జై విలాస్ ప్యాలెస్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
భోపాల్: బీజేపీ ఎంపీ, గ్వాలియర్ రాచ వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ప్యాలెస్‌లో దొంగలు చోరీకి యత్నించినట్లు తెలిసింది. వివరాలు.. సింధియాకు చెందిన మధ్యప్రదేశ్ జై విలాస్ ప్యాలెస్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సోమవారం లేదా మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు వెంటిలేటర్ బద్దలు కొట్టి జై విలాస్ ప్యాలెస్‌లోని రాణి మహల్‌లోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు గుర్తించాం’’ అన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎంతమంది ఈ దొంగతనానికి ప్రయత్నించారు.. ఏమేం చోరీ చేశారు అనే దాని గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
గ్వాలియార్ సిటీ ఎస్పీ రత్నేష్ తోమర్ మాట్లాడుతూ.. ‘‘దొంగలు ప్యాలెస్‌లోని రాణి మహల్‌లోని ఓ గది వెంటిలేటర్‌ని బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ప్యాలెస్‌లో గతంలో బ్యాంక్ విధుల కోసం వినియోగించిన గదిలోని వస్తువులను ధ్వంసం చేశారు’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు.
స్నిఫర్ డాగ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు
జై విలాస్ ప్యాలెస్‌ని 19వ శతాబ్దంలో జయరావ్ సింధియా నిర్మించారు. 1874 ప్రాంతంలో ఆయన గ్వాలియర్ మహారాజుగా ఉన్నపుడు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఇది జ్యోతిరాదిత్య సింధియాకు సొంతం అయ్యింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment