Amrinder Singh
-
రెండు రోజుల్లో పోలింగ్.. మోదీ ఇంట కీలక సమావేశం
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
డిసెంబర్ 1 నుంచి రాత్రి కర్ఫ్యూ
చండీగఢ్: కరోనా వైరస్ ఉదృతి తగ్గడం లేదు. పైగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది. మన దేశంలో కూడా కరోనా మరోసారి విజృంభించనుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోవిడ్ కట్టడి కోసం కర్ఫ్యూని విధించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. ఇక కోవిడ్ నిమయాలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. అంతేకాక రెస్టారెంట్లు, హోటల్స్, వివాహాది వేడుకలు వంటివి రాత్రి 9.30 గంటలలోపు ముగించాలని ఆదేశించారు. డిసెంబరు 15 తర్వాత వీటిని సమీక్షిస్తామని తెలిపారు. (చదవండి: మరణాల రేటు తగ్గించండి) ఇక ఇప్పటి వరకు పంజాబ్‌లో 1,47,655 కేసులు ఉండగా.. 1,36,000 మంది కోలుకున్నారు. 6,834 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు పంజాబ్‌లో కోవిడ్ బారిన పడి 4,653 మంది మరణించారు. -
లాక్డౌన్ అమలుపై సీఎం క్లారిటీ
చండీగఢ్ : భారత్‌లో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను విధించారు. అయితే పంజాబ్‌లోనూ లాక్డౌన్ విధిస్తారన్న ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం స్పష్టతనిచ్చారు. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో రాష్ర్టంలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల్ని కచ్ఛితంగా పాటించి తమతో పాటు వారి కుటుంబాలను కూడా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. (ముంబై తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ ) త్వరలోనే నాలుగు కొత్త టెస్టింగ్ ల్యాబ్‌లను చేర్చడం ద్వారా కరోనా పరీక్షల సామర్థ్యాన్నిమరింత పెంచేలా సర్కార్ అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రోజుకు 10,000 వేల కరోనా పరీక్షలు చేయనుండగా జూలై చివరినాటికి దీని సంఖ్యను 20,000కు పెంచుతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. అంతేకాకుండా మొదటిదశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించిన 4,248 పడకల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 950 పడకలను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఒకవేళ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా అధిక సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,216 కాగా 133 మంది మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు ) . -
పదో తరగతి పరీక్షలు రద్దు: పంజాబ్ ప్రకటన
ఛండీగర్ : పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా తరగతుల మాదిరిగానే పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ప్రీ బోర్డ్ పరీక్షల ఫలితాల ఆధారంగా వారిని పై తరగతులకు పంపిస్తామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్ ) ప్రతి ఏడాది దాదాపు 4 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అయితే కరోనా కారణంగా పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎగ్జామ్స్‌ని రద్దు చేస్తూ పై తరగతులకు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే 5 నుంచి 8 సహా వివిధ తరగతుల విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇటీవల ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. దేశంలోనే మొదటిసారి విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. కాగా ఇప్పటివరకు పంజాబ్‌లో 1,731 కరోనా కేసులు నమోదవగా, 29 మంది మరణించారు. -
లోకసభలో కాంగ్రెస్ ఉప నేతగా అమరీందర్
న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ నేత ఎన్నిక విషయంలో అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించిన సోనియా గాంధీ ఉప నేత, చీఫ్ విప్ ఎంపికలోనూ అదే పంథా అనుసరించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అమృతసర్ ఎంపీ అమరీందర్ సింగ్‌ను లోకసభలో కాంగ్రెస్ నేతగా ఎంపిక చేశారు. యువ నాయకుడు, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాను చీఫ్ విప్ గా నియమించారు. లోక్‌సభలో 44 మంది కాంగ్రెస్ సభ్యులకు నాయకుడిగా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ఎం. మల్లికార్జున ఖర్గే(72)ను ఇంతకుముందు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పదవి సోనియా చేపడతారా? లేక రాహుల్‌కు ఇస్తారా? అన్న సందేహాలు పటాపంచలయ్యాయి.