akalidal
-
రెండు రోజుల్లో పోలింగ్.. మోదీ ఇంట కీలక సమావేశం
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
డ్రగ్స్ కేసులో మాజీ మంత్రి సోదరుడు.. సిద్ధూ కీలక వ్యాఖ్యలు
చంఢీఘడ్: పంజాబ్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు చలి కాలంలోనూ హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నేతల పరస్పర ఆరోపణలతో పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కాగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి పంజాబ్ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అకాలీదళ్ కీలక నేత బిక్రమ్ సింగ్ మజిథియాపై పంజాబ్ పోలీసులు కేసును నమోదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. మాజీ కేంద్ర మంత్రి అయిన హర్ సిమ్రాత్ కౌర్ బాదల్‌కు మజిథియా సోదరుడు. 2018లో డ్రగ్స్ మాఫియాతో అక్రమ రవాణాలో సహకారం, నేరపూరిత కుట్రలపై మజిథియాపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా బిక్రమ్ సింగ్‌పై కేసు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాన్ని అకాలీదళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికార పక్షం, కావాలనే ప్రతీకార రాజకీయాలు చేస్తోందని అకాళీదళ్ మండిపడుతోంది. తాజా ఘటనపై, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్న వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం ఉన్నప్పుడు ఈ కేసును పట్టించుకోలేదని సిద్ధూ ఆరోపించారు. చదవండి: ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ -
పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌కు భారీ ఎదురుదెబ్బ..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, శిరోమణి అకాళీదళ్ కీలకనేత మాజిందర్ సింగ్ సిర్సా బుధవారం బీజేపీ కండువ కప్పుకున్నారు. కాగా, సిర్సా... కేంద్రం హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అదే విధంగా .. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షేకావత్ కూడా పాల్గోన్నారు. సిర్సా.. ఢిల్లీ సిఖ్ గురుద్వారా మెనెజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జిఎంసీ)కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మాజిందర్ సిర్సా మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీతో కలిసి సిక్కుల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. కాగా సిర్సా డీఎస్‌జిఎంసీకు రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. అదే విధంగా సిక్కుల అభివృద్ధికి నిష్పక్షపాతంగా, విలువలతో పనిచేస్తానని తెలిపారు. -
ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు
లక్నో: తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. అయితే ఎంఐఎం.. బహుజన్ సమాజ్ పార్టీతో జంటగా బరిలోకి దిగబోతుందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ఎంఐఎంతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. (చదవండి: మాయావతిపై డర్టీ కామెంట్లు) ‘‘విధాన సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పొత్తు ఉంటుందని కథనాలు ప్రసారం చేస్తున్నారు. అది నిరాధారమైన వార్త అది. నిజం కాదు. ఖండిస్తున్నాం’’ అని ట్విటర్ ద్వారా ప్రకటించారమె. అంతేకాదు ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే పంజాబ్‌లో మాత్రం అకాళీదల్‌తో పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ తప్ప వేరే ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవు. ఇది ఫైనల్ అండ్ క్లియర్.. అని స్పష్టం చేశారామె. 1. मीडिया के एक न्यूज चैनल में कल से यह खबर प्रसारित की जा रही है कि यूपी में आगामी विधानसभा आमचुनाव औवेसी की पार्टी AIMIM व बीएसपी मिलकर लड़ेगी। यह खबर पूर्णतः गलत, भ्रामक व तथ्यहीन है। इसमें रत्तीभर भी सच्चाई नहीं है तथा बीएसपी इसका जोरदार खण्डन करती है। 1/2 — Mayawati (@Mayawati) June 27, 2021 తప్పుడు ప్రచారాలు ఆపండి.. బీఎస్పీ పార్టీపై వరుసగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై యూపీ మాజీ సీఎం మాయావతి మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు విషయంతో పాటు రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర గురించి ఫేక్ కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారాలు ఆపండి అంటూ మీడియాను ఆమె కోరారు. ఏదైనా ప్రసారం చేసే ముందు బీఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని.. ఇలాంటివి రిపీట్ అయితే పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. చదవండి: ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌కు బానిసగా ఉంటారు -
‘ఎన్డీయే రెండు సింహాలను వదులుకుంది’
ముంబై : ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) బయటకు వచ్చిన క్రమంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిపై శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ఎన్డీయే కూటమి నుంచి రెండు సింహాలు ఎస్ఏడీ, శివసేన తెగతెంపులు చేసుకున్నాయని, ఇక ఆ కూటమిలో ఇప్పుడు ఉన్నది ఎవరని శివసేన ప్రశ్నించింది. అకాలీదళ్‌ను కూటమి నుంచి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్డీయే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యపరిచిందని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన రాసుకొచ్చింది. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం ఎస్ఏడీ శనివారం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఉత్పత్తుల కొనుగోలుపై చట్టపరమైన భరోసా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడంతో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగామని అకాలీదళ్ స్పష్టం చేసింది. బాదల్లు ఎన్డీయేను వీడుతున్న క్రమంలో వారిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు..గతంలో శివసేన సైతం ఎన్డీయేను వీడింది..ఈ రెండు పార్టీల నిష్క్రమరణ తర్వాత ఎన్డీయే దగ్గర ఎవరు మిగిలారని శివసేన ప్రశ్నించింది. ఎన్డీయేతో ఇప్పటికీ ఉంటున్న పార్టీలు అసలు హిందుత్వ కోసం కట్టుబడ్డాయా అని శివసేన ప్రశ్నించింది. చదవండి : ముంబై నుంచి పార్శిల్ చేస్తాం: రౌత్ -
‘రైతుల కోసం నిలబడ్డారు’
ముంబై : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు రావడాన్ని విపక్షాలు స్వాగతించాయి. అకాలీదళ్ నిర్ణయాన్ని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమర్ధించారు. అకాలీదళ్ నేతలు సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన హర్సిమ్రత్ బాదల్లు రైతుల పక్షాన గట్టిగా నిలబడి పోరు సాగించారని శరద్ పవార్ ప్రశంసించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ నిబద్ధతతో పోరాడారని పవార్ ట్వీట్ చేశారు. ఇక రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటూ అకాలీదళ్ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన ప్రశంసిస్తోందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మరోవైపు రైతులను కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని సుఖ్బీర్ సింగ్ బాదల్ పిలుపు ఇచ్చారు. రైతుల ఆర్థిక దయనీయ స్థితి దేశ ఆర్థిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుందని, దేశ విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకు తాము పోరాడుతున్నామని పంజాబ్‌లో పార్టీ కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బాదల్ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. చదవండి : కంగనా వివాదం : పవార్ కీలక వ్యాఖ్యలు -
దుష్యంత్ దారెటు..?
-
కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా
-
కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది. రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్ ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసిన అకాలీదళ్ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని పేర్కొంది. హర్సిమ్రత్ కౌర్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని లోక్‌సభలోనే అకాలీదళ్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. ఈ బిల్లులపై పంజాబ్, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోంది. చదవండి : టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు -
పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పాక్ రాయబార కార్యాలయం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా చాణక్యపురి పోలీస్‌స్టేషన్ వద్దే వారిని పోలీసులు నిలువరించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే రోడ్డుకిరువైపులా నిలబడి పాక్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిక్కు నేతలు పాక్ రాయబారికి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి దాడులు జరక్కుండా పాక్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కోరారు. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో మత వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సబబేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ పేర్కొన్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేత మీనాక్షి లేఖి, పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్లో విమర్శలు చేసుకున్నారు. -
ఢిల్లీలో ఆలయం కూల్చివేత : పంజాబ్‌లో ప్రకంపనలు
చండీగఢ్ : ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్ బంద్‌కు రాష్ట్రంలోని రవిదాసియా వర్గం పిలుపు ఇచ్చింది. బంద్ పిలుపుతో జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమస్య పరిష్కారానికి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజల్‌తో తాము చర్చించామని, గురు రవిదాస్ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు. చారిత్రక ఆలయ కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్ పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఢిల్లీలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రవిదాస్ వర్గ మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్ స్పష్టం చేశారు. -
‘రాజీవ్ క్రూరుడే’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) జాతీయ ప్రతినిధి మజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజీవ్ దేశంలోనే అతిపెద్ద మూకహత్యలకు పాల్పడిన క్రూరుడని వ్యాఖ్యానించారు. రాజీవ్‌ను నెంబర్‌వన్ అవినీతిపరుడిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా మూక హత్యలను ప్రేరేపించిన ప్రధానిగా రాజీవ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టుగా రాజీవ్ అవినీతిలో అగ్రగణ్యుడే కాకుండా అతిపెద్ద మూకహత్యల ప్రేరేపకుడు కూడా అని ఆరోపించారు. సిక్కుల ఊచకోతను రాజీవ్ ప్రోత్సహించారని సిర్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దేశం కోసం ప్రాణాలర్పించిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎప్పుడో మరణించిన రాజీవ్‌పై ప్రధాని తాజా వ్యాఖ్యలు అమానవీయమని విపక్షాలు భగ్గుమన్నాయి. -
అకాలీదళ్ ఎంపీ కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కు రాజీనామా చేసిన పంజాబ్ ఎంపీ షేర్ సింగ్ గుభయా మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే గుభయా సోమవారం ఎస్ఏడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుభయాను తాము ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించామని అకాలీదళ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షేర్ సింగ్ గుభయా పార్టీ మారడం గమనార్హం. -
ఖలిస్తాన్ ఉగ్రవాదితో మంత్రి ఫొటో.. తీవ్ర దుమారం!
అమృత్సర్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఆయన ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. గురువారం గోపాల్ సింగ్ తన ఫేస్బుక్లో సిద్దూతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, చావ్లాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మంత్రి సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు చావ్లాతో సిద్ధూ ఫొటో దిగడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇందిరా గాంధీలాగే పంజాబ్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా?’ అని రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ ప్రశ్నించింది. ‘నాలుగు రోజుల క్రితమే అమృత్‌సర్‌లో జరిగిన ఉగవాద దాడి వెనుక ఖలిస్తాన్‌వాదుల హస్తం ఉందని పోలీసులు కనుక్కున్నారు. నిన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, చావ్లాతో కలిశారు. దీని వెనుక ఏంజరుగుతుందో రాహుల్‌గాంధీని చెప్పాలం’టూ బీజేపీ నేత తాజిందర్ బగ్గా ట్వీట్ చేశారు. సిద్దూకు దేశమంటే పట్టింపు ఉందా? లేక వేరే ఉద్దేశంతో ఉన్నారా? అని అకాలీదళ్ ఘాటుగా ప్రశ్నించింది. సిద్దూ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీని వెనుక చావ్లా హస్తముందని అకాలీదళ్ పేర్కొంది. చావ్లాను సిద్దూ చాలాసార్లు దూరంపెట్టారని, కానీ ఈ సారి అతడు ఎలాగోలా సిద్దూతో ఫోటో దిగగలిగారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు పరమజిత్ సింగ్ సర్నా చెప్పారు. సిద్దూ పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, భారతీయుల కంటే పాకిస్తానీల నుంచే ఆయన ఎక్కువ ప్రేమాభిమానాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూ అక్కడినుంచే పోటీ చేయించాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. -
‘ఆయన రోజుకు 50 సార్లు చస్తారు’
చండీగఢ్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అకాలీదళ్ నేతకు క్షమాపణలు చెప్పడంతో పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే పంజాబ్ పార్టీ చీఫ్, ఎంపీ భగవంత్ మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేజ్రీపై విమర్శలు గుప్పించారు. ‘పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ ఈరోజు హత్య చేశారు. ఎవరైతే అకాలీదళ్ నేత బిక్రం సింగ్ మజితియాపై ఇన్నాళ్లూ ఆరోపణలు చేశారో వారే నేడు క్షమాపణలు చెప్పారు. దాని ఫలితంగా పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవడమే కాకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజలను మోసంతో చేయడంతో పాటు, అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ విశ్వాసం కోల్పోయారు. పార్టీ అధినేతగా ఉన్నవారే పూర్తిగా లొంగిపోయినపుడు ఇకపై డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు ఎలా మాట్లాడగలరు? ధైర్యవంతులు ఒకేసారి మరణిస్తారు. కానీ కేజ్రీవాల్ వంటి పిరికివాళ్లు రోజుకు యాభైసార్లు చస్తారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్షమాపణ వల్ల ఆప్ మానసికంగా హత్యకు గురైందని సిద్ధూ సానుభూతి వ్యక్తం చేశారు. మొదట ఢిల్లీ నుంచే పంజాబ్‌లో చక్రం తిప్పాలని అనుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు నిస్సహాయ జూదగాడిగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. డ్రగ్స్ మాఫియాలో అకాళీ దళ్ నేత బిక్రం సింగ్ మజితియా హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ తాజాగా ఆయనకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. -
విజయదుందుభి మోగించిన కాంగ్రెస్
చండీఘడ్ : పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరవేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. జలంధర్, పటియాలా, అమృతసర్‌లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ పాలసీలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిందని, పటియాలలో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి ఆరోపించింది. జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి 12 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పటియాలాలో 60 సీట్లకు గాను 58 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అమృతసర్‌లో సైతం కాంగ్రెస్ హవా నడిచింది. మొత్తం 85 స్థానాల్లో 63 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. -
పంజాబ్ బరిలో 1,145 మంది
చండీగఢ్: 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ ఎన్నికల బరిలో 1,145 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీకే సింగ్ చెప్పారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తయింది. కాంగ్రెస్ 117 స్థానాల్లో, ఆప్ 112, అకాలీదల్ 94, బీజేపీ 23 చోట్ల అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ 111, తృణమూల్ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి.