ఛండీఘర్: కరోనా మహమ్మరి కట్టడికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. దీనిని ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కేవలం పెళ్లిలకు, అంత్యక్రియలకు మాత్రమే ఎక్కువ మంది జనం పాల్గొనన్నడానికి అనుమతినిచ్చింది. ఆగస్టు 31 వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ఈలోపు రాజకీయపార్టీలకు కూడా ర్యాలీలు, పార్టీ మీటింగ్‌లు నిర్వహించడానికి అనుమతినివ్వద్దని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించాలని కోరారు. రవాణా వాహనాలు కూడా ప్రయాణీకుల పరిమితిని 50 శాతానికి తగ్గించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 36000 కరోనా కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి బారిన పడి 900 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి మృతి పట్ల సీఎం విచారణ వ్యక్తం చేశారు. గురువారం నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment