చండీగఢ్ : భారత్‌లో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను విధించారు. అయితే పంజాబ్‌లోనూ లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం స్పష్టతనిచ్చారు. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో రాష్ర్టంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల్ని కచ్ఛితంగా పాటించి తమతో పాటు వారి కుటుంబాలను కూడా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. (ముంబై తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ )
త్వరలోనే నాలుగు కొత్త టెస్టింగ్ ల్యాబ్‌లను చేర్చడం ద్వారా కరోనా పరీక్షల సామర్థ్యాన్నిమరింత పెంచేలా సర్కార్ అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రోజుకు 10,000 వేల కరోనా పరీక్షలు చేయనుండగా జూలై చివరినాటికి దీని సంఖ్యను 20,000కు పెంచుతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. అంతేకాకుండా మొదటిదశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించిన 4,248 పడకల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 950 పడకలను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఒకవేళ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా అధిక సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,216 కాగా 133 మంది మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు )
.
Comments
Please login to add a commentAdd a comment