Honey bee attack
-
వీడియో: కేంద్రమంత్రి సింధియాకు తప్పిన ప్రమాదం.. పోలీసులకు గాయాలు!
భోపాల్: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తృటిలో ప్రమాదం తప్పింది. తేనెటీగల దాడి నుంచి సింధియాను భదత్రా సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న పోలీసులు, పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనకు బయలుదేరారు. అక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు శివపురిలోని సరస్సు సెయిలింగ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో యంత్రానికి పంతులు పూజలు చేసే క్రమంలో అగర్బత్తిని వెలిగించారు. దీంతో, పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి.ఈ సమయంలో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సింధియా కష్టం మీద కాపాడారు. సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, పార్టీ మద్దతుదారులు, పోలీసులపై తేనేటీగలు దాడి చేశాయి. అనంతరం, గాయపడిని వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. #WATCH | Swarm Of Bees Attack Minister Jyotiraditya Scindia In Shivpuri, Several Injured#MadhyaPradesh #MPNews #Jyotiradityascindia pic.twitter.com/Ls23wLa1GU— Free Press Madhya Pradesh (@FreePressMP) November 30, 2024 -
ప్రీ వెడ్డింగ్ షూట్లో అపశ్రుతి.. కాబోయే జంటపై తేనెటీగల దాడి
ఇటీవలి కాలంలో ఫోటోషూట్లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్ షూట్ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్ పేరుతో ప్రమాదలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు. సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీకి చెందిన అనురాగ్‌రెడ్డి, శివానికి వివాహం కుదిరింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఈనెల 11న కోహెడలోని ఔటర్ పరిసరాల్లోకి వచ్చారు. ఫొటో షూట్లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అదే రోజు సాయంత్రం డిశ్చార్జి అయినట్లు తెలిసింది. చదవండి: అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య? -
తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు!
గొల్లపల్లి: తేనెటీగలు దాడిచేయడంతో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్ సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి శివారులోని మామిడితోటలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించడానికి కొప్పుల ఈశ్వర్, బాల్కసుమన్ వెళ్లగా అకస్మాత్తుగా తేనెటీగలు విజృంభించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎంపీ, స్థానిక సీఐ శరత్, ఎస్ఐ ఉపేంద్రచారి సమా పలువురు టీఆర్ఎస్ నాయకులు తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు. క్రీడాపోటీల వేదిక వద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో రాజకీయ నాయకులు తమ కార్లలోకి పరుగులు పెట్టారు. తేనెటీగలు వెళ్లిపోయి అంతా మామూలు పరిస్థితి ఏర్పడ్డాక గాయపడిన వారు స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెల్‌టవరెక్కిన యువతి.. ఆపై తేనెటీగల దాడి
సిరిసిల్ల రూరల్ : పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు మోసం చేశాడని సిరిసిల్ల మండలం జిల్లెల్లలో ఓ యువతి సెల్‌టవర్ ఎక్కింది. గ్రామానికి చెందిన బొల్గం రేవతి అదే గ్రామానికి చెందిన సాయిలి రమేశ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రేవతి ప్రస్తుతం గర్భిణీ. పెళ్లి మాట ఎత్తేసరికి రమేశ్ ముఖం చాటేశాడు. మూడురోజులుగా ఆమె ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో రేవతి గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టవర్‌పై ఉన్న తేనెటీగలు సైతం ఆమెపై దాడి చేశాయి. చివరకు గ్రామస్తులు, పోలీసుల హామీతో ఆమె దిగి వచ్చింది. తనకు న్యాయం చేయాలని గ్రామపెద్దలను కోరింది. సిరిసిల్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మధుమక్షిక ముద్దు మాకొద్దు..!!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) అదేంటోగానీ తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులపై తేనెటీగలు తెగ దాడి చేస్తున్నాయి, మిము వీడబోమంటూ గులాబీ నేతల వెంట బడుతున్నాయి. వారెక్కడికి వెళితే అక్కడ వాలిపోతున్నాయి. అమాత్యులపై అవిభాజ్యమైన అభిమానాన్ని ఒలకబోస్తున్నాయి. అభిమానిస్తున్నాయో, దాడి చేస్తున్నాయో అర్థం కాక గులాబీ నేతలు బిత్తరపోతున్నారు. మధుమక్షిక ముద్దు మాకొద్దు బాబోయ్ అంటూ తుర్రుముంటున్నారు. జుంటీగల బారిన పడకుండా జారుకుంటున్నారు. సమిష్టితత్వానికి ప్రతీక నిలిచే తేనెటీగలు దాడి చేయడంలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూకుమ్మడిగా అటాక్ చేయడం వాటికి తేనెతో పెట్టిన విద్య. తెలంగాణ తేనెటీగలు దాంతో పాటు మరో రూల్ కూడా పాటిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నాయి. బడా నేతలు పాల్గొంటున్న కార్యక్రమాల్లోనే పిలవని పేరంటాల్లా పోటెత్తున్నాయి. నాయకులను పరుగులు పెట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేసీఆర్ కుడి భజం ఈటెల రాజేందర్, సీఎం తనయుడు కేటీఆర్ లను జగిత్యాలలో జుంటీగల దండు జడిపించింది. నిన్నటికి నిన్న ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ బృందాన్ని పరుగులు పెట్టించింది. ఆమధ్య సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గడబిడ చేశాయి. కేసీఆర్ రాక కోసం హెలిప్యాడ్ వద్ద వేచి చూస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాలుదువ్వాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తేనెపట్టుల్లోని గదుల్లా లెక్క తెగదు. దేనికి భయకుండా నిర్భయంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గులాబీ నేతలను తేనెటీగలు ఠారెత్తిస్తున్నాయి. వారు ఏ కార్యక్రమానికి వెళ్లినా అనుకోని అతిథుల్లా అరుదెంచుతూ హడావుడి చేస్తున్నాయి. కారు పార్టీ నాయకులే వీటిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నారా అనే అనుమానానాలు రేకిత్తించేంతగా హనీబీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఎదురెళ్లి స్వాగతం పలుకుతూ పరుగులు పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు కునుకు లేకుండా చేస్తున్న తేనెటీగలకు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రత్యర్థులు. -పి. నాగశ్రీనివాసరావు -
తేనెటీగలు దాడి: 20 మంది కూలీలకు గాయాలు
కర్నూలు: కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం గుండిపాపలలోని నక్కలవాగు వద్ద ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు గాయపడ్డారు. మరికొంత మంది భయంలో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి.... గాయాలైన కూలీలను గోస్పాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.