monuments
-
పర్యాటకులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల్లో ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ. భారత్‌ను అమృత కాలంలోకి తీసుకెళ్లేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉపయోగపడుతుందని పేర్కొంది. చరిత్రను స్మరించుకుంటూ సంస్కృతి, వారసత్వాన్ని గుర్తు చేస్తూ బంగారు భవిష్యత్తుకు మార్గం వేసేందుకు సాయపడుతుందని పేర్కొంది. 2021, మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఫ్రీడమ్ మార్చ్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృతి మహోత్సవంలోని కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం 2023, ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం మహాత్మాగాంధీ సహా.. స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. 𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆 𝗔𝘁 𝗔𝗹𝗹 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝘀 (𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟱-𝟭𝟱): As part of 'Azadi ka #AmritMahotsav' and 75th I-Day celebrations, @ASIGoI has made Entry Free for the visitors/tourists to all its protected monuments/sites across the country, from 5th -15th August, 2022 pic.twitter.com/NFuTDdCBVw — G Kishan Reddy (@kishanreddybjp) August 3, 2022 ఇదీ చదవండి: ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు! -
Hyderabad: పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు
భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచింది బన్సీలాల్‌పేటలోని పురాతన కోనేరు బావి. పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిర్మించారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో దీని పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. చారిత్రక సంపదను భావితరాలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. కోనేరు బావిని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పనా రమేష్ సందర్శించారు. బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ కోనేరు బావి పునరుద్ధరణ పనులను గురువారం ఆయన మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి కల్పనా రమేష్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. (చదవండి: సిగ్నల్ ఫ్రీ చౌరస్తాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు) బన్సీలాల్‌పేట్‌లో ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి 17వ దశాబ్దంలో కోనేరు బావిని నిర్మించారని, చెత్తాచెదారంతో నిండిన ఈ బావిని పునరుద్ధరించడానికి పనులు ప్రారంభించామన్నా రు. ఆగస్టు 15 నాటికి కోనేరు బావి పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. కోనేరు బావి సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ. కోటి ఖర్చు చేసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ శ్రీధర్ పాల్గొన్నారు. (చదవండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్) -
కడపలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు... బృహత్ శిలాయుగం నాటి..
వైఎస్సార్ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్): జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉంది. సుండుపల్లె మండలం దేవావాండ్లపల్లె సమీపాన ఉన్న బృహత్ శిలాయుగపు సమాధులే ఇందుకు నిదర్శనం. ఆ గ్రామానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరాన శేషాచల కొండల్లో బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇవి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి మనుషుల సమాధులు. దేశంలో ఇనుము వాడకం ప్రారంభమైన కాలానికి సంబంధించినవి. ఈ కాలాన్ని ఇనుపయుగం లేదా బృహత్ శిలాయుగం అంటారు. ఆ కాలంలో ఎవరైనా మరణిస్తే ప్రత్యేక పద్దతుల్లో పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించి సమాధులు నిర్మించేవారు. సమాధుల్లో డాల్మెన్స్, స్టోన్ సర్కిల్స్, మెన్ హిర్స్, సిస్ట్ బరియల్స్, డాల్మెనాయిడ్ సిస్ట్స్ తదితదర రకాలు ఉంటాయి. దేవావాండ్లపల్లె వద్ద శేషాచల అడవుల్లో డాల్మెన్స్ రకానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఆర్కియన్ యుగపు గ్రానైట్ రాయిని వీటి నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సమాధుల్లో మనిషి శవంతోపాటు ఇనుప పరికరాలు కూడా పూడ్చి పెడతారు. అప్పట్లో బ్లాక్ అండ్ రెడ్ వేర్ మట్టి పాత్రలను వినియోగించేవారు. చనిపోయిన వ్యక్తికి సమాధుల్లో ఆహారం వంటివి అవసరమవుతాయన్న మూఢ విశ్వాసంతో ఈ మట్టిపాత్రలను కూడా వేసి పూడ్చేవారు. ఈ సమాధుల వద్ద నేటికీ కొన్ని మట్టి పెంకులను మనం చూడవచ్చు. డాల్మెన్స్ సమాధుల లోపలి భాగంలో బండలపై తెలుపు రంగులో ఏనుగు, ఏనుగుపై సవారి చేస్తున్న మనిషి, తాబేళ్లు, డైనోసార్స్‌ను పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆనాటి మనుషులు వీటిని చిత్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆనుకుని ఉన్న మరో గుట్టపై డాల్మెన్స్ ఎన్ సర్కిల్డ్ విత్ శ్లాబ్స్ ఉన్నాయి. తామరపుష్పం ఆకారంలో ఈ సమాధుల చుట్టూ పెద్దపెద్ద బండరాళ్లు పాతారు. గుప్తనిధుల కోసం కొందరు దుండగులు చాలా సమాధులను పగులగొట్టారు. ఎముకలు, కుండ పెంకులు తప్ప అక్కడ ఏమి లభించవని వారికి తెలియకపోవడం వల్లనే సమాధులు పగులగొట్టి ఉంటారు. ప్రస్తుతం మిగిలినవి, పగుల గొట్టడబడినవి అన్నీ కలిపి 50 సమాధులు ఉన్నాయి. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇవి కనిపిస్తాయి. ఇలాంటి సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య భారతంలో కూడా కొంత ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలాంటి సమాధుల సంస్కృతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా లిథిక్ సైట్స్ ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. అందులో కడపజిల్లాలోనే అధికభాగం ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న మెగా లిథిక్ సైట్స్‌లో దేవావాండ్లపల్లె వద్ద ఉన్నవే పెద్దవి కావడం విశేషం. వీటిలో పాండవులు నివసించారని, కడప, చిత్తూరు జిల్లా ప్రజల విశ్వాసం. కనుక వీటిని ఈ జిల్లాల్లో పాండవ గుళ్లుగా పిలుస్తారు. దేవావాండ్లపల్లె ప్రజలు పాండురాజు గుళ్లు అంటారు. ఇలాంటి సమాధుల్లో రాక్షసులు నివసించారని భావించే కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు వీటిని రాక్షస గుండ్లు అని పిలుస్తారు. దేవావాండ్లపల్లెలోనే కాకుండా జిల్లాలో ఇతర చోట్ల కూడా అక్కడక్కడ ఇలాంటి సమాధులు మనకు కనిపిస్తాయి. టూరిస్ట్ హబ్‌గా మార్చాలి దేవావాండ్లపల్లె సమీపంలో ఉన్న బృహత్ శిలాయుగపు సమాధుల ప్రాంతాన్ని టూరిస్టు హబ్‌గా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. సమాధులు ఉన్న ప్రాంతానికి పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రహదారి సౌకర్యం కల్పించాలి. సైట్ చుట్టూ రక్షణ కంచె, వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. – కొండూరు జనార్దన్‌రాజు, కార్యదర్శి, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, కడప చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!
