లోకసభలో కాంగ్రెస్ ఉప నేతగా అమరీందర్ | Amrinder Singh made Deputy Leader of Congress in Lok Sabha | Sakshi
Sakshi News home page

లోకసభలో కాంగ్రెస్ ఉప నేతగా అమరీందర్

Published Thu, Jun 5 2014 5:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

లోకసభలో కాంగ్రెస్ ఉప నేతగా అమరీందర్

లోకసభలో కాంగ్రెస్ ఉప నేతగా అమరీందర్

న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ నేత ఎన్నిక విషయంలో అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించిన సోనియా గాంధీ ఉప నేత, చీఫ్ విప్ ఎంపికలోనూ అదే పంథా అనుసరించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అమృతసర్ ఎంపీ అమరీందర్ సింగ్ను లోకసభలో కాంగ్రెస్ నేతగా ఎంపిక చేశారు. యువ నాయకుడు, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాను చీఫ్ విప్ గా నియమించారు.

లోక్‌సభలో 44 మంది కాంగ్రెస్ సభ్యులకు నాయకుడిగా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ఎం. మల్లికార్జున ఖర్గే(72)ను ఇంతకుముందు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పదవి సోనియా చేపడతారా? లేక రాహుల్‌కు ఇస్తారా? అన్న సందేహాలు పటాపంచలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement