స్మారక చిహ్నాలే! | Irrigation projects to become monuments | Sakshi
Sakshi News home page

స్మారక చిహ్నాలే!

Published Sun, Dec 1 2013 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

స్మారక చిహ్నాలే!

స్మారక చిహ్నాలే!

 * కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవాల పరిస్థితి ఇదే
* భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా.. ఆ ఆయుకట్టుకు నీరు వాడుకోవడం దాదాపు అసాధ్యం
* బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని వింత నిబంధనల పర్యవసానం

 
 సాక్షి, హైదరాబాద్:
  కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవా.. ఈ ఆరు ప్రాజెక్టులు కరువు, ఫ్లోరైడ్ పీడిత మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం తో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటయ్యాయి. అయితే, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం చూస్తే.. భవిష్యత్‌లో ఆ ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణాలు పూర్తయినా.. భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా ...ఆ ఆరు ప్రాజెక్టులకు మాత్రం అవసరమైన సమయంలో ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది.

 ఇదీ పంపకం... వాడకం పద్ధతి
 బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణాజలాలపై స్పష్టతనిచ్చింది. కృష్ణాపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాలు(మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్) కూడా ముందుగా నికర జలాల (75 శాతం డిపెండబిలిటీ ప్రకారం)ను వాడుకోవాల్సి ఉంటుంది. అంటే కర్ణాటక 734 టీఎంసీలు, మహారాష్ట్ర 585 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల చొప్పున మొత్తం 2130 టీఎంసీలను ఉపయోగించుకోవాలి. ఈ నీటి పరిధి వరకు ఎవరికి ముందు వస్తే వారు ఉపయోగిస్తారు. అంటే దిగువ రాష్ట్రాల్లో నీరు లేకున్నా...ఎగువ ప్రాంతం వారు దిగువకు నీటిని విడుదల చేయకుండనే ఉపయోగించుకోవచ్చు. పైగా ఈ నీటి ఉపయోగానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ...ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించారు.

దాంతో ఒక ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని మరో మరో ప్రాజెక్టుకు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు అసలు మళ్లించడానికి వీలు లేదు. ఈ నీటి వాడకం పూర్తయిన తర్వాత అదనపు (65 శాతం డిపెండబిలిటి) జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 147 టిఎంసీల ఈ నీటిలో మహారాష్ట్రకు 43 టిఎంసీలు, కర్నాటకకు 61 టిఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 43 టిఎంసీలను కేటాయించారు. తర్వాత నదిలోని 47 సంవత్సరాల సరాసరి ప్రవాహాన్ని అంచనా వేసిన మిగులు జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో 35 టిఎంసీలు మహారాష్ట్రకు, 105 టిఎంసీలను కర్నాటకకు, 145 టిఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మనకు కేటాయంచిన 145 టిఎంసీలను నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ కింద పరిగణించారు. పైన పేర్కొన్న మొత్తం నీరు 2562 టిఎంసీలు.

 అసలు సమస్య ఇదీ !
 - ప్రస్తుతం వునం వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నందున  కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు పైన పేర్కొన్న అన్ని రకాల నీటి (నికర, మిగులు, అదనం)లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంటే...నదిలో 2562 టింఎసీల నీటి కంటే ఎక్కువ వచ్చిన సందర్భాల్లోనే ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
 - ఒకవేళ వుంచి వర్షాలు కురిసినా వుుందుగా వుూడు రాష్ట్రాలూ తవు నికరజలాలు వాడుకుని, ఆ తరువాత అదనపు జలాలు, మిగులు జలాలు వాడుకున్న తరువాత గానీ ఈ వరదజలాల వాడకం సాధ్యపడదు. ఐతే ఆ వుూడు రకాల జలాల (2562 టీఎంసీలు) ఉపయోగం పూర్తి కావటానికి నవంబరు, డిసెంబరు నెలలు దాటిపోతుంది.

 - ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు మిగులుజలాల్లో వాటా ఇస్తున్నట్లే ఇచ్చి వాటిని తెలుగుగంగకు, నాగార్జునసాగర్ క్యారీ ఓవర్‌గా చూపించింది. అంటే ఈప్రాజెక్టులకు తప్పనిసరిగా వరద జలాలు వూత్రమే దిక్కు. 2562 టీఎంసీల వాడకం పూర్తరుుతే ఒక హక్కుగా గాకుండా కేవలం ‘వరదజలాల వాడకంపై స్వేచ్ఛ’ కోణంలో వూత్రమే ఈ ప్రాజెక్టులకు నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాజెక్టులకు అన్నిరకాల అనువుతులూ కష్టసాధ్యమే!

 - ఒకవేళ ఈ ఏడాది మాదిరిగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లోనే కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు వచ్చి... అన్ని రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండినా, ఈ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడం సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికి మూడు రాష్ట్రాల నీటి వాడకం 2562 టిఎంసీల పరిధి దాటదు. పైగా మూడు రాష్ట్రాల్లోని ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా 1,500 టిఎంసీల లోపుగానే ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 2562 టిఎంసీల వాడకం పూర్తి కాకుండా...వరద నీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడానికి వీలు లేదు. ఒక వేళ సొంత రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా... కొత్తగా ఏర్పడే ‘కృష్ణా జల నిర్ణయ అమలు బోర్డు’ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎగువ రాష్ట్రాల అనుమతి కూడా తప్పని సరి అవుతుంది.
 - మంచి వర్షాలు కురిసినా, బోర్డు అనువుతించినా... నికర, అదనపు, మిగులుజలాల వాడకం లెక్కలు పూర్తయ్యేలోపు ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది.

 - ఒకవేళ ఏ అక్టోబర్‌లోనో వరదలు వచ్చినా...అవి ఎక్కువ రోజులు ఉండవు. రెండు మూడు రోజుల్లోపే వరద ఉదృతి తగ్గిపోతుంది. ఈ వరద జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించాలంటే పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 40 నుంచి 80 రోజుల పాటు పంపింగ్ చేస్తేనే... పంటలకు నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల వినియోగానికి సరిపడా నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవు.
 - నిల్వ రిజర్వాయుర్లు సరిపడా లేనందున పంపింగ్ చేసే నీరు నేరుగా కాలువల్లోకి, పంట పొలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆమేరకు రోజుల తరబడి నదీప్రవాహంలో నీరు ఉండాలి. రబీ పూర్తయ్యేదాకా రోజూ నీటిని పంపింగ్ చేయాలంటే అన్ని రోజులు నదిలో వరద ఉండదు.
 - ఒకవేళ రాష్ట్రం క్యారీ ఓవర్ నుంచి ఇవ్వాలనుకున్నా... ఇది నాగార్జునసాగర్‌కే ఆ అవకాశం ఉంది గానీ శ్రీశైలానికి లేదు. పైగా ఆ క్యారీ ఓవర్ నీరు సాగర్ దిగువన ఉన్న ఆయుకట్టుకే పరిమితమైన కోటా.
 - ఒకవేళ రాష్ట్రం కొంత స్వేచ్ఛ తీసుకుని వున క్యాచ్‌మెంట్‌లో వచ్చే నీటిని ఇవ్వాలనుకున్నా రెండు రకాలుగా సాధ్యం కాదు. ఒకటేమో వున క్యాచ్‌మెంట్‌లో వచ్చేది కేవలం 35 శాతం వూత్రమే. మిగతా నీటిని వునం ఎగువ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి ఉంది.
 - పైగా ఈ క్యాచ్‌మెంట్ నీరు కూడా నికరం, అదనం, మిగులు జలాల లెక్కలో కలిపేసి ఉంటుంది కాబట్టి విడిగా ఇవ్వడం కుదిరే పని కాదు. బోర్డు అంగీకరించదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement