member of parliament
-
ఆడపిల్లల చదువుకు ఐదేళ్ల జీతం.. పెద్ద మనసు చాటుకున్న ఎంపీ
పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే.. -
New Zealand: ఆమె మళ్లీ వచ్చింది.. దద్దరిల్లిన పార్లమెంట్!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.తాజాగా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.🇳🇿 Māori MPs performing the Haka in New Zealand Parliament ripping apart a bill redefining the Treaty of Waitangi.The Treaty of Waitangi is a document of central importance to the history of New Zealand, its constitution, and its national mythos. pic.twitter.com/OeUZ0g1UMj— Lord Bebo (@MyLordBebo) November 14, 2024ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు. -
‘ఆప్’ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
న్యూఢిల్లీ:పంజాబ్‌కు చెందిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్ -
నృత్య ప్రపంచంలో ఆమె ఓ అద్భుత శిఖరం..! ఏకంగా రాజ్యసభ..
పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయి ప్రపంచ స్థాయిని అందుకున్న భరతనాట్య నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్ ఓ అద్భుత శిఖరం. ఆమె ఎనిమిది పదుల జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సోనాల్ మాన్ సింగ్ పేరు మాత్రమే కాదు ఆమె ధిక్కరణ, ధైర్యం, అభిరుచికి నిలువెత్తు చిహ్నం. చిన్న నాటి నుంచి ఆమె నృత్యం కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉండాలనుకోలేదు. నృత్యం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవాలనుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణం, సామాజిక నిబంధనలను సవాల్ చేయడానికి నృత్యం ఒక మార్గంగా భావించింది. ‘‘నాకు 15, 20, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ప్రదర్శనలు ఇస్తున్నాను అని చెప్పేదాన్ని. కానీ డ్యాన్స్ నాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది‘ అని 80 ఏళ్ల ఈ భారత శాస్త్రీయ నృత్యకారిణి, భరతనాట్యం, ఒడిస్సీ నృత్య గురువు సోనాల్ మాన్సింగ్ వివరిస్తారు. పద్మ భూషణ్ (1992), పద్మ విభూషణ్ (2003) గ్రహీత, పార్లమెంటు, రాజ్యసభ సభ్యురాలు కావడానికి నామినేట్ అయిన సోనాల్ ప్రతి నృత్య అడుగు మనకు ఓ పాఠంగా అవుతుంది.‘కృష్ణ’ ప్రదర్శన మాత్రమే కాదుడ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం. అందుకే డ్యాన్స్‌తోపాటు వృత్తిని కొనసాగించమని అడిగితే ఇంటి నుంచి పారిపోయి, బెంగళూరుకు వెళ్లి, అక్కడ నాట్య గురువుల ఇంట్లో ఆశ్రయం పొందాను. ప్రొఫెసర్ యు.ఎస్.కృష్ణారావు, చంద్రభాగ దేవిల వద్ద శిక్షణ పొందాను. ఇటీవల ఇండియా హాబిటాట్ సెంటర్లో ’కృష్ణ’ అనే నాట్య కథను ప్రదర్శించాను. దీని గురించి ఎందుకు చెబుతునాన్ననంటే ఈ ఆలోచన నా చిన్నప్పటి నుంచి ఉండేది. చదివిన సాహిత్యం.. ముఖ్యంగా మన పురాణాలు, మహాభారతం నుంచి వచ్చింది. ’కృష్ణ’ అన్నింటి మిశ్రమం.ప్రమాదం జరిగినా ఎదురీతే! చిన్ననాటిఋ నుంచి వేషం వేసుకుని దరువులకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదాన్ని. నాలుగేళ్ల వయసులో క్లాసికల్ మణిపురి డ్యాన్స్ కాస్ట్యూమ్ ధరించి డ్యాన్స్ చేశాను. భరతనాట్యం ప్రశాంతతను ఇచ్చేది. 1974లో జర్మనీలో కారు ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయి. ఇకపై డ్యాన్స్ చేయలేనని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ, పట్టువదలలేదు. ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత ఏడాదిలోనే ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్ నుంచి మాత్రమే శక్తిని పొందుతాను. నా జీవితంలో నేను ఎప్పుడూ డిప్రెషన్ గా భావించలేదు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.స్త్రీత్వం గురించి గర్వంఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి నృత్యాన్ని నమ్ముకొని, ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎవరూ నమ్మరు. క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ స్త్రీత్వానికి సంబంధించినది. పురుషులు ఎప్పుడూ ఉపాధ్యాయులు, మహిళలు నృత్యకారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తున్నారు. వారేం చేసినా నృత్యంలో స్త్రీలే రాజ్యమేలారు. అందుకే నా నృత్యాల్లో ‘పంచకన్య’, ’ద్రౌపది’, ’మీరా’. స్త్రీ శక్తికి సంబంధించినవి ఉంటాయి. ’ నృత్యం నేర్చుకోవాలని తపించేవారు ఎప్పుడూ వ్యక్తిగతంగానే గురువును వెతకాలని’ అంటూ నృత్య పాఠాలను వివరిస్తుంది సోనాలి మాన్సింగ్. (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! ) -
రేపు ప్రమాణం చేయనున్న అమృత్‌పాల్
చండీగఢ్/అమృత్సర్: విచారణ ఖైదీగా అస్సాం జైలులో గడుపుతున్న ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ జూలై ఐదో తేదీన పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణంచేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్‌పాల్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి గెలిచారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు 2లక్షల భారీ మెజారిటీతో గెల్చిన విషయం తెల్సిందే. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్‌పాల్ విచారణ ఖైదీగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణంచేసేనాటికి ఈయనకు పెరోల్ లభించలేదు. తాజాగా జూలై 5వ తేదీ నుంచి నాలుగురోజులపాటు పెరోల్ దొరికింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్లో ఈయనతో ఎంపీగా ప్రమాణంచేయిస్తారని ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ ఖల్సా బుధవారం వెల్లడించారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్ళే..
-
టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఉన్న 17 లోక్‌సభ స్థానాల కోసం.. మొత్తం 306 దరఖాస్తులు గాంధీభవన్‌కు వచ్చాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చాయి. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 100కిపైగా అప్లికేషన్లు రాగా.. దరఖాస్తులు ఇచ్చిన వాళ్లలో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో.. వాళ్ల స్థానాల్లో పోటీకి బంధువులు, సన్నిహితులు ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బంధువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్, బంధువు చల్లూరి మురళీధర్ అప్లికేషన్లు సమర్పించారు. రేవంత్ సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. అలాగే.. రేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి, చామలచకిరణ్లు సైతం దరఖాస్తులు సమర్పించారు. ఇక నల్గొండ సీటు కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్ దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ సీటు కోసం తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు అప్లికేషన్ సమర్పించడం గమనార్హం. దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్‌గిరితో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ కోసం మొత్తంగా నాలుగు దరఖాస్తులు అందజేశారు. హాట్ సీటు ఏదంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున హాట్‌సీట్‌గా మారింది ఖమ్మం లోక్‌సభ స్థానం. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పలువురు దరఖాస్తులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీ హనుమంతరావులు సైతం అప్లికేషన్లు ఇచ్చారు. తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. హాట్ టాపిక్‌గా గడల ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా గడల శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్ డైరెక్టర్‌గా ఉండి.. అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసినా.. లాంగ్‌లీవ్‌లో ఉండి మరీ ఆయన సన్నిహితుల ద్వారా గాంధీభవన్‌కు దరఖాస్తు పంపించడం గమనార్హం. -
టార్గెట్ లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ బీజెపీ అభ్యర్థుల జాబితా రెడీ?
సాక్షి, హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకముందు కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన బాబు.. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శౠతం టీడీపీ ఖాళీ కాబోతోందని అన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. -
ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్.. ఎంపీ రేసులో ఎవరెవరంటే?
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సంబంధికులు టికెట్ రేసులో ఉన్నారు. టికెట్ వస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను సైతం ఇప్పటికే ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది. తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ రేసులో ఉన్న వారంత కీలకమైన నేతలే. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక ఖమ్మం జిల్లాకే మూడు మంత్రి పదవులను కేటాయించిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు వచ్చిన వారంత కీలక నేతలే కావడం విశేషం. డిప్యూటి సీఎం పదవి భట్టి విక్కమార్కకు రాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుకు మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీగా సీట్లు రావడం వెనుక సైతం ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇక, సీన్ కట్ చేస్తే ఈ ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు ఎంపీ టికెట్ రేసులో ఉండటం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ చోట్ల జరిగిన సభల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో భట్టికి ఉన్న అనుచర గణం, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మధిర నుంచి ఆయన విజయం సాధించడం వంటి అంశాలు నందినికి కలిసొస్తాయని మద్దతుదారులు చెబుతున్నారు. భట్టి పోటీ చేసిన ప్రతీసారి ఆమె నియోజకవర్గమంతా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిచయాలు, భట్టి నాయకత్వం కలిసొస్తాయనే భావనతో పోటీకి సై అంటున్నారు. మరో కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం నుంచి వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏ కార్యక్రమం చేపట్టినా సోదరుడు ప్రసాద్‌రెడ్డి తెర వెనుక నుంచి అన్ని తానై చూసుకుంటున్నారు. పార్టీ నేతలు, కేడర్‌కు పూర్తిస్తాయిలో అందుబాటులో ఉంటూ 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పొంగులేటి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ప్రసాద్‌రెడ్డి ఖమ్మం ఎంపీ బరిలో నిలబడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటికి ఉన్న చరిష్మా తోడైతే ప్రసాద్‌రెడ్డి విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ పరిధి నేతలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనయుడు యుగంధర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంతో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం ఆలోచనలో ఉన్నట్లు తుమ్మల అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు స్థానాల్లో తుమ్మల పోటీ చేసినప్పుడల్లా యుగంధర్ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతలన్నీ ఆయనే దగ్గరుండి చూశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సైతం ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలకు భారీ మెజార్టీ రావడంలో యుగేంధర్ కీలకంగానే వ్యవహరించారు. దీంతో యుగంధర్ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ తుమ్మల అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మంత్రుల సంబంధికులతో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ కొసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర నేతలు ఇప్పటికే కోరారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే, ఒకవేళ పోటీ చేసే అవకాశం ఉంటే పార్టీ కొంత వీక్ ఉన్న ప్రాంతంలోనే సొనియాను బరిలో నిలిపాలని భావిస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి మంచి పట్టు ఉంది. ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ వంటి బలమైన నేతకు ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే పార్టీకి కొత్తగా లాభం చేకూరేదేమీ ఉండదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఈసారి కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
BJP MP Ramshankar Katheria.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎంపీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన లోక్‌సభకు అనర్హుడయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, సదురు ఎంపీకి ఓ వ్యక్తిపై దాడి కేసులో కోర్టు జైలు విధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఇతావా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రామ్ శంకర్ కటారియాకు ఆగ్రా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో కటారియాకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పును వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ నుంచి అనర్హత వేటు పడే అవకాశమున్నది. కాగా, 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశారు. నాడు ఆగ్రా ఎంపీగా ఉన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, 12 ఏళ్ల నాటి దాడి కేసుపై ఆగ్రా కోర్టు విచారణ జరిపింది. రామ్ శంకర్ కటారియాను దోషిగా నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని తెలిపారు. అయితే రెండేళ్ల జైలు శిక్షపై పైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన న్యాయ విధానాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ శంకర్ కటారియా నవంబర్ 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అతను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆఫ్ డిఫెన్స్ మరియు కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సభ్యుడుగా కొనసాగారు. #WATCH | "...I appeared before the court normally. Court has given a decision against me today. I respect the court, I have the right to appeal and I will exercise it," says BJP MP Ramshankar Katheria #RamshankarKatheria pic.twitter.com/QVmx8pfcAX — NewsMobile (@NewsMobileIndia) August 5, 2023 ఇది కూడా చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
ఢిల్లీ: మహారాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ సురేశ్ ‘బాలు’ ధానోర్కర్(47) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించగా.. ఇవాళ ఆయన కూడా మరణించడం ఆ కుటుంబంలో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నింపింది. సురేశ్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకునేందుకు మే 26న సురేశ్ ధానోర్కర్ నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. సురేష్ ధానోర్కర్ తండ్రి నారాయణ్ ధానోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో గత శనివారం మరణించారు. ఆస్పత్రిలో ఉండడంతో.. ఆదివారం జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరుకాలేకపోయారు. మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ధానోర్కరే. బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సురేశ్ భార్ పేరు ప్రతిభ. ఆమె 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. స్వస్థలం వారోరాలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Sad to learn that our @INCIndia parliamentary colleague, Suresh Narayan Dhanorkar (MP from Chandrapur constituency in Maharashtra) passed away overnight, the second demise of a Congress MP during the 17th Lok Sabha. He was only 47. My condolences to his loved ones. Om Shanti. pic.twitter.com/qwCQ8XamEc — Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2023 ఇదీ చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. అధికారికి షాక్ -
ఎంపీగా అనర్హత.. ట్విటర్ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో జైలు శిక్ష ఖరారు, ఎంపీ పదవికి ఎసరు రావడంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. కాషాయ దళం కావాలని తమ నాయకుడిని టార్గెట్ చేసిందని హస్తం పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ తన ట్విటర్ హ్యాండిల్ బయోను మార్చారు. అంతకుముందు ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ ఉన్నచోట ‘డిస్ 'క్వాలిఫైడ్ ఎంపీ’ (Dis'Qualified MP) అని అప్డేట్ చేశారు. కాగా, ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఖాళీగా ఉందని ప్రకటించింది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అప్పీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! ఇదిలాఉండగా, పరువునష్టం కేసులో జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎగువ న్యాయస్థానాలను ఆశ్రయించనుంది. (చదవండి: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్వాలా) దేశవ్యాప్త ఆందోళనలు.. రాహుల్‌పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో ‘సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష’కు చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం రాహుల్ గాంధీ పనిచేస్తుంటే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. రాహుల్ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో మాట్లాడితే కేసు గుజరాత్‌కు వెళ్లిందని విమర్శించారు. కర్ణాటకలోని బీజేపీ సర్కార్‌కు ఆ రాష్ట్రంలో కేసు వేసేంత దమ్ము లేదా? అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని బీజేపీ శ్రేణులు కావాలనే కించపరుస్తున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు) -
రాహుల్ ముందు 2 మార్గాలు.. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లకపోవచ్చు!
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అనర్హత వేటు నుంచి బయట పడి, ఎంపీగా కొనసాగడంతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాహుల్ ముందు రెండు మార్గాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తీర్పును పై కోర్టు కొట్టివేస్తే అనర్హత వేటూ రద్దవుతుంది. కనీసం జైలు శిక్షను రెండేళ్ల కంటే తగ్గించినా ఊరటే. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకు మించి జైలుశిక్ష పడితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. కనుక సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసేలా, రెండేళ్ల కంటే తగ్గించేలా పై కోర్టులో వాదించి నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే కనీసం శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నా ఎంపీ పదవిని కాపాడుకోవచ్చు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. రాహుల్ అప్పీల్‌ను పై కోర్టు తిరస్కరిస్తే మాత్రం మరో ఎనిమిదేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది క్రిమినల్ కేసు కావడంతో నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవచ్చని తెలుస్తోంది. చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక? తొలుత సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేస్తారని, అక్కడ ఊరట దక్కకపోతే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 11న లక్షద్వీప్ కరవట్టిలోని సెషన్స్ కోర్టు ఒక హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల శిక్ష విధించింది. జైలుశిక్ష పడిన రెండు రోజులకే లక్షదీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో లక్షద్వీప్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉప ఎన్నిక కోసం జనవరి 18న నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇంతలో మొహమ్మద్ ఫైజల్‌కు విధించిన జైలు శిక్షపై కేరళ హైకోర్టు జనవరి 25న స్టే విధించింది. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరోవైపు హైకోర్టు నిర్ణయంపై లక్షద్వీప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ప్రస్తుతం సుప్రీంలో విచారణ నడుస్తోంది. చదవండి: ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్ గాంధీ -
రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంట్ సెక్రటేరియట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కాగా రాహుల్‌పై అనర్హత వేటు వేయడంతో లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ప్రజాప్రాతినధ్య చట్టం 2015లోని సెక్షన్ 151(ఏ) ప్రకారం.. ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే 6 నెలల్లోపు ఉప ఎన్నికల నిర్వహించి ఆ స్ధానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి నిబంధలన ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. దీనిపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. లోక్‌సభ సభ్యత్వం రద్దుపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా జనాందోళన్కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు. చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు -
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగబద్ధమేనా?
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేటు రాజ్యాంగబద్ధమేనని కొందరు, లోక్‌సభ సెక్రటేరియట్ సరైన నిర్ణయం తీసుకోలేదని మరికొందరు అంటున్నారు. 2014 నాటి లిల్లీ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు వెంటనే అనర్హతకు గురవుతారని వెల్లడించింది. శిక్ష పడిన మర్నాడే రాహుల్‌పై వేటుకు ఈ తీర్పు దోహదపడినట్లు తెలుస్తోంది. అయితే 2018 నాటి లోక్‌ప్రహరీ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకటించింది. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధిపై అభియోగాలను పైకోర్టు కొట్టేస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. శిక్ష రద్దయితే వేటూ రద్దవుతుందని తెలియజేసింది. రాహుల్‌పై వేటు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ని లోక్‌సభ సెక్రటేరియట్ ఉదాహరించింది. వీటి ప్రకారం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన సభ్యులపై శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయవచ్చు. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం శిక్ష పడిన 3 నెలల తర్వాత మాత్రమే అనర్హత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఈలోగా శిక్షపడిన సభ్యుడు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. కింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. కానీ, రాహుల్‌పై వెంటనే వేటు వేయడం గమనార్హం. ఇలా శిక్ష పడిన మరుసటి రోజే సభ్యులపై అనర్హత వేటు వేసిన దాఖలాలు గతంలో లేవు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(4)ను లోక్‌సభ సెక్రటేరియట్ పట్టించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. లోక్‌ప్రహరీ కేసు ప్రకారం.. రాహుల్‌కు పడిన జైలుశిక్షను పై కోర్టు రద్దు చేస్తే ఆయనపై అనర్హత వేటు సైతం రద్దవుతుంది. -
Defamation Case: రాహుల్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయింది! ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. తీర్పు వెలువడ్డ ఈ నెల 23వ తేదీ (గురువారం) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. నిజానికి అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం తెలిసిందే. అయినా లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు! శుక్రవారం ఉదయం మామూలుగానే లోక్‌సభ సమావేశానికి హాజరైన ఆయన, లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. దీనిపై ‘జనాందోళన్’ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ మాత్రం వేటు చట్టప్రకారమే జరిగిందని పేర్కొంది. రాహుల్‌కు చట్టం వర్తించదా అని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ‘నేరాలకు పాల్పడడం రాహుల్‌కు అలవాటే. పార్లమెంట్‌కు, ప్రభుత్వానికి, దేశానికి అతీతుడినని ఆయన భావిస్తున్నారు. తమకు ప్రత్యేక భారత శిక్షాస్మృతి ఉండాలని, తమను ఎవరూ నేరస్తులుగా నిర్ధారించవద్దని, శిక్షలు విధించవద్దని కాంగ్రెస్, ప్రధానంగా నెహ్రూ–గాంధీ కుటుంబం కోరుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు’’ అన్నారు. వయనాడ్ ఖాళీ లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ (పంజాబ్) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం వేటును నిరసిస్తూ విపక్షాల ర్యాలీ అదానీ అంశంపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ నిరసన ర్యాలీ చేపట్టిన 40 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు నిర్బంధించారు. పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్‌కు ర్యాలీగా వెళ్లిన ప్రముఖుల్లో కేసీ వేణుగోపాల్, ఆధిర్ రంజన్ చౌధురి, కె.సురేశ్, మాణిక్కం ఠాగోర్æ తదితరులు ఉన్నారు. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. సెక్షన్ 144ను ఉల్లంఘించి ర్యాలీ చేపట్టిన 40 మంది ఎంపీలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అంతకుముందు విజయ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు మాట్లాడారు. ర్యాలీలో కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, శివసేన ఉద్ధవ్ వర్గం, జేడీయూ, ఆప్ నేతలు పాల్గొని ‘వుయ్ డిమాండ్ జేపీసీ’, ‘సేవ్ ఎల్ఐసీ’, ‘డెమోక్రసీ ఇన్ డేంజర్’ అన్న ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ నోరు నొక్కేందుకే: కాంగ్రెస్ సోనియా సహా అగ్ర నేతల అత్యవసర భేటీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా ‘జనాందోళన్’కు పిలుపునిచ్చింది. రాహుల్ సభ్యత్వంపై వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా శక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాహుల్ నోరు నొక్కేందుకే అధికార బీజేపీ ఇలా వాయు వేగంతో చర్యలకు దిగిందని తీర్మానించారు. వేటుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని, మోదీ సర్కారు నిరంకుశ వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నాయి. రాహుల్‌కు విపక్షాల సంఘీభావాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ స్వాగతించింది. ‘‘దీనిపై ఐక్యంగా పోరాడదాం. ఆందోళనల్లో మీరు కూడా కలిసి రండి’’ అంటూ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. భేటీలో ప్రియాంక, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. స్పందనలు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు ‘ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. నిజాలు మాట్లాడుతున్నందుకు, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకే రాహుల్‌పై అధికార బీజేపీ కక్షగట్టింది. ఆయన గొంతు నొక్కడమే ఉద్దేశం. నిజాలను రాహుల్ బహిర్గతం చేయడం బీజేపీకి ఇష్టం లేదు, రాహుల్‌పై వేటు పడినా అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ డిమాండ్‌పై తగ్గేది లేదు. మమ్మల్ని జైలుకు పంపించినా పోరాడుతూనే ఉంటాం’’ – మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ‘‘మోదీ భారత్‌లో విపక్ష నాయకులే లక్ష్యంగా మారారు. నేర చరితులైన బీజేపీ వారికి మంత్రి పదవులు. విపక్ష నేతలపై అనర్హత వేటు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హీనమైన పరిస్థితి!’’ మమత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘రాహుల్‌పై అనర్హత వేటు దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశంలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని అనుకుంటున్నారు. బ్రిటీష్ పరిపాలన కంటే ప్రమాదకరంగా ప్రధాని మోదీ పాలన మారింది. ఇది కేవలం ఒక్క కాంగ్రెస్ చేసే పోరాటం కాదు. దేశాన్ని రక్షించుకోవడానికి 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి’’ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మోదీ స్నేహితుడైన పారిశ్రామికవేత్త (అదానీ) అంశాల నుంచి దృష్టి మరల్చే బీజేపీ ఎత్తుగడ ఇది. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుట్రలు పన్ని, తప్పుడు కేసులు పెట్టి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్ సహా ఎందరిపైనో అనర్హత వేటు వేసింది’’ అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ‘‘రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకే వ్యతిరేకం. ప్రజాస్వామ్య విలువలన్నీ మంటగలుపుతున్నారు. ఇలాంటి చర్యల్ని పూర్తిగా ఖండించాలి’’ శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘రాహుల్‌పై అనర్హత ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై జరిగిన దాడి. ఇదొక ఫాసిస్టు చర్య. ఒక జాతీయ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడుకి కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ప్రజాస్వామ్య హక్కు లేదని ఇలాంటి చర్యల ద్వారా భయపెడుతున్నారు’’ ఎంకె స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేయడానికి పరువు నష్టం మార్గాన్ని బీజేపీ ఎంచుకోవడాన్ని ఖండించాలి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి నిరంకుశ దాడుల్ని ప్రతిఘటించాలి, ఓడించాలి’’ సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ‘‘అబద్ధాలు, వ్యక్తిగత నిందలు, ప్రతికూల రాజకీయాలు రాహుల్‌లో ఒక అంతర్భాగంగా మారాయి. ఒబిసి సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చి రాహుల్ తనకున్న కుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకి ప్రజలు ఇంతకంటే పెద్ద శిక్ష విధిస్తారు.’’ జె.పి. నడ్డా, బీజేపీ అధ్యక్షుడు తలవంచం.. ఏం చేసుకుంటారో చేసుకోండి ‘‘దేశ ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తం ధారపోసింది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రాణత్యాగం చేసిన ప్రధాని కుమారుడైన రాహుల్ గాంధీని ‘మీర్ జాఫర్’ అంటూ మోదీ మనుషులు కించపర్చారు. మా కుటుంబాన్ని దూషించారు. రాహుల్ తండ్రెవరని బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా ధరిస్తే దాన్నీ తప్పుపట్టారు. తద్వారా పండిట్ల సామాజిక వర్గాన్ని అవమానించారు. నెహ్రూ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదని పార్లమెంట్లో మీరు (మోదీ) మమ్మల్ని ప్రశ్నించారు. మమ్మల్ని దారుణంగా అవమానించినా ఏ జడ్జి కూడా మీకు రెండేళ్ల జైలు శిక్ష విధించలేదు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేయలేదు. రాహుల్ నిజమైన దేశ భక్తుడు. అందుకే అదానీ గ్రూప్ సాగించిన లూటీపై ప్రశ్నించాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ బాగోతాలపై నిలదీశాడు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ పార్లమెంట్ కంటే గొప్పవాడా? అధికార దాహమున్న వ్యక్తుల ముందు మేం తలవంచే ప్రసక్తే లేదు. ఏం చేసుంటారో చేసుకోండి!’’ – ప్రియాంకాగాంధీ వాద్రా, కాంగ్రెస్ నాయకురాలు భారత్ గొంతుక కోసమే నా పోరాటం ‘‘భారతదేశ గొంతుక కోసం పోరాటం సాగిస్తున్నా. ఈ విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నా’’ – రాహుల్ గాంధీ ట్వీట్ -
అనర్హత వేటు లేవనెత్తిన ప్రశ్నలు
చట్టం వేరు...ధర్మం వేరు. చట్టబద్ధమైన చర్యలన్నీ ధర్మబద్ధం కాకపోవచ్చు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటానికి దారితీసిన సూరత్ కోర్టు తీర్పు, అంతక్రితం రెండు వారాలుగా అధికార, విపక్షాలు సాగిస్తున్న ఆందోళనల పర్యవసానంగా పార్లమెంటు స్తంభించి పోవటం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య ప్రియులను కలవరపరుస్తాయి. పౌరులు ఎలా మెలగాలో, పాటించాల్సిన స్వీయ నియంత్రణలేమిటో చట్టాలు చెబుతాయి. అధికారానికుండే పరిమితులేమిటో కూడా తేటతెల్లం చేస్తాయి. కానీ వాటి ఆచరణ సక్రమంగా లేని చోట ఆ చట్టాలు కొందరికి చుట్టాలవుతాయి. మరికొందరికి అవరోధాలవుతాయి. కర్ణాటకలోని కోలార్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన రాహుల్ అవినీతికి, అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీల పేర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జత చేసి ‘దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎందుకుంటుంది?’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. రాహుల్ వ్యాఖ్య ఆ ఇంటి పేరుగల సామాజిక వర్గానికి ఇబ్బందికరంగా మారిందంటూ గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది. రాహుల్ వ్యాఖ్యతో చాలామందికి ఏకీభావం లేకపోవచ్చు. ప్రత్యర్థులనుసరించే విధానాలను విమర్శించటంకాక వారిపై దూషణలకు దిగటం చాన్నాళ్లుగా రివాజుగా మారింది. ఇక భౌతికంగా నిర్మూలిస్తామని బెదిరింపులకు దిగటం, దౌర్జన్యాలకు పూనుకోవటం వంటివి చెప్పనవసరమే లేదు. అయితే ఈ ధోరణులను వ్యతిరేకించేవారు సైతం రాహుల్‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్షను, దాని ఆధారంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటం సమర్థించలేకపోతున్నారు. గతంలో రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు రాహుల్ ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కు కున్నారు. ప్రధానినుద్దేశించి వ్యాఖ్య చేయబోయి సుప్రీంకోర్టును తప్పుబట్టేలా మాట్లాడటంతో సమస్య ఏర్పడింది. ఆ కేసులో రాహుల్ బేషరతు క్షమాపణ చెప్పడాన్ని అంగీకరించి సర్వోన్నత న్యాయస్థానం 2019లో కేసు మూసివేసింది. అయితే రాహుల్ వంటి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికింది. సూరత్ కోర్టు దాన్నే గుర్తుచేసింది. ఈ తీర్పుపైనా, అనర్హత వేటుపైనా ఎటూ కాంగ్రెస్ అప్పీల్‌కి వెళ్తుంది. అక్కడ ఏమవుతుందన్న సంగతి అటుంచి, సూరత్ కోర్టు తీర్పు లేవనెత్తిన అంశాలు ప్రధానమైనవి. పరువు నష్టం కలిగించటాన్ని నేరపూరిత చర్యగా పరిగణించి గరిష్టంగా రెండేళ్ల జైలు, జరిమానాకు వీలుకల్పించే భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 499, 500 సెక్షన్ల సహేతుకతపై ఎప్పటినుంచో అభ్యంతరాలున్నాయి. ఒకపక్క పరువునష్టంలో సివిల్ దావాకు వీలున్నప్పుడు జైలుశిక్ష, జరిమానాలెందుకని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్ వలస పాలన కాలంలో చేసిన ఈ చట్టం ఇప్పుడు బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఉనికిలో లేదు. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నది గనుక, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది గనుక రద్దు చేయాలని గతంలో సుప్రీంకోర్టుకెక్కిన వారున్నారు. అయితే పేరుప్రతిష్టలు కలిగివుండే హక్కు జీవించే హక్కులో భాగమని, దానికి భంగం కలిగించినవారు తగిన శిక్ష అనుభవించక తప్పదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సందర్భంలో ఈ అంశంలో తీర్పులు వెలువరించేటపుడు జాగురూకత వహించాలని కింది కోర్టులకు సలహా ఇచ్చింది. అయితే ఈ సలహాను కింది కోర్టులు పాటిస్తున్నాయా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక రచనపై వచ్చిన విమర్శను తట్టుకోలేకనో, ఒక నాటకాన్నీ లేదా సినిమాను అడ్డుకోవటానికో ఈ సెక్షన్లను యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. తమిళనాడులో జయ లలిత పాలనాకాలంలో ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలు వందల సంఖ్యలో పరువునష్టం దావాలు వేసిన సంగతి ఎవరూ మరువలేరు. కోర్టులు సైతం యాంత్రికంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కింది కోర్టులను తప్పుబట్టవలసి వచ్చింది. నీరవ్ మోదీ, లలిత్ మోదీ తదితరులకు ప్రభుత్వ ప్రాపకం లభించిందని ఆరోపిస్తే రాహుల్‌కు బహుశా ఈ కేసు బెడద ఉండేదికాదు. తగిన ఆధారాలతో అటువంటి విమర్శలు చేస్తే దానివల్ల ప్రజలకు ఏదో మేరకు ప్రయోజనం కూడా కలుగుతుంది. రాహుల్ తన వ్యాఖ్యలద్వారా ఒక వెనుకబడిన వర్గాన్ని కించపరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగా ఎదుర్కొనటం తప్పేమీ కాదు. అందుకు భిన్నంగా న్యాయస్థానాలను ఆశ్రయించటం ఎంత వరకూ సబబో, చట్టానికి అనుగుణంగానే అయినా ఆదరాబాదరాగా అనర్హత వేటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమేరకు ధర్మమో ఆలోచించుకోవాలి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఆజంఖాన్ తదితరుల కేసుల్లో వెనువెంటనే చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ ప్రక్రియ సందేహాస్పదం కారాదు. మెజారిటీ ఉంది కదా అని కక్షపూరితంగా చేశారన్న అపఖ్యాతి తెచ్చుకోకూడదు. దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చిన వారు నిక్షేపంలా కేంద్రమంత్రు లుగా కొనసాగుతుంటే విపక్ష నేత నోరుజారటం మాత్రం మహాపరాధం కావటం సాధారణ పౌరు లకు కొరుకుడుపడని అంశం. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యం రాహులేనని పార్లమెంటులోని పరిణామాలైనా, తాజా చర్య అయినా తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయ పక్షాలూ, వాటి వ్యూహాల మాటెలా వున్నా దేశంలో చట్టబద్ధ పాలనకూ, సమన్యాయానికీ విఘాతం కలగనీయకుండా చూడాలని సాధారణ పౌరులు కోరుకోవటం అత్యాశేమీ కాదు. -
రాహుల్ గాంధీపై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు లోక్‌సభ సెక్రటరీ జనరల్. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. Rahul Gandhi - Congress MP from Wayanad, Kerala - disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his 'Modi surname' remark. pic.twitter.com/SQ1xzRZAot — ANI (@ANI) March 24, 2023 ఏం జరిగిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ, సూరత్ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. Watch this video, did Rahul Gandhi say something wrong ? Spread this. pic.twitter.com/EQlL9g03Za — Shantanu (@shaandelhite) March 23, 2023 ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది సూరత్ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్మెంట్ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో హాజరయ్యారు కూడా. రాహుల్ టార్గెట్ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ మాత్రం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్ గాంధీకి గురువారం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర ఎంపీ సుమలత
మాండ్య: మాజీ నటి, కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్(59).. ఊహించని స్టేట్మెంట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. నాలుగేళ్లుగా మాండ్య లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆమె హఠాత్తుగా తన మద్దతును కమలానికి ప్రకటించడం గమనార్హం. మోదీ నాయకత్వంలో భారత్‌కు లభించిన సుస్థిరత, దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘నాలుగేళ్లపాటు స్వతంత్రంగా వ్యవహరించాను. ఈ సమయంలో బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. వీటిని దృష్టిలో ఉంచుకునే మద్దతు అవసరమని భావించాను. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాను’అని ఆమె మీడియాతో అన్నారు. కన్నడ అగ్ర నటుడు దివంగత అంబరీష్ భార్య అయిన సుమలత బహు భాషా నటి. సుమారు 220కిపైగా సినిమాల్లో నటించారామె. 2019 మాండ్యా ఎన్నికలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. కిందటి నెలలో ఆమె బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తన మద్దతు ఉండబోదంటూ ప్రకటించడం గమనార్హం. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కవరాట్టి: హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్‌కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకున్నదని ఫైజల్ ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్‌పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్‌ని ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు నిలపగలిగారు.