీ’’ అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. నిజమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ప్రజక్త లాంటి నిస్సహాయురాలు చట్టం గురించి ఎలా ఆలోచించగలుగుతుంది! తను చేసింది తప్పే. కానీ అది చేయడానికి ముందు ఆమె అనుభవించిన నరకం మాటేమిటి! ఆమే కాదు. ఆమెలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. తండ్రిలాంటి వాడని దగ్గరికెళ్తే తడిమి తడిమి ఇబ్బంది పెడతాడొకడు. అన్నయ్యా అని పిలిచినా పట్టించుకోకుండా ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తాడొకడు. అంకుల్ అంటూ పలకరిస్తే వంకర చూపులతో విసిగిస్తాడింకొకడు. బాస్ అని నమ్మి క్యాంప్కెళ్తే శీలాన్ని దోచుకుని బానిసను చేసుకోవాలని చూసేవాడు మరొకడు. ఎన్ని ఘోరాలు? ఎన్ని దారుణాలు? బలైపోయే సమయంలో ఏ చట్టమూ కాపాడదు. బలి తీసుకున్నవాడిని తిరిగి బాధపెడితే మాత్రం తప్పంటుంది. ఇదేనా న్యాయం? ఇది ప్రజక్త అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు చెబుతారు?! - సమీర నేలపూడి