గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ లు సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పారు. వన్డే క్రికెట్ లో తొలి వికెట్ కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ జోడి.