
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment