భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్‌బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.
ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగలు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024
Comments
Please login to add a commentAdd a comment