భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ.. మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు తొలి అడుగుగా ముంబై వేదికగా వేలం నిర్వహించింది. ఇందులో భాగంగా యూపీ వారియర్జ్ భారత క్రికెటర్ దీప్తి శర్మకు అత్యధికంగా రూ. 2.60 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ జట్టులోని ప్లేయర్ల జాబితా..
యూపీ వారియర్జ్
►దీప్తి శర్మ- రూ.2.60 కోట్లు
►సోఫీ ఎకిల్‌స్టోన్- రూ.1.80 కోట్లు
►దేవిక వైద్య- రూ.1.40 కోట్లు
►తాహ్లియా మెక్‌గ్రాత్- రూ.1.40 కోట్లు
►షబ్నిమ్ ఇస్మాయిల్- రూ.1 కోటి
►గ్రేస్ హరిస్- రూ.75 లక్షలు
►అలీసా హీలీ - రూ.70 లక్షలు
►అంజలీ శర్వాణి- రూ.55 లక్షలు
►రాజేశ్వరి గైక్వాడ్ - రూ.40 లక్షలు
►శ్వేత సెహ్రావత్ - రూ.40 లక్షలు
►కిరణ్ నవ్‌గిరే- రూ.30 లక్షలు
►లారెన్ బెల్- రూ.30 లక్షలు
►లక్ష్మీ యాదవ్- రూ.10 లక్షలు
►పార్శవి చోప్రా- రూ.10 లక్షలు
►సొప్పదండి యషశ్రీ- రూ.10 లక్షలు
►సిమ్రాన్ షేక్- రూ.10 లక్షలు
►మొత్తం ప్లేయర్లు: 16
►విదేశీ ప్లేయర్లు: 6
యజమాని ఎవరంటే?
కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ వారియర్జ్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. జట్ల వేలంలో భాగంగా 757 కోట్ల రూపాయలకు టీమ్‌ను దక్కించుకుంది. కాగా కాప్రీ గ్లోబల్‌కు ఐఎల్‌టీ20లో షార్జా వారియర్స్ పేరిట జట్టు ఉంది.
చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
Eoin Morgan: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment