Indian women
-
టీమిండియా వుమెన్స్ భారీ విజయం
రాజ్‌కోట్: ఐసీసీ చాంపియన్‌షిప్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ మహిళలు భారీ విజయం సాధించారు. రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలోఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది.రోడ్రిగ్స్(102) సెంచరీతో కదం తొక్కగా, హర్లీన్ డియోల్(89), మంధనా(73), ప్రతీకా రావల్(67)లు హాఫ్ సెంచరీలతో మెరిశారు. దాంతో భారత్ 351 పరుగుల లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచింది.అనంతరం బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కౌల్టర్ రిలీ(80) మాత్రమే ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలవడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత మహిళ జట్టులోని బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లతో రాణించగా,టిటిస్ బాదు, సాయలి తలో వికెట్ సాధించారు. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికె ట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జ ట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగనుంది. -
భారత మహిళల రగ్బీ జట్టుకు రజత పతకం
ముంబై: ఆసియా రగ్బీ ఎమిరేట్స్ సెవెన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. నేపాల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 5–7 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమి పాలైంది. శిఖా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అంతకుముందు సెమీఫైనల్లో 24–7 తేడాతో గువామ్‌పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో తుదిపోరుకు చేరింది. లీగ్ దశలో భారత్ 29–10 తేడాతో శ్రీలంకపై... 17–10తో ఇండోనేసియాపై గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఈ టోర్నీలో మరోసారి రజతం గెలవడం ఆనందంగా ఉందని శిఖా యాదవ్ పేర్కొంది. ‘ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటారు. కఠిన ప్రత్యర్థులపై చక్కటి ప్రదర్శన కనబర్చడం వల్లే రజత పతకం సాధించగలిగాం. సహచరుల ఆటతీరుతో గర్వపడుతున్నా. ఈ విజయంలో కోచ్‌లతోపాటు సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’అని శిఖా యాదవ్ చెప్పింది. -
ముందు కెరీర్..తర్వాతే పిల్లలు!
ఇల్లు.. పెళ్లి.. పిల్లలు.. ఇది నిన్నటితరం భారతీయ మహిళల మాట.. ఉన్నత చదువు.. కెరీర్.. పెళ్లి.. కెరీర్లో స్థిరత్వం.. ఆ తర్వాతే పిల్లలు.. ఇదీ నేటి భారతీయ మహిళల దృక్కోణంలో వచ్చిన మార్పు.. అవును.. పిల్లలకు జన్మనిచ్చే విషయంలో భారత మహిళల దృక్పథం మారుతోంది. ముందు ఉన్నత చదువును అభ్యసించడం, మంచి ఉద్యోగం సాధించి కెరీర్‌ను మొదలుపెట్టడం, ఆ తర్వాత దాంపత్య బంధంతో ఒక్కటి కావడం, కెరీర్లో స్థిరత్వం ఇవన్నీ సమకూరాకే సంతానం కనడానికి మొగ్గుచూపుతున్నారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరే వరకు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ మేరకు 2016 తర్వాత నుంచి భారత మహిళల దృక్పథంలో గణనీయ మార్పులు వచ్చాయని కేంద్ర గణాంకాలు – కార్యక్రమాల అమలు శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ‘భారతదేశంలో మహిళలు, పురుషులు– 2023’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశంలో జనాభా పెరుగుదల, పురుషులు–మహిళల నిష్పత్తి, సంతానం విషయంలో మహిళల దృక్పథం తదితర అంశాలపై కీలక విషయాలను పొందుపరిచింది. అందులోని ప్రధాన అంశాలు ఇవీ.. – సాక్షి, అమరావతి2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లు దేశ జనాభా 2036 నాటికి ఏకంగా 152.2 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల జనాభా నిష్పత్తి క్రమంగా మెరుగుపడుతోంది. 2011లో దేశంలో ప్రతి వేయిమంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా... 2036 నాటికి 952కు పెరుగుతారని అంచనా. 2011లో దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం ఉండగా 2036 నాటికి 48.8 శాతానికి పెరగనున్నారు.మారుతున్న ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ భారతదేశంలో ‘వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు’ (ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్) గణనీయంగా మారుతోంది. 20 – 24 ఏళ్లు, 25 – 29 ఏళ్లు, 30– 34 ఏళ్లు, 35– 39 ఏళ్లు.. ఇలా ఐదేళ్లు ఒక్కో కేటగిరీగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో ప్రతి వేయి మంది మహిళలు ఏడాదిలో ఎంతమంది బిడ్డలకు జన్మనిస్తారో దాన్ని వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు అని అంటారు. మహిళల నిర్ణయానికి కారణాలివే» కెరీర్లో స్థిరపడ్డాక నిర్దేశిత లక్ష్యాలు సాధించేవరకు బిడ్డలను కనేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. బిడ్డలను కంటే కెరీర్‌పై తగినంత శ్రద్ధ చూపించలేమని, అలాగే వారికి కావాల్సినంత సమయం కేటాయించలేమనే భావనతో ఉన్నారు. అందుకే 20 నుంచి 29 ఏళ్ల మధ్యలో కెరీర్లో స్థిరపడ్డాకే బిడ్డలను కనాలని భావిస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. దీంతో ఆ కేటగిరీల్లో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. » ఇక కెరీర్లో స్థిరపడ్డాక బిడ్డలను కంటున్న మహిళల శాతం పెరుగుతోంది. దేశంలో 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2011– 2015 మధ్య 35 నుంచి 39 ఏళ్ల కేటగిరీలో వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 32 ఉండగా... 2016– 2020లో అది 35కు పెరిగింది. » ఇక 18 ఏళ్ల లోపే బిడ్డలను కంటున్న వారిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య వ్యత్యాసం ఉంది. 2016–2020లో నిరక్షరాస్యుల్లో 18 ఏళ్ల లోపు వయో నిర్దిష్ట సంతానోత్పత్తి రేటు 39గా ఉండగా... అక్షరాస్యుల్లో ఆ రేటు 11కే పరిమితమైంది. తగ్గుతున్న ప్రసూతి మరణాలు.. ప్రసూతి మరణాలను తగ్గించడంలో భారతదేశం నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది. 2030 నాటికి దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాలను 70కు తగ్గించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో 2018–20 నాటికి ప్రసూతి మరణాలను 97కు తగ్గించారు. 2030 నాటికి కంటే ముందుగానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రభుత్వం పూర్తి ధీమాతో ఉంది. ఇక దేశంలో శిశు మరణా లు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రతి వేయి కాన్పులకు శిశు మరణాల రేటు 2015లో 43గా ఉండగా.. 2020నాటికి 32కు తగ్గింది. -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్‌గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
భారత్ X దక్షిణాఫ్రికా
భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త సీజన్‌ను సొంతగడ్డపై మొదలు పెట్టనుంది. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. దీని తర్వాత సఫారీ టీమ్‌తోనే 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ కూడా జరుగుతుంది. గత జనవరిలో ఆ్రస్టేలియా చేతిలో వన్డే, టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళలు... ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను టి20ల్లో 5–0తో చిత్తుగా ఓడించారు. బ్యాటింగ్‌లో హర్మన్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. -
పది రూపాయలతో ప్రారంభం..
మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు... మనతో ΄పాటు మన చుట్టూ ఉన్నవారూ బాగుండాలి అనే ఆలోచన ఇండోర్‌వాసి కుక్కు ద్వివేదినిది. ఆపదలో ఉన్నవారికి చిన్న సాయమైనా చేయాలి అనే ఆశయంతో బ్యాంకు ఉద్యోగం చేస్తూ, కుటుంబ నిర్వహణను చూస్తూనే పేదలకు కావల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేయాలనుకుంది. అందుకోసం 400 మంది సహోద్యోగుల జీతంలో ఒక్కొక్కరి నుంచి పదేసి రూపాయలను సేకరించి, ఆ మొత్తంతో ఉచిత మందుల పంపిణీని మొదలుపెట్టింది. ΄పాతికేళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని గ్రామాలు తిరుగుతూ ఉచిత విద్య, వైద్యసేవలను అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘‘నా బాల్యం అందమైన జ్ఞాపకాలతో గడిచింది. మా నాన్న డాక్టర్. నలుగురికి సాయం చేసే స్వభావం కావడంతో ఆయన సాయం కోసం, వైద్యం కోసం ఇంటికి ఎప్పుడూ అనేకమంది వస్తూ ఉండేవారు. వారి కోసం అమ్మ ప్రతిరోజూ వంట చేసి ఉంచేది. అది చూస్తూ పెరగడం వల్ల కాబోలు చిన్నప్పటి నుంచి ఎవరైనా సాయం అడిగితే కాదనే గుణం నాకు లేదు. ఇలా ఉచితంగా చేసే సాయాలను సామాజిక సేవ అంటారని కూడా తెలియకుండానే పదిమందికీ చేతనైన సాయం చేసేదాన్ని. జీవించడానికి తక్కువ వస్తువులు చాలు డిగ్రీ పూర్తవుతూనే తొలి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఇతరులకు నా అంతట నేనే సాయం చేయగలిగే అవకాశం వచ్చిందని సంతోషించాను.పెళ్లయ్యాక నా భర్త మద్దతు లభించింది. నా భర్త కూడా బ్యాంకు ఉద్యోగి. ఇద్దరి సం΄ాదన ఉన్నా మా ఇంట్లో తక్కువ వస్తువుల వినియోగం ఉండేది. నిరాడంబరంగా జీవించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ఇంటి పరిసరాల్లోని అమ్మాయిల చదువుకు సాయం చేసేదాన్ని. పేదలకు అందని వైద్యం ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నా కూతురు తీవ్ర అనారోగ్యానికి గురైంది. నా కుమార్తెకు చికిత్స జరుగుతున్నప్పుడు వైద్యం ఎంత ఖరీదైనదో తెలుసుకున్నాను. అంతటి ఖర్చు మేం ఎలాగో భరించగలిగాం. కానీ, రెండు పూటలా తిండికే నోచుకోని వారి సంగతేంటి? వారికి చికిత్స అవసరమైతే ఏం చేస్తారు? ఈ విషయం పదే పదే ఆలోచించేదాన్ని. ఒంటరిగా చేయడంలో పెద్ద సాయాన్ని అందివ్వలేనని గ్రహించాను. దీంతో నా సహోద్యోగుల సాయం తీసుకోవాలనుకున్నాను. పది రూపాయలతో ప్రారంభం మా బ్యాంకు యూనియన్ లీడర్‌కు ఈ విషయాన్ని చెప్పిన. ‘మా అందరికీ మంచి జీతం ఉంది. పేద ప్రజల కోసం ఏదైనా సహాయం చేయాలి’ అని వివరించాను. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆలోచన ఇది. ప్రతి ఉద్యోగీ, తన జీతం నుంచి పది రూ΄ాయలను ‘సేవ’ కోసం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా నెలకు నాలుగు వేల రూ΄ాయలు జమ అయ్యేవి. ΄పాతిక వేలు జమ కాగానే మా యూనియన్ లీడర్ ‘ఏం చేయాలో చెప్పమ’ని అడిగారు. హఠాత్పరిణామాలు బ్యాంకు నిధులే కాకుండా విరాళం పేరుతో సాయం చేయడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. పదేళ్ల ΄ాటు ఈ విధమైన సేవాకార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నా భర్త హఠాత్తుగా చనిపోయాడు. దీంతో నేను చాలా రోజులు డిస్టర్బ్ అయ్యాను. ఆ రోజుల్లో మా సహోద్యోగులు కూడా మరింత సాయం అందించడానికి ముందుకు వచ్చారు. దీంతో రిలీఫ్ సొసైటీగా పేరు మార్చాం. ఎందుకంటే ఇందులో బయటి వ్యక్తులు చేరడం మొదలుపెట్టారు. రూ΄ాయ నుంచి లక్షల రూ΄ాయల విలువైన మందులు వస్తున్నాయి. పేదలకోసం ΄పాఠశాల జబ్బులు వచ్చి, చికిత్సలో ఉన్న రోగులకు మందులు ఇవ్వడం ద్వారా సాయం చేస్తున్నాం. కానీ, జబ్బులు రాకుండా అవగాహన కల్పించాలంటే చదువు ఉండాలనుకున్నాం. సరైన చదువు ఉంటే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోగలరు. ఈ ఆలోచనతో సైన్యంలో వైద్య సేవలు అందించే మా స్నేహితురాలు డాక్టర్ అనురాధతో కలిసి గిరిజన పిల్లలకు చదువులు చెప్పడం ప్రారంభించడం. ఇండోర్‌కు మూడు గంటల ప్రయాణం దూరంలో ఉన్న ఖర్గోన్లో సంస్థకు ధర్మకర్తగా ఉంటూ అనురాధతో ΄పాటు కలిసి కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. అక్కడే 12 ఎకరాల్లో ΄పాఠశాల , హాస్టల్ కూడా నిర్మించాం. నా స్నేహితురాలి హఠాన్మరణంతో నేను బ్యాంకు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొని స్కూల్ బాధ్యతలు చూసుకోవడానికి వచ్చేశాను. మొదట ఎనిమిది, పది మంది పిల్లలతో పారంభించిన స్కూల్లో ఇప్పుడు 200 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో 35 మంది వికలాంగులు. ఇప్పటికీ గ్రామంలో బాల్య వివాహాలు చేస్తుంటారు. దీంతో వారు చదువులు మానేసి వ్యవసాయం చేస్తుంటారు. పెద్దలకు అవగాహన కల్పించి, పిల్లలను స్కూల్‌కు తీసుకురావడం పెద్ద యుద్ధమే అవుతుంటుంది’ అంటూ తాము చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు ద్వివేదిని. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఇది భారతీయ మహిళల గురించి...
ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. ఈ భయంకరమైన కేసు గురించి తనకు (వీడియో బయటికి రాకముందు) తెలియదని మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అంటున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి! ‘‘ఆ వీడియోలో ఉన్న స్త్రీలకు జరిగింది అనుభవించడం కంటే నేను మరణాన్ని ఎంచు కుంటాను,’’ అని మణిపుర్ కుకీ సమాజానికి చెందిన హక్కుల కార్యకర్త గ్లాడీ హుంజన్ నాతో అన్నారు. కన్నీళ్లు ధారాపాతంగా కారు తున్నందున ఆమె పదాలను కూడా కూడగట్టుకోలేక పోయారు. నిరాశ, నిస్సహాయత, కోపం, వేదనతో ఆమె ఏడ్చినప్పుడు, నేను కూడా ఏడ్చాను. ఒక రిపోర్టర్‌గా, నేను దశాబ్దాలుగా లెక్కలేనన్ని భయంకర ఘటనలను చూశాను. కానీ ఆ వీడియోలో ఉన్నది వేరే – ఇద్దరు మహిళల దుస్తుల్ని విప్పి, నగ్నంగా ఊరేగించారు. ఒక మూక వాళ్లను తోసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చింది. వారిలో ఒకరిని తర్వాత క్రూరంగా సామూహిక అత్యాచారం చేశారు. ఇది చూసిన ప్రతి భారతీయ మహిళ హృదయం బద్దలైపోయింది. గుమికూడినవాళ్లు చూస్తుండగానే మూక ద్వారా లైంగిక వేధింపు లకు గురైన 21 ఏళ్ల మహిళ గురించీ, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినందుకు అక్కడికక్కడే మూక చంపేసిన ఆమె సోదరుడి గురించీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అతడి వయస్సు కేవలం 19 సంవ త్సరాలు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మందలింపులు రెండు నెల లుగా జడత్వంలో ఉండిపోయిన ఒక ముఖ్యమంత్రిని నిద్ర లేపాయి. అకస్మాత్తుగా, కొన్ని గంటల వ్యవధిలో, ప్రధాన నింది తుడిని అరెస్టు చేశారు. కాబట్టి, ఇన్ని రోజులు ఎన్. బీరేన్ సింగ్ ఈ ఘటనపై ఉద్దేశ పూర్వకంగా వేరే దృష్టితో చూస్తున్నారా లేక ఏం జరిగిందో ఆయనకు నిజంగానే తెలియదా? ఎలా భావించినా ఆయన (ఇప్పటికే తగ్గి పోయిన) విశ్వసనీయత గురించి సానుకూల మాట రాదు. నన్ను వివరించనివ్వండి ఈ సామూహిక అత్యాచారం, హత్యా ఘటన మే 4న జరిగినట్లు మనకు తెలుసు. జీరో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (జీరో–ఎఫ్ఐఆర్)గా పిలిచే మొదటి పోలీసు ఫిర్యాదును మే 18న దాఖలు చేశారు. 2012లో జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత, జస్టిస్ జేఎస్ వర్మ ప్యానెల్ ప్రవేశపెట్టిన విధానం ఇది. లైంగిక వేధింపుల బాధితురాలు భారత దేశంలో ఎక్కడైనా, అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసు కేసును దాఖలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు. ఈ కేసులో జూన్ 21న సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ను పంపారు. 60 రోజులకు పైగా, అత్యాచారం–హత్య ఘటనపై ఎఫ్ఐఆర్ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ వీడియో బయటపడి, దేశం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉండకపోతే, రేపిస్టులు, హంతకులు ఇంకా బయటే ఉండేవారు. కాబట్టి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ భయంకరమైన కేసు గురించి తనకు తెలియదని సింగ్ అంగీకరి స్తున్నారా? లేక తనకు తెలిసిందనీ, కానీ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాననీ ఒప్పుకుంటున్నారా? ఎలాగైనా సరే, ఇది ఆయన అసమర్థతను లేదా నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తుంది. బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి లేదా ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ ఒక్క అతి భయానక సంఘటన వల్ల మాత్రమే కాదు, గత రెండు నెలలుగా ఆయన దారుణ వైఫల్యాల కారణంగా ఆయన్ని తొలగించాలి. ఇంకా జాతీయ పతాక శీర్షికలకు ఎక్కని ఇతర అత్యాచారాలు, హత్యా ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అవును, వాస్తవానికి, జాతి విభజనకు సంబంధించి రెండు వైపులా బాధితులు, నేరస్థులు ఉన్నారు. నిజమేమిటంటే, బీరేన్ సింగ్ ఆఖరికి తన సొంత శాసన సభ్యులను కూడా రక్షించడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు వుంగ్జగిన్ వాల్తే గురించి ఆలోచించండి. ఆయన సింగ్ సహచరుడు, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారు. ఆయనపై దాడి జరిగింది. ఆయన మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఢిల్లీలోని ఆసుపత్రి బెడ్లో కట్లతో పడి ఉన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ మణిçపుర్‌కు తిరిగి వెళ్లదని ఆయన భార్య అన్నారు. నిజమేమిటంటే, స్థానిక పరిపాలనలోని అన్ని విభాగాలు జాతుల పరంగా చీలిపోయినప్పటికీ, ఇప్పటికీ విశ్వసనీయతను కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ సైన్యం మాత్రమే. మైతేయిలు, కుకీల మధ్య బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది సైన్యమే; ఇరువైపులా కమ్యూనిటీ నాయకులతో చర్చలను ప్రారంభించిందీ సైన్యమే. పైగా ఇటీవలి ఒక వీడియోలో చెప్పినట్లుగా, ‘మానవీయంగా ఉండటం బలహీనతకు సంకేతం కాదు’ అని సైన్యం భారతీయులకు గుర్తు చేస్తోంది. ఇంకా గుర్తుంచుకోండి, మణిపుర్‌లోని అనేక ప్రాంతాలలో సైన్యం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి చెందిన చట్టపరమైన రక్షణ లేకుండా పనిచేస్తోంది. ఆ వీడియో కీలకమైన సాక్ష్యాలను అందించిందనీ, వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు సహాయపడిందనీ బీరేన్ సింగ్ పేర్కొ న్నారు. అలా అయినప్పుడు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లోని కొందరు అధికారులు మణిపుర్‌పై నివేదికలను, ప్రదర్శనలను (వీటిలో నావి కూడా ఉన్నాయి) ఆపమని కోరడం విడ్డూరం కాదా? ఆ మహిళలను గుర్తించేలా ఉన్నవీ, లేదా దాడికి సంబంధించిన క్రూర త్వాన్ని తెలిపేవీ చూపడానికి ఏ మీడియా హౌస్‌ను కూడా అనుమతించకూడదు. అలాంటి వీడియోలను బ్లాక్ చేయాలి. అయితే, నిర్దిష్టమైన సంపాదకీయ రక్షణతో ఆ వీడియోను ప్రస్తావిస్తున్నప్పుడు కూడా దాని చుట్టూ ఉన్న మీడియా కవరేజీని తొలగించడం అంటే, మణిపుర్ భయానక స్థితిని వివరంగా చెప్పడాన్ని తీవ్రంగా అడ్డుకోవడమే అవుతుంది. ‘‘ఇది కుకీలు లేదా మెయితీల గురించి కాదు... ఇది భారతీయ మహిళల గురించి. మొత్తం భారతీయ మహిళల గురించి’’ అని గ్లాడీ హుంజన్ చిన్నపిల్లలా ఏడుస్తూ నాతో చెప్పారు. ఈ వీడియో చూసి భారతీయ మహిళలమైన మనం వణికిపోయిన సమయంలోనే,లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పార్లమెంటేరియన్ కు ఢిల్లీ పోలీసుల నుంచి అనూహ్యంగా బెయిల్ వచ్చింది. పైగా అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ వచ్చింది. మణిపుర్ గురించి, ఆ వైరల్ వీడియో గురించి మనందరం పట్టించుకోవాలి. మణిపుర్ ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించ డానికి రాష్ట్ర పతి పాలన విధించడమే ప్రారంభ చర్య అవుతుంది. బర్ఖా దత్ వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయురాలు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తెలంగాణ అమ్మాయికి ఛాన్స్
దక్షిణాఫ్రికా వేదికగా జరగున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ నాయకత్వం వహించనుంది. కాగా షఫాలీ వర్మ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటకీ.. ఇంకా 19 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అండర్-19 జట్టుకు ఎంపికైంది. అదే విధంగా భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఈ జట్టులో భాగమైంది. ఇక షాఫాలీ డిప్యూటీగా శ్వేతా షెరావత్ వ్యవహరించనుంది. శ్వేతా షెరావత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్‌గా షెరావత్ నిలిచింది. అదే విధంగా ప్రపంచకప్ జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీప్), జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు , ఫలక్ నాజ్, షబ్నమ్ చదవండి: IND vs BAN: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం.. -
ఆర్ధిక అవసరాలు,ఇతరులపై ఆధారపడుతున్న భారతీయ మహిళలు
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి ఇలాంటివి మాటల్ని తరచూ వింటుండేవాళ్లం. కానీ ఇప్పుడు..ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పటికీ ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడిపోతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్నీ రంగాలకు చెందిన సంస్థల్ని ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారే ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వెనకబడిపోతున్నారు. ఇటీవల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎమాంగ్ విమెన్ పేరుతో దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 22 నుంచి 55 ఏళ్ల వయసున్న 1000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. అధ్యయనంలో భారతీయ మహిళల్లో అత్యధిక శాతం మంది ఇప్పటికీ భర్తలపై ఆధారపడుతున్నట్టు పేర్కొంది. అయితే, తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44 శాతం మంది తమ అధ్యయనంలో చెప్పినట్టు హైలెట్ చేసింది. -
డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై మూడేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో ఇదివరకే తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా డబ్ల్యూఏకి చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల నిషేధం విధించాల్సి ఉండగా, నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో ఏడాది మినహాయించారు. మార్చిలో ఏఐయూ కమల్‌ప్రీత్ రక్తమూత్ర నమూనాలు సేకరించి పరీక్షించగా ‘పాజిటివ్’ అని తేలడంతో అదే నెల 29న సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె భారత ప్రభుత్వ పురస్కారాలు, ప్రోత్సాహకాలకు దూరం కానుంది. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
రాణిగారి ఆస్థానం.. స్కాట్లాండ్ ఎంపీగా తొలి భారత మహిళ
ఇటీవలే మే 6 న స్కాట్లాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. బ్రిటన్‌లో భాగమైన స్వతంత్ర దేశం స్కాట్లాండ్. ప్రధాని ఉంటారు. పైన క్వీన్ ఎలిజబెత్ ఉంటారు. దేశంలో మూడు పార్టీలు ఉన్నాయి. స్కాటిష్ నేషనల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ లీడర్ నికోలా స్టర్జన్. ఆమే ఇప్పుడు ప్రధాని. అయితే ఆమె గురించి కాదు మన స్టోరీ. ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ నుంచి పామ్ గోసల్ (49) అనే అభ్యర్థి విజయం సాధించారు. రాణిగారి ఆస్థానంలో చోటు సంపాదించారు. గోసల్ భారత సంతతి మహిళ. అంతేకాదు, స్కాట్లాండ్ పార్లమెంటులోకి అడుగుపెట్టిన తొలి భారతీయురాలు! పామ్ గోసల్ ఈ నెల 13న స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఆ దేశంలో వచ్చిన కొత్త చట్టంతో 1999 నుంచి ఐదేళ్లకోసారి పార్లమెంటు ఎన్నికలు జరగడం మొదలయ్యాక ఒక భారత సంతతి మహిళ స్కాట్లాండ్ ఎంపీ కావడం ఇదే ప్రథమం. మొన్న జరిగినవి ఆరో పార్లమెంటు ఎన్నికలు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి పామ్ గోసల్ గెలుపొందారు. ఆ ముందు నుంచే ఆమె స్కాట్లాండ్ ‘కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్’ (సి.డబ్లు్య.ఓ) కు డిప్యూటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. సి.డబ్లు్య.ఓ. అన్నది నూట రెండేళ్లుగా ఉన్న సంస్థ. ఇంగ్లండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్‌లలోని కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మహిళలంతా ఇందులో సభ్యులుగా ఉంటారు. స్కాట్లాండ్ కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్.. సి.డబ్లు్య.ఓ.కు అనుబంధంగా ఉంటుంది. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో గోసల్ సభ్యురాలు అవడంతో.. పార్లమెంటు సభ్యురాలిగా ఆమె విజయానికి సహజంగానే ప్రాధాన్యం లభించింది. ఇక భారత సంతతి మహిళగా ఆమె విజయం మన దేశానికి కూడా గర్వకారణమే. స్కాట్లాండ్ పార్లమెంటు భవనం ముందు పామ్ గోసల్ పామ్ గోసల్ పూర్వికులది పంజాబ్‌లోని భటిండా. సిక్కుల కుటుంబం. స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్ నగరంలో ఆమె జన్మించారు. డిగ్రీ చదివారు. కన్జూమర్ ‘లా’ లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం పిహెచ్.డి చేస్తున్నారు. స్లాట్లాండ్ కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న భారతీయ సభ్యులతో ఆమెకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. స్కాట్లాండ్లోని కన్జర్వేటివ్ పార్టీకి, బ్రిటన్ సంతతి భారతీయులకు మధ్య ఆమె ఒక వారధి అయ్యారు. వాళ్లంతా ఎంపీగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతిచ్చి, ఆమె విజయానికి సహకరించారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందువరకు కూడా గోసల్ తన కుటుంబ వ్యాపారం లో తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నారు. ‘‘భారతీయ నేపథ్యంతో స్కాట్లాండ్ తొలి పార్లమెంటు మహిళా సభ్యురాలిగా ఎన్నికవడం నాకు లభించిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలతో కలిసి పని చేసేందుకు త్వరపడుతున్నాను’’ అని గోసల్ ట్వీట్ చేశారు. ఆమె తన ప్రమాణ స్వీకారాన్ని ఇంగ్లిష్లోను, పంజాబీలోనూ చేశారు. ప్రమాణ స్వీకారం పార్లమెంటు సంప్రదాయం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ పేరిట మొదలై, భారతీయ సంస్కృతి ని ప్రతిబింబించేలా సిక్కు మతస్థుల పవిత్ర గ్రంథంలోని పంక్తులతో పూర్తయింది. -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీ: భారత మహిళల బృందం ఔట్!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత మహిళల 4x400 మీటర్ల బృందం వైదొలిగింది. పోలాండ్‌లో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన రిలే జట్లకు టోక్యో ఒలింపిక్స్‌కు, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించే అవకాశముంది. ‘వరల్డ్ రిలే టోర్నీకి సిద్ధమవుతున్న భారత మహిళల 4x400 రిలే బృందానికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. ఈ నెలారంభంలో పూవమ్మ, సుభా, కిరణ్, అం జలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూలను రిలే జట్టులో ఎంపిక చేశాం. ఈ బృందం లోని నలుగురిలో ముగ్గురు అన్‌ఫిట్‌గా ఉన్నా రు. సబ్‌స్టిట్యూట్ కూడా లేకపోవడంతో భారత బృందం వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వివరించింది. అయితే పురుషుల 4x400 మీటర్ల రిలే, మహిళల 4x400 మీటర్ల రిలే రేసుల్లో భారత్ బరిలోకి దిగుతుందని ఏఎఫ్ఐ తెలిపింది. జూన్‌లో క్వాలి ఫయింగ్ గడువు ముగిశాక టాప్–16లో ఉన్న రిలే జట్లు ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కించుకుంటాయి. -
వర్క్ ఫ్రం హోమే బెటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటి నుంచే కార్యాలయ పని చక్కపెట్టేస్తాం అంటున్నారు భారతీయ మహిళలు. ఐటీ రంగానికి చెందిన మహిళల్లో 38 శాతం మంది ఇంటినుంచి పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. గత ఏడాది నవంబర్– డిసెంబర్ కాలంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పనిచేసే పురుషులు, మహిళల అభిప్రాయాలు సేకరించి సర్వే చేసింది. ఆఫీస్ కంటే ఇంటి నుంచి పనిచేయడం వల్లే ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉన్నట్లు భావిస్తామని 36 శాతం మహిళలు తెలిపారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల రోజువారీ ఇంటి పని విషయాలు వారు పేర్కొన్నారు. ఆఫీస్ పనిచేస్తూనే ఇంటి పనీ పూర్తి చేసుకుంటు న్నామని 33 శాతం పురుషులు, 54 శాతం మహిళలు తెలిపారు. 40 శాతం మంది పురుషులతో పోలిస్తే 54 శాతం మంది మహిళలకు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుటుంబాన్ని చూసుకోవాల్సి రావడంతో మహిళలు పని వేళలు మార్చుకుంటున్నారు. కరోనా ప్రభావంతో వృత్తిజీవితంలో పురోగతి తగ్గిందని 76 శాతం భారతీయ మహిళలు భావిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 19 దేశాలకు చెందిన 13 వేల మంది పాల్గొనగా 500 మంది భారతీయులు ఉన్నారు. చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్ -
‘భారతీయ మహిళలు అందవిహీనులు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్‌హౌస్ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని ఆడియో క్లిప్స్ దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఈ టేప్స్ వివరిస్తున్నాయి. ‘భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. (చదవండి: ట్రంప్‌ను పొగడుదామని తప్పులో కాలేసింది) భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ‘నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు’ అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.(చదవండి: వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!) అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. -
ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్ వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది. మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్‌కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్‌లోని సీరమ్‌పూర్ బదిలీ అయింది. పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్‌పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది. అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్ఎల్డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు. సైన్స్‌లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. రామన్పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్‌లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్‌లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది. మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్‌లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్‌లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్‌లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్‌లోని జాన్స్హాప్కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్‌లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు. తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్బర్గ్లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు. -
నందిని ‘పసిడి జంప్’
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్ అండర్–17 బాలికల లాంగ్‌జంప్ విభాగంలో తెలంగాణ అమ్మాయి అగసార నందిని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నందిని 5.65 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించు కుంది. నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థిని. నిర్మా అసారి (గుజరాత్–5.62 మీటర్లు) రజతం... అభిరామి (కేరళ–5.47 మీటర్లు) కాంస్యం సాధించారు. అండర్–17 బాలికల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత రజత పతకం సాధించింది. రజిత 57.61 సెకన్లలో గమ్యానికి చేరింది. -
అలసి విశ్రమించిన అలలు
చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది. కృష్ణాసోబ్తీ, రచయిత్రి ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు. వింజమూరి అనసూయాదేవి, గాయని ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే. విజయనిర్మల, సినీ నటి ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు. షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు. ఛాయాదేవి, సాహితీవేత్త ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు. సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. గీతాంజలి, నటి ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి. నానమ్మాళ్, యోగా శిక్షకురాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను
దోహ: భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఖతర్ ఇంటర్నేషనల్ కప్‌లో సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. మొదట స్నాచ్‌లో 83 కేజీలు ఎత్తిన మీరా... క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలను ఎత్తింది. అనైస్ మిచెల్ (ఫ్రాన్స్–172 కేజీలు), మనోన్ లోరెంజ్ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్లో మీరాబాయి ఎత్తిన 201 కేజీల ప్రదర్శన అత్యుత్తమం కాగా... ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వర్ లెవల్ ఈవెంట్ అయిన ఈ టోరీ్నలో గెలుపుతో సాధించిన పాయింట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో మీరాబాయికి కీలకం కానున్నాయి. -
100 మీ.లో ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: భారత మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో ఈ ఒడిశా అథ్లెట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ ఫైనల్ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ రేసులో ద్యుతీ చంద్ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. -
అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: భారత వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపుకెక్కిన ద్యుతీ చంద్ తన స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా చెప్పింది. ఇటీవల కాలంలో కొందరు క్రీడాకారిణులు ఇలా బయటపడిన సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్ ద్యుతీనే కావడం గమనార్హం! ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆమె తన సోదరుడి భార్య నచ్చకపోతే ఇంటిలో నుంచి గెంటేసిందని చెప్పింది. తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్ అయిన తను స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయించుకున్నానని... అందుకే బహిరంగంగా తన సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతీ చెప్పుకొచ్చింది. ‘ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్‌ను కొనసాగిస్తాను. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొంటాను. ప్రపంచ చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భాగస్వామి అనుమతితోనే సహజీవనాన్ని బహిర్గతం చేశాను. ఇలా బయట పడటానికి మరో కారణం కూడా ఉంది. గతంలో పింకీ ప్రమాణిక్ అనే మహిళా అథ్లెట్ తన సహచర అథ్లెట్‌ను బలాత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే మా బంధాన్ని బయటపెట్టాను. పైగా సుప్రీం కోర్టు తీర్పుకూడా మేం బయటపడేందుకు ధైర్యాన్నిచ్చింది’ అని ద్యుతీచంద్ వివరించింది. గతంలో ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొంది. పురుష హార్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించింది. దీన్ని ఆమె ఆర్బిట్రేషన్ కోర్టులో సవాలు చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లో అడుగుపెట్టింది. గతేడాది సుప్రీం కోర్టు మేజర్లయిన వారిమధ్య స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. అయితే ఒకే లింగానికి చెందిన ఇరువురి మధ్య పెళ్లికి మాత్రం భారత్‌లో చట్టబద్ధత లేదు. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ మార్గదర్శనంలో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ద్యుతీ చంద్ గత ఏడాది జకార్తా ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది. -
నిజంగా సరస్వతీ పుత్రికే!
దుబాయ్: సాధారణంగా అమెరికాలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించుకోవడానికి సగటు భారతీయ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ దుబాయ్‌లో ఉండే భారతీయ యువతి సిమోనే నూరాలీ(17) మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే తమ విద్యాసంస్థలో చేరాలని అమెరికాలోని 7 ప్రఖ్యాత వర్సిటీలు ఆహ్వానించాయి. అవి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డార్ట్మౌత్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్ వర్సిటీ, జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ. అమెరికా వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది. భారత్‌లో మహిళల అక్రమ రవాణాపై సిమోనే రాసిన ‘ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్’ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు.