Deepti Sharma
-
దీప్తి సిక్సర్... లండన్ విన్నర్
లండన్: ‘హండ్రెడ్’ మహిళల క్రికెట్ టోర్నీకి అద్భుత ముగింపు లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో 2021లో హండ్రెడ్ టోర్నీ (ఇన్నింగ్స్‌కు 100 బంతులు) మొదలైంది. విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హీతెర్ నైట్ సారథ్యంలోని లండన్ స్పిరిట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో టామీ బీమోంట్ నాయకత్వంలోని వెల్ష్ ఫైర్ జట్టును ఓడించింది. లండన్ స్పిరిట్ జట్టుకు టైటిల్ దక్కడంలో భారత క్రికెటర్ దీప్తి శర్మ (16 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) కీలకపాత్ర పోషించింది. లండన్ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్, విండీస్ ఆల్‌రౌండర్ హీలీ మాథ్యూస్ చివరి ఐదు బంతులు వేయడానికి వచ్చింది. తొలి బంతికి దీప్తి... రెండో బంతికి చార్లీ డీన్ చెరో సింగిల్ తీశారు. దాంతో లండన్ విజయ సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులుగా మారింది. ఈ దశలో హీలీ వేసిన మూడో బంతిని దీప్తి శర్మ సిక్సర్‌గా మలిచి లండన్ విజయాన్ని ఖరారు చేసింది. రెండు బంతులు మిగిలి ఉండగా లండన్ స్పిరిట్ చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్లకు 115 పరుగులు సాధించింది. జెస్ జొనాసెన్ (41 బంతుల్లో 54; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... టామీ బీమోంట్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు), హీలీ మాథ్యూస్ (26 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో ఇవా గ్రే, సారా గ్లెన్ రెండు వికెట్ల చొప్పున తీయగా... దీప్తి శర్మ, తారా నోరిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లండన్ స్పిరిట్ జట్టు 98 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. జార్జియా రెడ్మెన్ (32 బంతుల్లో 34; 3 ఫోర్లు), హీతెర్ నైట్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు), డానియెలా గిబ్సన్ (9 బంతుల్లో 22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడారు. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్లలో షబ్నిమ్ మూడు వికెట్లు పడగొట్టింది. గత ఏడాది విజేతగా నిలిచిన సదరన్ బ్రేవ్జట్టులో భారత జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన సభ్యురాలిగా ఉండటం విశేషం. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
ఆసీస్‌తో రెండో టీ20.. టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్‌కు చెందిన నిదా దార్ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్‌ను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తితో పాటు రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్ మూనీ 20, తహిల మెక్‌గ్రాత్ 19, ఎల్లిస్ పెర్రీ 34 నాటౌట్, ఆష్లే గార్డ్నర్ 7, లిచ్‌ఫీల్డ్ 18 నాటౌట్ తలో చేయి వేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్‌తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ నెగ్గగా.. ఆసీస్ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జనవరి 9న జరుగనుంది. -
రిచా ఘోష్ వీరోచిత పోరాటం వృధా.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోయింది. రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్‌ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు. అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
INDW VS AUSW 2nd ODI: ఆసీస్ వెన్ను విరిచిన దీప్తి శర్మ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ వెన్ను విరిచింది. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో వస్త్రాకర్ 18 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
దీప్తి ధమాకా
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయంపై కన్నేసింది. భారత బౌలర్ల జోరుతో రెండో రోజే మ్యాచ్‌పై జట్టు పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల హవా సాగిన శుక్రవారం రెండు జట్లలో కలిపి 19 వికెట్లు నేలకూలగా... అందులో 15 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. భారత ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీప్తి ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సివర్ బ్రంట్ (70 బంతుల్లో 59; 10 ఫోర్లు) మాత్రమే పోరాడి అర్ధ సెంచరీ సాధించగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచే బ్యాటర్లంతా దూకుడుగా ఆడటంతో జట్టు ఆధిక్యం మరింత పెరిగింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (67 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా... షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధాన (26) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు చార్లీ డీన్ 4, ఎకెల్‌స్టోన్ 2 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ సతీశ్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 410/7తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఏకంగా 478 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో భారత్ ఇప్పటికే అసాధ్యమైన లక్ష్యం విధించే దిశగా సాగుతోంది. మ్యాచ్‌లో మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. -
యూపీ వారియర్స్ వైస్ కెప్టెన్ గా దీప్తి శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే యూపీ వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను నియమించారు. ఆ్రస్టేలియా స్టార్ ప్లేయర్ అలీసా హీలీని ఇప్పటికే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కే చెందిన దీప్తి శర్మ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 92 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 941 పరుగులు చేయడంతోపాటు 102 వికెట్లు పడగొట్టింది. 25 ఏళ్ల దీప్తి ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో నాలుగో స్థానంలో ఉంది. -
ధోని, కోహ్లి వల్ల కూడా కాలేదు.. అరుదైన రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్
Deepti Sharma: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా ఈ టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంతకు ఏంటా రికార్డు అంటే..? రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాటర్ అయిన దీప్తి శర్మ.. వరుసగా 50కి పైగా (2016-21 మధ్యలో 54) వన్డేలు, 50 టీ20లు (2020-23) ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. భారత పురుష క్రికెటర్లు, అత్యంత ఫిట్‌గా ఉండే విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనికి సైతం సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. భారత్ తరఫున ఏ పురుష క్రికెటర్‌కు కాని మహిళా క్రికెటర్‌కు కాని సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన పేరిట లిఖించుకుని శభాష్ అనిపించుకుంది. 25 ఏళ్ల దీప్తి ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 2 టెస్ట్‌లు, 80 వన్డేలు, 87 టీ20లు ఆడింది. ఇందులో 152 టెస్ట్ పరుగులు, 1891 వన్డే పరుగులు, 914 టీ20 పరుగులు సాధించింది. బౌలింగ్‌లో 5 టెస్ట్ వికెట్లు, 91 వన్డే వికెట్లు, 96 టీ20 వికెట్లు దీప్తి ఖాతాలో ఉన్నాయి. దీప్తి ఇప్పటివరకు వన్డేల్లో ఓ సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు, టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేసింది. వన్డేల్లో ఓసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు, టీ20ల్లో ఓ సారి 4 వికెట్ల ఘనత దీప్తి ఖాతాలో ఉన్నాయి. కాగా, నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మహిళల తొట్టతొలి ఐపీఎల్ మెగా వేలంలో దీప్తి రికార్డు ధరను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూపీ వారియర్జ్ దీప్తిని 2.6 కోట్టు వెచ్చించి సొంతం చేసుకుంది. యూపీ వారియర్జ్ తరఫున దీప్తినే అత్యధిక ధర పలికిన ప్లేయర్ కావడం విశేషం. ఓవరాల్‌గా చూస్తే వేలంలో అత్యధిక ధర రికార్డును టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన సొంతం చేసుకుంది. మంధనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. మంధనను దక్కిన మొత్తం పాకిస్తాన్లో జరిగే పీఎస్ఎల్లో స్టార్ ఆటగాళ్లకు లభించే మొత్తంతో పోలిస్తే రెండింతలకు ఎక్కువ. పీఎస్ఎల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు లభించే 1.2 కోట్లే అత్యధికం. -
WPL 2023: యూపీ వారియర్జ్ జట్టు ఇదే.. అత్యధిక ధర ఎవరికంటే?
భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ.. మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు తొలి అడుగుగా ముంబై వేదికగా వేలం నిర్వహించింది. ఇందులో భాగంగా యూపీ వారియర్జ్ భారత క్రికెటర్ దీప్తి శర్మకు అత్యధికంగా రూ. 2.60 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ జట్టులోని ప్లేయర్ల జాబితా.. యూపీ వారియర్జ్ ►దీప్తి శర్మ- రూ.2.60 కోట్లు ►సోఫీ ఎకిల్‌స్టోన్- రూ.1.80 కోట్లు ►దేవిక వైద్య- రూ.1.40 కోట్లు ►తాహ్లియా మెక్‌గ్రాత్- రూ.1.40 కోట్లు ►షబ్నిమ్ ఇస్మాయిల్- రూ.1 కోటి ►గ్రేస్ హరిస్- రూ.75 లక్షలు ►అలీసా హీలీ - రూ.70 లక్షలు ►అంజలీ శర్వాణి- రూ.55 లక్షలు ►రాజేశ్వరి గైక్వాడ్ - రూ.40 లక్షలు ►శ్వేత సెహ్రావత్ - రూ.40 లక్షలు ►కిరణ్ నవ్‌గిరే- రూ.30 లక్షలు ►లారెన్ బెల్- రూ.30 లక్షలు ►లక్ష్మీ యాదవ్- రూ.10 లక్షలు ►పార్శవి చోప్రా- రూ.10 లక్షలు ►సొప్పదండి యషశ్రీ- రూ.10 లక్షలు ►సిమ్రాన్ షేక్- రూ.10 లక్షలు ►మొత్తం ప్లేయర్లు: 16 ►విదేశీ ప్లేయర్లు: 6 యజమాని ఎవరంటే? కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్జ్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. జట్ల వేలంలో భాగంగా 757 కోట్ల రూపాయలకు టీమ్‌ను దక్కించుకుంది. కాగా కాప్రీ గ్లోబల్‌కు ఐఎల్టీ20లో షార్జా వారియర్స్ పేరిట జట్టు ఉంది. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. Eoin Morgan: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ -
నెంబర్‌వన్‌కు అడుగుదూరంలో భారత క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో దీప్తి 9 వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్)కు దీప్తికి కేవలం 26 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉంది. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో భారత స్పిన్నర్ తన జోరు కొనసాగిస్తే టాప్ ర్యాంక్ సాకారమయ్యే చాన్స్ ఉంది. టాప్–10లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక (7వ), స్నేహ్ రాణా (10వ) ఉన్నారు. చదవండి: భారత పర్యటనలో ‘వార్మప్’ ఆడకపోవడం సరైందే: స్మిత్ Virat Kohli: మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి -
Ind Vs Pak: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!
Womens Asia Cup T20 2022- India Vs Pakistan: మహిళల ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రీతిలో సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేనకు భంగపాటు తప్పలేదు. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. ఆదుకున్న నిదా బంగ్లాదేశ్‌లోని సెల్హెట్ వేదికగా శుక్రవారం భారత్- పాకిస్తాన్ మహిళా జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 32 పరుగులతో రాణించగా.. ఆల్‌రౌండర్ నిదా దర్ 56 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో దీప్తికి మూడు, పూజాకు రెండు, రేణుకకు ఒక వికెట్ దక్కాయి. ఒకరిద్దరు మినహా భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా(2) పూర్తిగా నిరాశపరచగా.. హేమలత 20 పరుగులతో రాణించింది. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 12, రిచా ఘోష్ 26 పరుగులు(13 బంతుల్లో) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. దీంతో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. పాక్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించిన నిదా దర్(37 బంతుల్లో 56 పరుగులు, రెండు వికెట్లు)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా కాగా టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు 13 సార్లు తలపడగా భారత మహిళా జట్టుపై పాక్ టీమ్‌కు ఇది మూడో విజయం. 2016 తర్వాత ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్-2022 ఈవెంట్లో లీగ్ దశలో పాక్‌పై గెలుపొందిన రోహిత్ సేన.. కీలకమైన సూపర్-4 దశలో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్' -
రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ
-
Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’
కోల్‌కతా: మూడో వన్డేలో ఇంగ్లండ్ చివరి బ్యాటర్ చార్లీ డీన్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ రనౌట్ చేసిన తీరు వివాదంపై మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర చర్చ జరిగింది. దీప్తి బంతి వేయకముందే డీన్ క్రీజ్ దాటడంతో నిబంధనల ప్రకారం దీప్తి ఆమెను రనౌట్ చేసినా... మరోసారి క్రీడాస్ఫూర్తి అంశం ముందుకు వచ్చింది. దీనిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే వివరణ ఇచ్చినా దీప్తి శర్మ కూడా స్పందించింది. రిటైర్ అయిన పేసర్ జులన్ గోస్వామితో పాటు దీప్తికి స్వదేశం తిరిగొచ్చిన అనంతరం కోల్‌కతా విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది. ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని దీప్తి వివరణ ఇచ్చింది. దీప్తి వ్యాఖ్యలపై ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ మళ్లీ స్పందించింది. ‘మ్యాచ్ ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే చార్లీ అవుటైంది. మ్యాచ్‌తోపాటు సిరీస్ గెలిచేందుకు భారత్‌కు అన్ని విధాలా అర్హత ఉంది. అయితే రనౌట్ గురించి మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదు. నిజానికి వారు చేసింది తప్పు కాదు కాబట్టి హెచ్చరించాల్సిన అవసరం లేదు. కానీ తాము చేసిన దానిని సమర్థించుకోవాలని, అందుకు హెచ్చరిక అనే ఒక అబద్ధాన్ని వాడుకోవాలని కూడా భారత్ భావించరాదు’ అని నైట్ వ్యాఖ్యానించింది. తానియా గదిలో చోరీ... వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. -
Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక
పల్లెకెలె: శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. రేణుక సింగ్ (3/29) పదునైన బౌలింగ్... దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/25; 22 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 48.2 ఓవర్లలో171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి డిసిల్వా (43; 4 ఫోర్లు), హాసిని పెరీరా (37; 5 ఫోర్లు) రాణించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 38 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (35; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (44; 3 ఫోర్లు), హర్లీన్ (34; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. పూజా వస్త్రకర్ (21 నాటౌట్; 2 సిక్స్‌లు)తో కలిసి దీప్తి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర (4/39), ఒషాది రణసింఘే (2/34) టీమిండియాను ఇబ్బంది పెట్టినా ఇతర బౌలర్లు విఫలమయ్యారు. రెండో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది. -
టి20 చాలెంజ్: విజేత ‘సూపర్ నోవాస్’
పుణే: హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ‘సూపర్ నోవాస్’ జట్టు మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన టీమ్ మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సూపర్ నోవాస్ నాలుగు పరుగుల తేడాతో దీప్తి శర్మ నాయకత్వంలోని వెలాసిటీ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సూపర్ నోవాస్ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డియాండ్రా డాటిన్ (44 బంతుల్లో 62; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రియా పూనియా (29 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) రాణించారు. దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ బహదూర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేయగలిగింది. లారా వోల్వార్ట్ (40 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించడంలో విఫలమైంది. చివరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా... వోల్వార్ట్, సిమ్రన్ బహదూర్ (10 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 18వ ఓవర్లో 2 సిక్స్‌లతో 14 పరుగులు, 19వ ఓవర్లో 4 ఫోర్లతో 17 పరుగులు రాబట్టారు. దాంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం 17 పరుగులకు మారింది. ఎకెల్‌స్టోన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతినే వోల్వార్ట్ సిక్సర్‌గా మలచినా... తర్వాతి 5 బంతుల్లో 6 పరుగులే వచ్చాయి. అలానా కింగ్ 3 వికెట్లు పడగొట్టగా, ఎకెల్‌స్టోన్, పూజ చెరో 2 వికెట్లు తీశారు. గతంలో మూడు సార్లు మహిళల టి20 చాలెంజ్ టోర్నీ జరగ్గా... 2018, 2019లలో సూపర్ నోవాస్ విజేతగా నిలిచింది. 2020లో ట్రయల్ బ్లేజర్స్ టైటిల్ నెగ్గింది. కరోనా కారణంగా 2021లో ఈ టోర్నీని నిర్వహించలేదు. Winners Are Grinners! ☺️ ☺️@ImHarmanpreet, Captain of Supernovas, receives the #My11CircleWT20C Trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI & Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 🏆 #SNOvVEL pic.twitter.com/ujGbXX4GzB — IndianPremierLeague (@IPL) May 28, 2022 -
World Cup 2022: భారత్ కొంపముంచిన నోబాల్.. లక్కీగా వెస్టిండీస్ సెమీస్‌లోకి!
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్ ప్రయాణం ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గత వరల్డ్‌కప్ రన్నరప్ భారత మహిళా జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 274 పరుగుల భారీ స్కోరు చేసినా దురదృష్టం వెంటాడింది. ఇక ఆదిలో దక్షిణాఫ్రికా వికెట్ తీసిన ఆనందం అంతలోనే ఆవిరైపోగా.. 26వ ఓవర్ తర్వాత వికెట్లు పడటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా 48 పరుగులతో రాణించిన భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతితోనూ అద్భుతం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా 8 ఓవర్లు బౌలింగ్ వేసిన హర్మన్ 2 వికెట్లు కూల్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేగాక మూడు రనౌట్లలో భాగమైంది. ఆమె అద్భుత ప్రదర్శనతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, చివర్లో దీప్తి శర్మ నోబాల్ భారత్ కొంపముంచింది. ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నన్ డు ప్రీజ్ సింగిల్ తీసి మిథాలీ సేన సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి వెస్టిండీస్‌కు వరంగా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా అంతకు ముందు గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ గెలుపొంది సెమీస్ చేరింది. విండీస్‌ను వెనక్కినెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన కారణంగా టాప్-4లోకి చేరలేకపోయింది. దీంతో మిథాలీ సేన సెమీస్ నుంచి నిష్క్రమించగా.. విండీస్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టులో ఆనందాలు వెల్లివిరిశాయి. చదవండి: IPL 2022: శ్రేయస్ కెప్టెన్సీ భేష్.. అతడిని తుదిజట్టులోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత్ 377/8 డిక్లేర్డ్.. రాణించిన దీప్తి శర్మ
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 276/5తో శనివారం ఆటను కొనసాగించిన భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 145 ఓవర్లలో 8 వికెట్లకు 377 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కిదే అత్యధిక స్కోరు. ఆ్రస్టేలియా గడ్డపై విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఓవర్‌నైట్ బ్యాటర్ దీప్తి శర్మ (167 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను జులన్ గోస్వామి (2/27), పూజా వ్రస్తాకర్ (2/31) ఇబ్బంది పెట్టారు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (27 బ్యాటింగ్; 3 ఫోర్లు), గార్డ్నర్ (13 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ్రస్టేలియా మరో 85 పరుగులు చేయాల్సి ఉంది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్ గెలవాలంటే మాత్రం... ఆదివారం జరిగే మూడు సెషన్స్‌లోనూ బౌలర్లు అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్లో ఆస్ట్రేలియాను 228 పరుగులలోపు ఆలౌట్ చేయాలి. అప్పుడు ఆ జట్టు ఫాలోఆన్ ఆడే అవకాశం ఉంటుంది. చివరి రెండు సెషన్స్‌లో (దాదాపు 60 ఓవర్లలో) మరోసారి ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్ చేయగలిగితే భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకోగలదు. -
Deepti Sharma: దీప్తి గంట కొట్టింది
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభించే అదృష్టం మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు దక్కింది. లార్డ్స్‌లో జరిగే ప్రతి టెస్టు జరిగే రోజు ఆట ఆరంభానికి సూచికగా గంట మోగించడం ఆనవాయితీ. ఆదివారం భారత ఆల్‌రౌండర్ దీప్తి గంట కొట్టి నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. 23 ఏళ్ల దీప్తి అక్కడ ‘ది హండ్రెడ్’ టోర్నీ లో లార్డ్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న ‘లండన్ స్పిరిట్’ జట్టు తరఫున ఆడుతోంది. ‘క్రికెట్ మక్కా’లో గంట మోగించే గౌరవం లభించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. (చదవండి: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్?) -
కొత్త రికార్డు; 4 ఓవర్లు, 3 మెయిడిన్లు
సూరత్: భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ టి20ల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేసి రికార్డులకు ఎక్కింది. టి20ల్లో మూడు మూడు మెయిడిన్ ఓవర్లు వేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా ఖ్యాతి దక్కించుకుంది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. తాను వేసిన 19 బంతికి మొదటి పరుగు ఇచ్చిదంటే ఆమె బౌలింగ్ ఎంత పదునుగా ఉందో తెలుస్తోంది. ఈ ఆగ్రా అమ్మాయి రెండు మేడిన్ ఓవర్లలో రెండు వికెట్లు తీయడం విశేషం. దీప్తి అద్భుత ప్రదర్శనకు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన టి20 సిరీస్‌లో భారత మహిళల టీమ్ శుభారంభం చేసింది. తమ బౌలర్లు గొప్పగా రాణించడం వల్లే విజయం దక్కిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. తమ వ్యూహానికి తగినట్టుగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించారని ప్రశంసించింది. (చదవండి: దీప్తి సూపర్ బౌలింగ్) -
విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా
జైపూర్: ఐపీఎల్ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరల్లో ఆసక్తి చేసింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్ దీప్తి శర్మ చివరల్లో ముగ్గురిని క్లీన్‌బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అప్పటికే వెలాసిటీ టీమ్ విజయం ఖాయం అయిపోవడంతో దీప్తి ప్రదర్శన వృధా అయింది. వెలాసిటీ 18 బంతులకు 2 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి టపాటపా మూడు వికెట్లు పడగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన మిథాలీ సేన 16.5 ఓవర్లలో 111 పరుగులు చేసి మూడో వికెట్ నష్టపోయింది. ఇక్కడ నుంచి వరుసగా ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ స్కోరర్ డానియల్ వ్యాట్(46) మూడో వికెట్‌గా ఔటైంది. తర్వాత వేదాకృష్ణమూర్తి రనౌటయింది. ఇక్కడి నుంచి దీప్తి షో మొదలైంది. 17 ఓవర్ తొలి బంతికి మిథాలీ రాజ్‌ను బౌల్డ్ చేసింది. మూడో బంతికి శిఖా పాండే, ఐదో బంతికి అమిలా కెర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపింది. ఈరోజు మ్యాచ్‌లో దీప్తి పడొట్టిన నాలుగు వికెట్లు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. 4 ఓవర్ 5 బంతికి ఓపెనర్ హెలే మాథ్యూస్‌ను అవుట్ చేసిన దీప్తి చివర్లో మళ్లీ మాయాజాలం చేసింది. విజయానికి 2 పరుగులు చేయాల్సిన దశలో వెలాసిటీ టీమ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 8 వికెట్ల తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వెలాసిటీ టీమ్ చివరకు మూడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. (చదవండి: మంధానకు షాక్.. మిథాలీ సేనదే విజయం) -
320 పరుగులతో వరల్డ్ రికార్డు..
-
320 పరుగులతో వరల్డ్ రికార్డు..
పోచెస్ట్రూమ్: గతవారం భారత మహిళా ప్రధాన పేసర్ జులన్ గోస్వామి(181) వన్డేల్లో అత్యధిక వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ లు సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పారు. వన్డే క్రికెట్ లో తొలి వికెట్ కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు ఈ జోడి. క్వాడ్రాంగులర్ సిరీస్ లో భాగంగా సోమవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనింగ్ జోడి ఈ ఘనతను కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డును నెలకొల్సే క్రమంలో దీప్తి శర్మ(188;160బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్ రౌత్(109;116 బంతుల్లో 11 ఫోర్లు) లు విశేషంగా రాణించి దాదాపు 9 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 2008లో లార్డ్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జోడి ఎస్ జే టేలర్, సీఎంజీ అటికిన్స్లు 268 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని సాధించారు. మహిళల వన్డే క్రికెట్ లో ఇదే ఇప్పటివరకూ అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం. తాజాగా ఆ రికార్డును భారత జోడి అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో భారత మహిళలు 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 358 భారీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే 320 పరుగుల భాగస్వామ్యాన్ని భారత ఓపెనింగ్ జోడి సాధించింది. ఓవరాల్ గా చూస్తే వన్డే క్రికెట్ లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. పురుషుల క్రికెట్ లో అత్యధిక పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం 286 పరుగులు. 2006లో శ్రీలంక ఆటగాళ్లు ఉపుల్ తరంగా-జయసూర్యలు ఈ ఘనతను సాధించారు.