
సాక్షి, న్యూఢిల్లీ : శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ)కు రాజీనామా చేసిన పంజాబ్ ఎంపీ షేర్ సింగ్ గుభయా మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే గుభయా సోమవారం ఎస్‌ఏడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుభయాను తాము ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించామని అకాలీదళ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షేర్ సింగ్ గుభయా పార్టీ మారడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment