
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో దీప్తి 9 వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్)కు దీప్తికి కేవలం 26 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉంది.
రేపు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో భారత స్పిన్నర్ తన జోరు కొనసాగిస్తే టాప్ ర్యాంక్ సాకారమయ్యే చాన్స్ ఉంది. టాప్–10లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక (7వ), స్నేహ్ రాణా (10వ) ఉన్నారు.