![Woman Lives In Rs 4500 Crore Home With 400 Rooms Walls With 560 Kg Of Gold](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/jyothi.jpg.webp?itok=pQ7LeI_4)
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్‌లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్‌లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్‌కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.
ఆ రాకుమార్తె ఎవరంటే ..
జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్‌ని కలిగి ఉంది.
ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్‌బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్‌లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది.
ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్‌చాట్(Snapchat)లో ఇంటర్న్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి.
వాళ్లుండే ప్యాలెస్..
సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్‌లో నిర్మించారు.
దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట.
అలాగే గ్రాండ్ దర్బార్ హాల్‌లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్‌పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.
(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!)
Comments
Please login to add a commentAdd a comment