ఇప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సరిపోయింది. ఎంత బరువునైనా, ఎంత పెద్ద వస్తువునైనా ఒక చోటు నుంచి మరోచోటుకి తేలికగా రవాణా చేయొచ్చు. ఈ రోజుల్లో ఇట్లాంటి ఫీట్లు మామూలే! కానీ 5 వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనదేకదా! నాగరికత, సైన్స్ అంతగా అభివృద్ధి చెందని ఆనాటి రోజుల్లో దాదాపుగా 23 అడుగుల ఎత్తైన రాళ్లను ఎట్లా రవాణా చేయగలిగేవారో? ఒకదానిపై మరొకటి ఏ విధంగా పేర్చేవారో కనీసం ఊహించగలరా? అవునండీ! ఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన స్టోన్‌హెంజ్‌ను చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది!! వీటిని బృహత్ శిలాయుగానికి చెందిన సమాధి స్థలాలని కూడా అంటారు. అరుదైన బ్లూస్టోన్ మెటీరియల్‌తో రూపొందించిన అతిపెద్ద మెగాలితిక్ రాళ్ల వృత్తాకర సమూహమే ఈ స్టోన్‌హెంజ్. ఐతే ఈ భారీ శిలలు అంత ఎత్తు ఏవిధంగా పెరిగాయో? వీటి నిర్మాణ సమయంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఈ రాళ్లను ఎలా తీసుకురాగలిగారో? ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అద్భుతమైన కట్టడాన్ని వీక్షించడానికి ప్రతీ యేట ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకంగా టూరిస్టులు సందర్శిస్తున్నారు. కుదిరితే.. మీరు ఓసారి వెళ్లి చూడండి. చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
శిలాఫలకాలు మాత్రమే.. నిర్మాణాలు లేవు..
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా జిల్లా ప్రజలకు అంకితం చేయలేకపోయింది. లోటు బడ్జెట్లోనూ సీఎం చంద్రబాబు వేల కోట్ల రూపాయలతో జిల్లాను అభివృద్ధి చేశామని టీడీపీ పాలకులు, నేతలు గప్పాలు కొట్టుకుంటుంటే.. అభివృద్ధి పేరుతో వేసిన శిలా ఫలకాలు సమాధి రాళ్లుగా వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకు ప్రస్తుత ప్రభుత్వం రూపాయి నిధులు కేటాయించి పూర్తి చేసిన పాపాన పోలేదు. ఈ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలోనూ జిల్లాలో ఒక్క మేజర్ ప్రాజెక్ట్‌కు కూడా పునాది పడిన దాఖలాలు లేవు. అన్ని శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లో కేంద్రం విడుదల చేస్తున్న ఉపాధి హామీ నిధులతో పాటు, పంచాయతీల జనరల్ ఫండ్స్‌తో సిమెంట్ రోడ్లు వేసి, రాష్ట్ర ఖజానా నుంచి నిధులు వెచ్చించి తామే రోడ్లు నిర్మించినట్లుగా చంద్రబాబు అనేక వేదికల్లో చెప్పుకున్నారు. ఆయా పనులకు సంబంధించి గొప్పగా శిలాఫలకాలు వేసుకుని తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికలు సమీపించడంతో రూపాయి నిధులు కేటాయించకుండానే భారీ స్థాయి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆహా..ఓహో అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎన్ని‘కల’ ఫలకాలుగానే మిగిలిపోనున్నాయి. ఐదేళ్లుగా పెన్నా బ్యారేజీపై నిర్లక్ష్యం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు 2008లో ప్రారంభమయ్యాయి. ఆయన మరణం తర్వాత పెన్నా బ్యారేజీ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. చంద్రబాబు పదవిలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదికి ఆ ఏడాది పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రచార ఆర్భాటం సాగింది. ఐదేళ్లు అయినా పెన్నా బ్యారేజీ పనులు ఎప్పుటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. నెల్లూరు, కోవూరు కలిపే వారధిగా పెన్నాపరీవాహక ప్రాంత ఆయకట్టు స్థిరీకరణ దృష్ట్యా ప్రారంభమైన ఈ ఆధునిక పనులకు నిధుల లేమి వెంటాడుతున్నాయి. 600 మీటర్ల పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులకు మొత్తం 51 గేట్లు అవసరం. ఇప్పటికి 21 గేట్లు తెప్పించారు. కేవలం 8 గేట్లను మాత్రమే అమర్చారు. సుమారు 8 వేల చదరపు మీటర్ల కాంక్రీట్ పని ఆగిపోయింది. ఐదేళ్లుగా ఈ బ్యారేజ్ పనులు కొనసాగుతున్నా ఇప్పటికి 87 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పే అధికారులు మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. నిధుల కొరత 2015–16 వార్షిక బడ్జెట్లో జలవనరుల శాఖకు పెన్నా, సంగం బ్యారేజీల పనులకు రూ.5 కోట్లను కేటాయించారు. దీంతో నిధుల కొరత వల్ల పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రారంభంలో రూ.149 కోట్లకు ప్రతిపాదనలు చేసిన పెన్నా బ్యారేజీ అంచనా వ్యయం రూ.190 కోట్లకు పెరిగింది. నిధుల మంజూరుకు, పనులకు పొంతన లేకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మంత్రి నారాయణ గతేడాది ఆగస్టులో బ్యారేజ్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం నిధులతో ముడిపడిన సమస్యలు కావడంతో హామీలు గుప్పించారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తి కావాలని సూచనలు చేసి చేతులు దులుపుకున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి సుమారు రూ.6 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. బకా>యిలు పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలుపుదల చేశారు. అటు అధికార పార్టీ నేతలు, మంత్రులు బ్యారేజీ నిర్మాణ పనుల ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు మూడు షిప్టుల్లో జరిగిన బ్యారేజ్ పనులు ప్రస్తుతం చిన్నచిన్న పనులతో మందకొడిగా సాగుతున్నాయి. పిల్లర్లకే పరిమితం.. సంగం బ్యారేజీ సంగం: సాక్షాత్తు సీఎం చంద్రబాబునాయుడు మాటలు నీటి మూటలు అనడానికి నిలువెత్తు నిదర్శనమే అసంపూర్తిగా ఆగిపోయిన సంగం బ్యారేజీ నిర్మాణం. 2004లో రైతుల కష్టాలను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో పెన్నానదిలో నూతన బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.98 కోట్లతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు కాలయాపన చేసి చేతులెత్తేశారు. 2008, 2009 సంవత్సరాల్లో రెండో సారి టెండరు పెంచి మరో కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ చకచకా పనులు ప్రారంభించి రూ.30 కోట్లతో డౌన్‌స్ట్రీమ్ పనులు చేసే లోపే వైఎస్సార్ మరణించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంగం బ్యారేజీ నిర్మాణ పనుల్లో కొంత భాగం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు 2015లో సంగం బ్యారేజీని సందర్శించారు. 2017 మార్చిలోగా బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం రూ.80 కోట్లు పనులు జరిగి బ్యారేజీ నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. మరో రూ.70 కోట్ల పనులు జరగాల్సి ఉంది. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పిన మాటలు కాస్తా గాలి మాటలుగానే మిగిలిపోయాయి. ఇటీవల ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వచ్చిన చంద్రబాబు కనీసం సంగం బ్యారేజీ ప్రస్తావన రాకపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్లుగా వెక్కిరిస్తున్న శిలాఫలకం సోమశిల: ఒకటి కాదు, రెండు కాదు 8 ఏళ్లుగా తాగునీటి పథకం శిలాఫలకం పాలకుల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. అనంతసాగరం మండలంలోని 19 పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని గుర్తించి తీర్చేందుకు 8 ఏళ్ల క్రితం రూ.7 కోట్లతో చేపట్టిన సమగ్ర సాగునీటి పథకం నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో నిరుపయోగంగా మారింది. సోమశిల పెన్నానది నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వేసి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లోని గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేసేలా పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాన పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టారే కానీ నీరు సజావుగా అన్ని గ్రామాలకు అందకపోవడంతో ఏళ్ల తరబడి తాగునీటి ఎద్దడి అలాగే ఉంది. మండలంలోని గౌరవరం, కామిరెడ్డిపాడు, చిలకలమర్రి, అగ్రహారం, బీ వడ్డిపాళెం తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అలాగే ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డూప్ షో అట్టర్ ప్లాప్ కావలి: కావలి నియోజకవర్గంలో అభివృద్ధి డూప్ షో అట్టర్ ప్లాప్ అయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదేళ్లుగా నిరుపయోగమైన పనులు చేసి రూ.కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన టీడీపీ ఐదేళ్లు పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు కనీసం ప్రతిపాదనే లేని పనులకు, నిధులు మంజూరు లేకుండానే చేపట్టాలనుకున్న శంకుస్థాపనల షోలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆఖరికి ఉత్తుత్తి శిలాఫలకాలను కూడా ఆవిష్కరించలేకపోయారు. నియోజకవర్గంలోని కావలి టౌన్, కావలిరూరల్, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మొత్తం రూ.1,000 కోట్ల మేర అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఆ శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రోడ్ల మీద ఉండాలని, వాటిని ప్రజలు చూసి తాము చాలా పనులు చేస్తున్నామని నమ్మి ఓట్లు వేయాలని ప్లాన్ చేశారు. దీంతో అధికారులు తమ చేతికింద ఉండే కాంట్రాక్టర్ల కాళ్లా వేళ్లా పడి శిలాఫలకాలు సిద్ధం చేశారు. అయినప్పటికీ కొన్ని శిలాఫలకాలు సిద్ధం అయ్యేలోగా ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేయడంతో టీడీపీ నాయకులు షో నుంచి అవి తప్పించుకొన్నాయి. ఈ శిలాఫలకాలకు టీడీపీ పసుపు రంగు పూసి ప్రజల కంట్లో పడలా చేశారు. అయితే కొన్ని అసలు శిలాఫలకం పెట్టక ముందే రంగులు వేయడంతో టీడీపీ నాయకుల ఆరాటానికి ప్రజలు విస్తుపోతున్నారు. శిలాఫలకాలతో పాటు, నిర్మాణం సగం అయిన తర్వాత ఆగిపోయిన శిలాఫలకాలు దిమ్మెలు టీడీపీ నేతల విపరీత ధోరణిని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా కావలి పట్టణంలో పక్కా గృహాలు సముదాయంలో లబ్ధిదారులకు అప్పగించకుండానే గృహ ప్రవేశాలు చేసినట్లుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి షో చేశారు. కేంద్రం చేపట్టాల్సిన రామయపట్నంలో బుల్లి పోర్టుకు శంకుస్థాపన ఆవిష్కరించడానికి ముందే కావలిలో టపాసులు కాల్చి సందడి చేశారు. విమానాశ్రయానికి, శంకుస్థాన చేశారు. ఫిషింగ్ హార్బర్‌కు ఇలా అనేక పనులకు శిలాఫలకాలు వేశారు. నిధులు మంజూరు లేకుండానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ఆవిష్కరించి ఎన్నికల్లో తాము ఆ పనులు చేస్తున్నామని బడాయి మాటలు చెబుతున్న వాటిల్లో మచ్చుకు కొన్ని శిలాఫలకాల వివరాలుకావలి మున్సిపాలిటీ ద్వారా 41 శిలాఫలకాలను టీడీపీ నాయకులు ఆవిష్కరిస్తే, వాటికి రూ.10 లక్షలు కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టారు. ఈ డబ్బులు ఇవ్వమని మున్సిపాలిటీని కాంట్రాక్టర్లు అడుగుతుంటే..మా వద్ద డబ్బులు లేవు, ఇవ్వలేమని మున్సిపాలిటీ స్పష్టంగా చెబుతుంది. దీంతో కాంట్రాక్టర్లు తాము మోసపోయామని లబోదిబో మంటున్నారు. నారాయణ ఎన్నికల స్టంట్! సూళ్లూరుపేట: ‘దాహం వేస్తుందంటే.. ఉండండి బావి తవ్వి ఇస్తాం’ అనే సామెత చందనా టీడీపీ పాలకుల పరిస్థితి ఉంది. సూళ్లూరుపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో కోటపోలూరు చెరువులో సమ్మర్ స్టోరేజీ నిర్మించారు. వైఎస్సార్ మరణానంతరం సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 2014లో రూ.117 కోట్లతో రూ.7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు విచ్చేసి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పలుమార్లు పరిశీలించి వెళ్లారు. అయితే అది అమలుకు నోచుకోలేదు. ఐదేళ్లు ప్రజల ఇబ్బందులు పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు సరికొత్త నాటకానికి తెరతీసింది. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ. రూ.142 కోట్లు మంజూరయ్యాయంటూ మున్సిపల్ మంత్రి నారాయణ గత నెల 4వ తేదీన హడావుడిగా శిలాఫలకం వేశారు. ఇప్పుడు అది పట్టణ ప్రజలను వెక్కిరిస్తోంది. ఐదేళ్లుగా హామీలే సూళ్లూరుపేట: చేపల వేటే ఆధారంగా జీవిస్తున్న పులికాట్ జాలర్లకు జీవనోపాధిని పెంచేందుకు రూ.48 కోట్లతో సముద్ర ముఖద్వారాలను పూడిక తీయిస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. ఐదేళ్లుగా హామీలతో సరిపెట్టారు. గతేడాది, ఏడాదిలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సభల్లో రూ.48 కోట్లు మంజూరు చేశారని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సోమిరెడ్డి, పొంగూరు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే నేటికీ నిధులు మంజూరు కాలేదు. గతేడాది ఫ్లెమింగో ఫెస్టివల్‌ను బహిష్కరిస్తామని జాలర్లు హెచ్చరించడంతో మంత్రులు ముఖ్యమంత్రి నుంచి ఫోను వచ్చిందని, రూ. 48 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా నాటకమాడారు. పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీయించకపోవడంతో ఈ ఏడాది కూడా జాలర్లు పండగకు దూరంగానే ఉండిపోయారు. ఉత్తుత్తి హామీలు ఇచ్చి చంద్రబాబు మోసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోసం చేస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.సుమారు 20 వేల మందికి ఉపాధి అనుమానం పులికాట్ సరస్సులో 16 దీవిగ్రామాలు, 30 తీరప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 జాలర్లు కుప్పాలకు చెందిన వారు 20 వేలకు మందికి పైగా చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో 10 వేల మంది గిరిజనులు చేపలవేట ఆధారంగా బతుకు బండి లాగుతున్నారు. జనవరికే సరస్సు ఎండిపోవడంతో 20 వేల మంది ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల స్టంట్‌గా మిగిలిన మలిదేవి డ్రెయిన్ బుచ్చిరెడ్డిపాళెం: నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి కాలువ మలిదేవి డ్రెయిన్ ఎన్నికల స్టంట్‌గా మిగిలింది. ఎన్నికల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మలిదేవి డ్రెయిన్ అభివృద్ధి పనులకు సంబంధించి మార్చి 2వ తేదీన శిలాఫలకం వేశారు. వాస్తవానికి పోలంరెడ్డి హయాంలోనే మలిదేవి డ్రెయిన్ పూడిక తీతకు సంబంధించి నీరు–చెట్టు పేరిట రూ. 50 లక్షలు ఆయన అనుచరులు తూతూ మంత్రంగా పనులు చేసి స్వాహా చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా 87.41 కోట్ల నిధులు మలిదేవి డ్రెయిన్, మైనర్ డ్రెయిన్ల ఆధునికీకరణకు విడుదల చేయించారు. ఈ పనులు జరగవని, ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసీ తెలివిగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలంరెడ్డి కేవలం ఎన్నికల స్టంట్‌గా మలిదేవి డ్రెయిన్‌ను ఎంచుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మలిదేవి డ్రెయిన్ అభివృద్ధిని శిలాఫలకానికే పరిమితం చేశారని అంటున్నారు. అభివృద్ధి మిథ్య వెంకటగిరి: పదేళ్ల కిందట ఎంతో ఉన్నతాశయంతో వెంకటగిరి సమీపంలోని నెల్లూరు,చిత్తూరు జిల్లాల సరిహద్దులోని మన్నవరం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భెల్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అయితే నేటి పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. భెల్ పరిశ్రమ రూ.6 వేల కోట్ల అంచనాలతో నిరుద్యోగులకు కోటి ఆశలు కల్పించిన ఎన్బీపీపీఎల్ (ఎన్టీపీసీ, భెల్ పవర్ ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమ భెల్ మోగకుండానే మూగబోయింది. రూ.6 వేల కోట్లతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ చివరికి రూ.150 కోట్లకే పనులు పరిమితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భారీ విద్యుత్ పరికరాల తయారీని నిలిపేశారు. కేవలం చిన్నచిన్న విడి భాగాల తయారీ మాత్రమే జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా రావాల్సిన చిన్న తరహ పరిశ్రమలు కూడా రాలేదు. భెల్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా 10 వేల మంది, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. అడుగు ముందుకు కదలని ఎస్ఎస్ కెనాల్ నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు సోమశిల నుంచి స్వర్ణముఖి వరకు వెలుగొండలు కింద రూ.350 కోట్ల అంచనాలతో ఎస్ఎస్ కెనాల్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పట్లో కెనాల్ పనులు జోరుగా సాగాయి. ఆయన మరణం తర్వాత ఈ కాలువ నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్లుగా తయారైంది. ఈ కెనాల్ నిర్మాణ పనులకు అటవీ శాఖ అనుమతులు లేవని, కాలువ డిజైన్లు మార్చాలని ఏళ్ల తరబడి పాలకులు ఆ ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యంగా చేశారు. ఈ కాలువు పూర్తయి ఉంటే చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు నేరుగా సోమశిల జలాలు పారే అవకాశం ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రులు, వెంకటగిరి ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించకపోవడంతో ఈకాలువ నిర్మాణ పనులు జరగలేదని రైతులు చెబుతున్నారు. ఎస్ఎస్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వైఎస్సార్‌కు ఎక్కడ పేరుస్తోందో అని టీడీపీ పాలకులు అటకెక్కించినట్లు విమర్శలున్నాయి. కలగా మిగిలిన టెక్స్టైల్ పార్కు టైక్స్‌టైల్ పార్కు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెంకటగిరి ప్రాంత నిరుద్యోగులు, చేనేత కార్మికులు కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు అప్పటి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ప్రత్యేక చోరవతో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుసపాళెం వద్ద స్థల సేకరణ సైతం జరిగింది. వైఎస్సార్ మరణంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక చేనేత జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం పార్కు స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చి వెళ్లిపోయారు. వెంకటగిరి– ఏర్పేడులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమలు నెలకొల్పుతామని టీడీపీ నేతలు ఇచ్చిన హమీ సైతం మరుగునపడిపోయింది. కలగానే స్వర్ణముఖి నదిపై చెక్‌డ్యాంలు నాయుడుపేట: నాయుడుపేట మండల పరివాహక ప్రాంతమైన స్వర్ణముఖి నది తీరంలో చెక్ డ్యాంలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకనే మిగిలిపోయింది. 2017 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని కాలనీల్లోకి రావడంతో నది ఒడ్డుకు నీరు తన్నుకొచ్చాయి. కాలనీ ప్రజలు ఇబ్బందులు తప్పవని పునరావాస కేంద్రాలకు తరలించి బాధితులకు అప్పడు ఇళ్లు కట్టిస్తాం, కరకట్టలు మరమ్మతులు చేస్తామంటూ చెప్పారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య, రైతులకు సాగునీటి సమస్యను తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా చెక్‌డ్యాంలు నిర్మాణానికి రూ.కోట్లు నిధులు మంజూరు చేసి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకు సీఎం ఆ హామీని నెరవేర్చలేదు. చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు పంటలు పండే అవకాశం ఉంది. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా తరిమికొట్టవచ్చు. శిలాఫలకాలతోనే సరి.. ముత్తుకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైది. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రగతి సాధించేశాం అని చెప్పుకునేందుకే నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా అనేక పథకాలకు, అభివృద్ధికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శిలాఫలకాలను వేసుకుంటూ వెళ్లారు. అయితే వాటి నిర్మాణాలను మాత్రం గాలికొదిలేశారు. ముత్తుకూరులో మినీ స్టేడియం మొదలుకొని, ఫిష్ మార్కెట్, నేలటూరు పంచాయతీని సురక్షిత ప్రాంతానికి తరలింపు, పంచాయతీ కార్యాలయం, బలిజపాళెం అంగన్వాడీ కేంద్రం నిర్మాణం ఇలా ప్రతి దానికి మంత్రి సోమిరెడ్డి శిలాఫలకాలు వేశారు. కానీ ఇవేవీ నిర్మాణంలో అణువంత కూడా ముందుకు సాగలేదు. వెంకటాచలం పంచాయతీలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.7.28 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో రూర్బన్ నిధులు 30 శాతం, ఎన్ఆర్ఈజీఎస్ 70 శాతం నిధులతో మొత్తం 24 పనులను ఎంపిక చేశారు. గతేడాది డిసెంబరు 24వ తేదీన మంత్రి సోమిరెడ్డి భూగర్భ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. మనుబోలులో జలధార (వాటర్‌గ్రిడ్) పైలెట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత నెల 2వ తేదీన శిలాఫలకాన్ని మంత్రి సోమిరెడ్డి హడావుడిగా ఆవిష్కరించారు. మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం మండలాలకు కండలేరు జలాలను శుద్ధిచేసి తాగునీరు అందించేందుకు రూ.184 కోట్లతో పనులు చేసేందుకు స్థానిక బద్దెవోలు క్రాస్‌రోడ్డు వద్ద శిలాఫలకం వేశారు. అయితే ఇంత వరకూ ఎటువంటి పనులు ప్రారంభించలేదు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీలోని కృష్ణారెడ్డిపాళెం– మాచర్లవారిపాళెం మధ్య రూ.1.67 కోట్లతో లింకురోడ్డు నిర్మాణానికి గత నెల 4వ తేదీన సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గాలికొదిలేశారు. -
ఆవిడ బొమ్మెల్యే!. ఆయనే ఎమ్మెల్యే!!
పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని సామెత.. అచ్చం అలాగే ఉంది కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పరిస్థితి. ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి నామమాత్రంగా అధి కారం చలాయిస్తుండగా ఆమె భర్త సత్యనారాయణమూర్తి ఉరఫ్ సత్తిబాబు పెత్తనానికి కేరాఫ్ అయ్యారు. అన్ని వ్యవహారా లు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నా యి. అధికారులు కూడా ఆయన కొమ్ము కాస్తున్నారు. ఏ అధికార పదవీ లేని ఆయన పేరు, ఫొటోతో ఏకంగా శిలాఫలకాలే వేయిస్తున్నారు. మంది సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సత్తిబాబు ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తుంటే.. ఎప్పటికీ పనులు పూర్తికాని శిలాఫలకాలు అధికార దుర్వినియోగానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో ఒకే నివాస గృహం ఉన్న ఏరియాలో రూ. 8లక్షలతో వేసిన రోడ్డు కోసం నిర్మించిన శిలాఫలకమిది. శిలాఫలకంపై ఇద్దరు ఫొటోలు ఉన్నాయి. అందులో ఒకటి ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిది అయితే మరొకటి ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ( సత్తిబాబు)ది. ఈయనేమీ ప్రజాప్రతినిధి కాదు. ఎమ్మెల్యే భర్త కావడమే ఆయనకున్న అర్హత. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్మించిన శిలాఫలకాలపై వేసిన ఫొటోలు ఇప్పుడందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. అధికారులు ఎంత బరి తెగించేశారో అందరికీ అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పసుపు రంగుతో, ఫొటోలతో శిలాఫలకాలు వేయడం, దాంట్లో ప్రజాప్రతినిధి కాని ఎమ్మెల్యే భర్త ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలకు ముఖ్యంగా షాడో నేతలకు అధికారులు ఎంత దాసోహమై పోయారో... ఏ స్థాయిలో అడుగులకు మడుగులు ఒత్తుతున్నారో రూరల్ నియోజకవర్గంలో వేసిన శిలాఫలాకాలను చూస్తే స్పష్టమవుతుంది. ప్రజలు ఎన్నుకున్న మహిళా నేతల విషయంలో పురుషాధిక్యం పెత్తనం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. సర్పంచైనా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ సభ్యులు అయినా, ఎమ్మెల్యే అయినా భర్తల పెత్తనం, షాడోల అజమాయిషీ ఎక్కువగా ఉందనేది సర్వత్రా విన్నదే. కానీ, ఎమ్మెల్యే భర్త హోదాలో ఏకంగా శిలాఫలాకాలపై ప్రజాప్రతిని«ధి కాని పిల్లి సత్తిబాబు ఫొటోను ముద్రించడం చూస్తుంటే ఇక్కడ ఏ స్థాయిలో షాడో ఎమ్మెల్యేగా ఆయన దందా సాగిస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నది. ప్రతి దందాలోనూ ఆయన జోక్యం ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తగా తప్ప పిల్లి సత్తిబాబుకు మరే హోదా లేదు. కనీసం వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా, కార్పొరేటర్‌గా కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కానీ, అధికారులంతా ఆయన కనుసైగల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పటికే సూపర్ ఎమ్మెల్యేగా అన్నింట్లోనూ తలదూర్చుతున్నారు. ఎమ్మెల్యేను వెనక ఉంచి అంతా తానై వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి దందాలోనూ సత్తిబాబు జోక్యం ఉంటున్నది. అడ్డగోలు వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏ ఒక్క అధికారి నియోజకవర్గానికి వచ్చినా తొలుత ఆయనను కలవాల్సిందే. ఆయనకు చెప్పే నియోజకవర్గంలోకి రావాలి. అంతకన్న ముందు నియోజకవర్గంలో పనిచేయాలనుకుంటే సత్తిబాబు అనుమతి తీసుకోవాలి. ఆ స్థాయిలో నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. అయితే ఇదంతా అనధికారికంగానే జరుగుతోంది. కానీ అధికారులు పిల్లి సత్తిబాబుకు మాత్రం అధికారిక హోదా కట్టబెడుతున్నారు. ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ అత్యుత్సాహంతోనో.... సత్తిబాబు ఆదేశాలతోనూ తెలియదు గాని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలాకాల్లో ఏకంగా ఫొటో పెడుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు సత్తిబాబు ఫొటోను వేసి శిలాఫలకాలను నిర్మిస్తున్నారు. పదవి లేని సత్తిబాబు ఫొటో వేయడం సరికాదని ఇంతవరకు ఏ ఒక్క అధికారీ అభ్యంతరం తెలిపిన దాఖలాల్లేవు. చెప్పాలంటే మెప్పు కోసం ప్రభుత్వ ధనంతో ఇష్టారీతిన శిలాఫలాకాలు వేసేస్తున్నారు. లక్షలాది రూపాయలు శిలాఫలాకాల కోసమే ఖర్చు పెడుతున్నారు. నియోజకవర్గ మొత్తం మీద 2,500 నుంచి 3,000 వరకు ఈ రకంగా శిలాఫలాకాలు వేసినట్టుగా తెలుస్తోంది. ఏ పదవీ లేకుండా తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ శిలాఫలాకాలు చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉంటే చాలు...పదవి లేకపోయినా శిలాఫలకాలపై ఫొటోలు వేసుకోవచ్చనే పరిస్థితి వచ్చేసిందని గుసగుసలాడుకుంటున్నారు. షాడో నేతగా పిల్లి సత్తిబాబు పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్న ఆధారం ఇంకేమి కావాలని జనం బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే శంకుస్థాపనలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా పనులకు మోక్షం కలగడం లేదు. శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపడం లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని వలసపాకలలో అంగన్వాడీ సెంటర్ నుంచి లోపలికి ఉన్న ఇళ్ల కోసం రూ.10 లక్షలతో రోడ్డు నిర్మించేందుకు గతేడాది అక్టోబర్‌లో వేసిన శిలాఫలకమిది. ఇంతవరకు రోడ్డైతే వేయలేదు గాని అనంతలక్ష్మి దంపతులతో అట్టహాసంగా నిర్మించిన శిలాఫలకం మాత్రం అటుగా వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది. -
సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపల్లి నుంచి నందమూరు వరకూ రూ. 143 కోట్లతో యర్రకాల్వ ఆధునీకరణ పనులకు, తాళ్లపూడి మండలానికి నీటిశుద్ది ప్లాంట్‌కు పైప్‌లైన్ నిర్మాణం కోసం, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు సోమవారం మధ్యాహ్నం తాళ్లపూడిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఆయన వెళ్లిన గంటకే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అధికారులు తొలగించడంతో శిలాఫలకాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మ బోసిపోయినట్లయింది. విషయం ఏమిటంటే ఆ మూడు పథకాలు... మూడు చోట్ల ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆ మూడు చోట్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో జన్మభూమి ప్రాంగణంలోనే మూడు శిలాఫపకాలు ఏర్పాటు చేసి సీఎం చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ తర్వాత ఆ శిలాఫలకాలను ఆయా పథకాల వద్ద ఏర్పాటు చేసేందుకు తొలగించారు. విషయం తెలియని జనం దీనిపై చర్చించుకోవడం కనిపించింది. -
వాటిని చూసి ఇంజనీర్లు నేర్చుకోవాలి
మాదాపూర్: హైదరాబాద్ నగరంలోని వందల ఏళ్ల నాటి కట్టడాలను చూసి ఇంజనీర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం ఆర్చ్ దక్షిణ్ సదరన్ రీజినల్ కాంపారెన్స్–2016ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీర్లు చేసే ప్రతి పని భావి తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని మరింత అద్భుతమైన కట్టడాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఐఐఏ జాతీయ అధ్యక్షులు దివ్యకుష్, జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ పద్మావతి పేర్వారం, ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ మన్నెపల్లి గురురాజ్ తదితరులు హాజరయ్యారు. -
మెట్రో డైలమా
*చారిత్రక కట్టడాలను కూల్చొద్దంటున్న సీఎం *టన్నెల్ విధానమే మేలని సూచన * సాధ్యం కాదంటున్న నిర్మాణ సంస్థ * మధ్యేమార్గంగా ఎల్అండ్టీ సర్వే సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైల్ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. చారిత్రక కట్టడాలున్న రెండు మార్గాల్లో భూగర్భ మెట్రో పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైలమాలో పడింది. భూగర్భ మార్గం సాధ్యం కాదని సదరు సంస్థ పేర్కొంటున్నా సీఎం వినే పరిస్థితి లేకపోవడంతో సదరు రూట్లలో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పిల్లర్లు పూర్తయినా మిగతా పనులను నిలిపివేసింది. మొదట సర్వే చేపట్టి తద్వారా వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకుగాను ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏదేమైనా భూగర్భ మెట్రో సాధ్యం కాదనే విషయాన్ని ఎల్అండ్టీ బాహాటంగానే స్పష్టం చేస్తున్నా స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. నిలిచిన పనులు! చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేయాల్సి ఉన్నందున మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గంలో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయినట్టు తెలిసింది. ఈ రూట్లో సోమవారం తాత్కాలికంగా కొన్ని బారికేడ్లను తొలగించారు. ఈ మార్గంలో సర్వే పూర్తయి, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాకే పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మార్గంలో 20 వరకు ఎలివేటెడ్ పిల్లర్లు ఏర్పాటయ్యాయి. భూగర్భ మెట్రో అంశంపై సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలు తాజాగా సంయుక్తంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో సుల్తాన్‌బజార్ ప్రాంతంతోపాటు, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భ మెట్రో మార్గం వేయాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో విస్పష్ట ప్రకటన చేయడంతో మెట్రో వర్గాలు ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నిపుణుల కమిటీలో హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ ఉన్నతాధికారులతోపాటు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, భూభౌతిక శాస్త్రవేత్తలు, రైల్వే రంగ నిపుణులు ఉన్నారని తెలిసింది. ఈ బృందం భూగర్భ మెట్రో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. భూగర్భ మార్గంపై అనుమానాలెన్నో.. కోల్‌కతాలోని భూగర్భ మెట్రో మార్గంలో ఇటీవల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు రెండు గంటల పాటు ఓ మెట్రోరైలు నిలిచిపోయింది. ప్రయాణికులు బయటికి వెళ్లే దారిలేక, శ్వాస ఆడక స్పహతప్పిపోయిన ఉదంతాన్ని సైతం నిపుణుల బృందం పరిగణనలోకి తీసుకుని నివేదికలో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. నగరంలో భూగర్భ మార్గంలో పనులు చేపట్టాల్సి వస్తే ప్రతి మూడు మీటర్ల లోతున వచ్చే రాతి నేల (రాక్ సాయిల్)ను తొలిచేందుకు బ్లాస్టింగ్ (పేలుడు పదార్థాల వినియోగం) చేయడం వీలుకాదనే అంశాన్ని నివేదికలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్లాస్టింగ్ల వల్ల చారిత్రక కట్టడాలకు మరో రూపంలో ప్రమాదం పొంచి ఉంటుందని, రద్దీ రూట్లో ఇది సాధ్యపడదని అంటున్నారు. కాగా భూగర్భ మార్గంలో పనులు చేపడితే భద్రతాపరంగా వచ్చే సమస్యలను సైతం ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ లేఖపై కలకలం? భూగర్భ మెట్రో సాధ్యం కాదని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు వచ్చిన కథనాలను ఇటు ఎల్అండ్టీ, అటు హెచ్ఎంఆర్ వర్గాలు ఖండించలేదు. దీనిపై ఆయా సంస్థల ఉన్నతాధికారులు మాట్లాడేందుకు నిరాకరించారు. ముందుగా అనుకున్న ప్రకారం నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో మొదటి దశను 21 మార్చి 2015 నాటికి ప్రారంభిస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. జూలై మొదటి లేదా రెండో వారంలో ఇదే రూట్లో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నాయి. ఆదేశాలు అందలేదు: ఎల్అండ్టీ భూగర్భ మెట్రోపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థలకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందలేదని ఎల్అండ్టీ వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు, అందులో ప్రస్తావించిన పనులు విధిగా పూర్తిచేస్తామని తెలిపాయి. ఒప్పందానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశాయి. దీనిపై తాము ప్రభుత్వానికి ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొన్నాయి. -
స్మారక చిహ్నాలే!
* కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవాల పరిస్థితి ఇదే * భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా.. ఆ ఆయుకట్టుకు నీరు వాడుకోవడం దాదాపు అసాధ్యం * బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని వింత నిబంధనల పర్యవసానం సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవా.. ఈ ఆరు ప్రాజెక్టులు కరువు, ఫ్లోరైడ్ పీడిత మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం తో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటయ్యాయి. అయితే, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం చూస్తే.. భవిష్యత్‌లో ఆ ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణాలు పూర్తయినా.. భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా ...ఆ ఆరు ప్రాజెక్టులకు మాత్రం అవసరమైన సమయంలో ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదీ పంపకం... వాడకం పద్ధతి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణాజలాలపై స్పష్టతనిచ్చింది. కృష్ణాపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాలు(మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్) కూడా ముందుగా నికర జలాల (75 శాతం డిపెండబిలిటీ ప్రకారం)ను వాడుకోవాల్సి ఉంటుంది. అంటే కర్ణాటక 734 టీఎంసీలు, మహారాష్ట్ర 585 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల చొప్పున మొత్తం 2130 టీఎంసీలను ఉపయోగించుకోవాలి. ఈ నీటి పరిధి వరకు ఎవరికి ముందు వస్తే వారు ఉపయోగిస్తారు. అంటే దిగువ రాష్ట్రాల్లో నీరు లేకున్నా...ఎగువ ప్రాంతం వారు దిగువకు నీటిని విడుదల చేయకుండనే ఉపయోగించుకోవచ్చు. పైగా ఈ నీటి ఉపయోగానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ...ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించారు. దాంతో ఒక ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని మరో మరో ప్రాజెక్టుకు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు అసలు మళ్లించడానికి వీలు లేదు. ఈ నీటి వాడకం పూర్తయిన తర్వాత అదనపు (65 శాతం డిపెండబిలిటి) జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 147 టిఎంసీల ఈ నీటిలో మహారాష్ట్రకు 43 టిఎంసీలు, కర్నాటకకు 61 టిఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 43 టిఎంసీలను కేటాయించారు. తర్వాత నదిలోని 47 సంవత్సరాల సరాసరి ప్రవాహాన్ని అంచనా వేసిన మిగులు జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో 35 టిఎంసీలు మహారాష్ట్రకు, 105 టిఎంసీలను కర్నాటకకు, 145 టిఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మనకు కేటాయంచిన 145 టిఎంసీలను నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ కింద పరిగణించారు. పైన పేర్కొన్న మొత్తం నీరు 2562 టిఎంసీలు. అసలు సమస్య ఇదీ ! - ప్రస్తుతం వునం వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నందున కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు పైన పేర్కొన్న అన్ని రకాల నీటి (నికర, మిగులు, అదనం)లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంటే...నదిలో 2562 టింఎసీల నీటి కంటే ఎక్కువ వచ్చిన సందర్భాల్లోనే ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. - ఒకవేళ వుంచి వర్షాలు కురిసినా వుుందుగా వుూడు రాష్ట్రాలూ తవు నికరజలాలు వాడుకుని, ఆ తరువాత అదనపు జలాలు, మిగులు జలాలు వాడుకున్న తరువాత గానీ ఈ వరదజలాల వాడకం సాధ్యపడదు. ఐతే ఆ వుూడు రకాల జలాల (2562 టీఎంసీలు) ఉపయోగం పూర్తి కావటానికి నవంబరు, డిసెంబరు నెలలు దాటిపోతుంది. - ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు మిగులుజలాల్లో వాటా ఇస్తున్నట్లే ఇచ్చి వాటిని తెలుగుగంగకు, నాగార్జునసాగర్ క్యారీ ఓవర్‌గా చూపించింది. అంటే ఈప్రాజెక్టులకు తప్పనిసరిగా వరద జలాలు వూత్రమే దిక్కు. 2562 టీఎంసీల వాడకం పూర్తరుుతే ఒక హక్కుగా గాకుండా కేవలం ‘వరదజలాల వాడకంపై స్వేచ్ఛ’ కోణంలో వూత్రమే ఈ ప్రాజెక్టులకు నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాజెక్టులకు అన్నిరకాల అనువుతులూ కష్టసాధ్యమే! - ఒకవేళ ఈ ఏడాది మాదిరిగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లోనే కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు వచ్చి... అన్ని రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండినా, ఈ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడం సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికి మూడు రాష్ట్రాల నీటి వాడకం 2562 టిఎంసీల పరిధి దాటదు. పైగా మూడు రాష్ట్రాల్లోని ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా 1,500 టిఎంసీల లోపుగానే ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 2562 టిఎంసీల వాడకం పూర్తి కాకుండా...వరద నీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడానికి వీలు లేదు. ఒక వేళ సొంత రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా... కొత్తగా ఏర్పడే ‘కృష్ణా జల నిర్ణయ అమలు బోర్డు’ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎగువ రాష్ట్రాల అనుమతి కూడా తప్పని సరి అవుతుంది. - మంచి వర్షాలు కురిసినా, బోర్డు అనువుతించినా... నికర, అదనపు, మిగులుజలాల వాడకం లెక్కలు పూర్తయ్యేలోపు ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. - ఒకవేళ ఏ అక్టోబర్లోనో వరదలు వచ్చినా...అవి ఎక్కువ రోజులు ఉండవు. రెండు మూడు రోజుల్లోపే వరద ఉదృతి తగ్గిపోతుంది. ఈ వరద జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించాలంటే పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 40 నుంచి 80 రోజుల పాటు పంపింగ్ చేస్తేనే... పంటలకు నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల వినియోగానికి సరిపడా నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవు. - నిల్వ రిజర్వాయుర్లు సరిపడా లేనందున పంపింగ్ చేసే నీరు నేరుగా కాలువల్లోకి, పంట పొలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆమేరకు రోజుల తరబడి నదీప్రవాహంలో నీరు ఉండాలి. రబీ పూర్తయ్యేదాకా రోజూ నీటిని పంపింగ్ చేయాలంటే అన్ని రోజులు నదిలో వరద ఉండదు. - ఒకవేళ రాష్ట్రం క్యారీ ఓవర్ నుంచి ఇవ్వాలనుకున్నా... ఇది నాగార్జునసాగర్‌కే ఆ అవకాశం ఉంది గానీ శ్రీశైలానికి లేదు. పైగా ఆ క్యారీ ఓవర్ నీరు సాగర్ దిగువన ఉన్న ఆయుకట్టుకే పరిమితమైన కోటా. - ఒకవేళ రాష్ట్రం కొంత స్వేచ్ఛ తీసుకుని వున క్యాచ్‌మెంట్‌లో వచ్చే నీటిని ఇవ్వాలనుకున్నా రెండు రకాలుగా సాధ్యం కాదు. ఒకటేమో వున క్యాచ్‌మెంట్‌లో వచ్చేది కేవలం 35 శాతం వూత్రమే. మిగతా నీటిని వునం ఎగువ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి ఉంది. - పైగా ఈ క్యాచ్మెంట్ నీరు కూడా నికరం, అదనం, మిగులు జలాల లెక్కలో కలిపేసి ఉంటుంది కాబట్టి విడిగా ఇవ్వడం కుదిరే పని కాదు. బోర్డు అంగీకరించదు.