
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే యూపీ వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను నియమించారు. ఆ్రస్టేలియా స్టార్ ప్లేయర్ అలీసా హీలీని ఇప్పటికే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కే చెందిన దీప్తి శర్మ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 92 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 941 పరుగులు చేయడంతోపాటు 102 వికెట్లు పడగొట్టింది. 25 ఏళ్ల దీప్తి ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment