
చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?
కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ని నిర్మించిన షాజహాన్ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి.

తొలి గార్డెన్ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..
ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి.
మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది.

రాణి కి వావ్, గుజరాత్
పాట్న రాణి కి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్ స్టెప్‌వెల్ ఆర్కిటెక్చర్.
అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.

విరూపాక్ష ఆలయం, కర్ణాటక
భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది.
ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రా
మొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్‌ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.

తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్
భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.

మిర్జన్ కోట, కర్ణాటక
ఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.

దక్షణేశ్వర్ కాళి ఆలయం, కోల్‌కతా
19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది.
ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.
(చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!)
Comments
Please login to add a commentAdd a comment