
చంఢీగర్: మద్యం అమ్మకాలపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంపై కోవిడ్ పన్ను విధిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. దాంతోపాటు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేటగిరీలను బట్టి మద్యం ధరలు రూ.2 నుంచి.. రూ.50 వరకు పెరుగనున్నాయి. తాజా పెంపుతో ప్రభుత్వానికి రూ.145 కోట్ల అదనంగా లభించనుంది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్ విధింపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఇక పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 26 వేల కోట్ల ఆర్థికలోటు ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మద్యంపై వచ్చే అదనపు ఆదాయం కోవిడ్ నియంత్రణ చర్యలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. కోవిడ్ సెస్సు నేటి నుంచే అమల్లోకి రానుండటం విశేషం.
(చదవండి: చలించిన ‘నిహారిక’ : వారికి విమాన టికెట్లు)
Comments
Please login to add a commentAdd a comment