india women cricket
-
స్మృతి శతకం... సిరీస్ సొంతం
అహ్మదాబాద్: వారెవా... స్మృతి మంధాన ఇలా ఆడి ఎన్నాళ్లైంది. ఆఖరి వన్డే చూసినవారందరి నోటా వినిపించిన మాట ఇదే! కీలకమైన పోరులో ఆమె సాధించిన శతకంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను 2–1తో వశం చేసుకుంది. ఈ విజయంలో బౌలర్లు దీప్తిశర్మ, ప్రియా మిశ్రాలతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తోడయ్యారు. దీంతో మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్రూక్ హాలిడే (96 బంతుల్లో 86; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆదుకుంది. ఓపెనర్ జార్జియా ప్లిమెర్ (67 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3 వికెట్లు పడగొట్టగా, యువ లెగ్‌స్పిన్నర్ ప్రియా మిశ్రా (2/41) కీలకమైన వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 44.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి గెలిచింది. చాన్నాళ్ల తర్వాత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10 ఫోర్లు)బ్యాట్‌కు పనిచెప్పింది. హర్మన్‌ప్రీత్ (63 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) రాణించింది. హన్నా రోవ్ 2 వికెట్లు పడగొట్టింది. కివీస్, భారత్ తమ తుది జట్లలో ఒక్కోమార్పు చేశాయి. జెస్ కెర్ స్థానంలో హన్నా రోవ్ బరిలోకి దిగింది. భారత జట్టులో హైదరాబాద్ సీమర్ అరుంధతి రెడ్డి స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకున్నారు. హాలిడే ఒంటరి పోరాటం భారత బౌలర్లు, ఫీల్డర్లు కట్టుదిట్టం చేయడంతో కివీస్‌కు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. జెమీమా మెరుపు ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్ (4)తో పాటు మ్యాడీ గ్రీన్ (15)ను రనౌట్ చేసింది. సైమా, ప్రియా బౌలింగ్‌లలో లౌరెన్ (1), సోఫీ డివైన్ (9)లు అవుటయ్యారు. దీంతో ఒక దశలో 88/5 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్‌ను మిడిలార్డర్ బ్యాటర్ బ్రూక్ హాలిడే ఆదుకుంది. చూడచక్కని బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఇసాబెల్లా గేజ్ (49 బంతుల్లో 25; 1 ఫోర్)తో ఆరో వికెట్‌కు 64 పరుగులు, తహుహు (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక హాలిడే నిష్క్రమించింది. గెలిపించిన స్మృతి, హర్మన్ చూసేందుకు లక్ష్యం సులువుగానే కనిపిస్తుంది. అయితే గత మ్యాచ్ గుర్తుకొస్తే ఎక్కడ, ఎప్పుడు కూలిపోతోందోనన్న బెంగ! నాలుగో ఓవర్లోనే షఫాలీ (12) అవుట్. స్మృతి ఫామ్‌పై దిగులు! కానీ స్టార్ ఓపెనర్ కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వన్‌డౌన్ బ్యాటర్ యస్తిక భాటియా (49 బంతుల్లో 35; 4 ఫోర్లు)తో కలిసి జట్టును పరుగుల బాట పట్టించింది. జట్టు స్కోరు వందకు చేరువయ్యే సమయంలో 92 పరుగుల వద్ద యస్తికను సోఫీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రాగా... 73 బంతుల్లో స్మృతి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.ఇద్దరు కలిసి న్యూజిలాండ్ బౌలర్లపై కదం తొక్కడంతో జట్టు గెలుపుబాట పట్టింది. హర్మన్ 54 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది. కాసేపటికే మంధాన 121 బంతుల్లో సెంచరీ మైలురాయిని చేరుకుంది. అదే స్కోరు వద్ద ఆమె క్లీన్బౌల్డయ్యింది. అప్పటికే జట్టు గెలుపుతీరానికి చేరుకుంది. జెమీమా (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)తో హర్మన్ లాంఛనాన్ని దాదాపు పూర్తి చేస్తుండగా, విజయానికి పరుగుదూరంలో జెమీమా ఎల్బీగా వెనుదిరిగింది. తేజల్ (0 నాటౌట్) ఖాతా తెరువకముందే హర్మన్‌ప్రీత్ బౌండరీతో జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ మహిళల ఇన్నింగ్స్: సుజీ బేట్స్ రనౌట్ 4; జార్జియా (సి) దీప్తి (బి) ప్రియా 39; లౌరెన్ (సి) యస్తిక (బి) సైమా 1; సోఫీ డివైన్ (బి) ప్రియా 9; హాలిడే (సి) రాధ (బి) దీప్తి 86; మ్యాడీ గ్రీన్ రనౌట్ 15; ఇసాబెల్లా (సి) అండ్ (బి) దీప్తి 25; హన్నా రోవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 11; తహుహు నాటౌట్ 24; కార్సన్ (సి) రాధ (బి) రేణుక 2; జొనాస్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–24, 2–25, 3–36, 4–66, 5–88, 6–152, 7–199, 8–210, 9–219, 10–232. బౌలింగ్: రేణుకా సింగ్ 10–1–49–1, సైమా ఠాకూర్ 9.5–1–44–1, ప్రియా మిశ్రా 10–1–41–2, దీప్తిశర్మ 10–2–39–3, రాధా యాదవ్ 4–0–21–0, హర్మన్‌ప్రీత్ 6–0–34–0. భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (బి) రోవ్ 100; షఫాలీ (సి) ఇసాబెల్లా (బి) రోవ్ 12; యస్తిక (సి) అండ్ (బి) సోఫీ 35; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 70; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) జొనాస్ 11; తేజల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–16, 2–92, 3–209, 4–232. బౌలింగ్: లియా తహుహు 6–0–30–0, హన్నా రోవ్ 8–0–47–2, ఎడెన్ కార్సన్ 10–0–45–0, సోఫీ డివైన్ 7.2–0–44–1, సుజీ బేట్స్ 4–0–18–0, ఫ్రాన్ జొనాస్ 9–1–50–1. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 347 పరుగుల తేడాతో భారీ విజయం
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు దీప్తీ శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ చాపచుట్టేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్ మూడు , గైక్వాడ్ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్(21) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 186/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. అదే విధంగా ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ 136 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. భారత్ విషయానికి వస్తే.. తమ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 428 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (111 బంతుల్లో 67 ; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(49) పరుగులతో రాణించింది. కాగా మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన -
నెంబర్‌వన్‌కు అడుగుదూరంలో భారత క్రికెటర్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో దీప్తి 9 వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్)కు దీప్తికి కేవలం 26 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉంది. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో భారత స్పిన్నర్ తన జోరు కొనసాగిస్తే టాప్ ర్యాంక్ సాకారమయ్యే చాన్స్ ఉంది. టాప్–10లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక (7వ), స్నేహ్ రాణా (10వ) ఉన్నారు. చదవండి: భారత పర్యటనలో ‘వార్మప్’ ఆడకపోవడం సరైందే: స్మిత్ Virat Kohli: మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి -
అంపైర్ ఔటివ్వలేదు.. పెవిలియన్ చేరి మనసులు దోచుకుంది
Punam Raut Walks Despite Being Given Not Out.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా బ్యాటర్స్ ఒకేరోజు రెండు అద్భుతాలు చేసి చూపించారు. ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా.. తొలి పింక్ బాల్ టెస్టులోనే శతక్కొట్టిన స్మృతి మంధన చరిత్ర సృష్టించగా.. మరో టీమిండియా బ్యాటర్ పూనమ్ రౌత్ అభిమానుల మనసులు గెలుచుకుంది. అంపైర్ ఓటవ్వికున్నా తనకు తానుగా క్రీజు వీడి క్రీడాస్పూర్తి ప్రదర్శించింది. విషయంలోకి వెళితే.. పింక్‌బాల్ టెస్టులో భాగంగా ఆట రెండో రోజు పూనమ్ రౌత్ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మొలినుక్స్ వేసిన నాలుగో బంతిని పూనమ్ ఫ్లిక్ చేయగా.. కీపర్ హీలే దానిని అందుకుంది. అంపైర్‌కు అప్పీల్ చేయగా అతను ఔట్ కాదంటూ సిగ్నల్ ఇచ్చాడు. చదవండి: Smriti Mandhana: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..! అయితే రౌత్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగిలిందని నిర్థారణకు వచ్చి అంపైర్ నిర్ణయం చూడకుండానే వాకౌట్ చేసింది. ఈ చర్యతో అంపైర్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.. అనంతరం క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన పూనమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. ''నమ్మశక్యం కాని విషయం.. పూనమ్ రౌత్ ఔట్ కాదని అంపైర్ అన్నాడు.. కానీ ఆమె పెవిలియన్‌కు చేరింది.. సూపర్ పూనమ్ రౌత్ అంటూ క్యాప్షన్ జత చేసింది. పూనమ్ రౌత్ చేసిన పనిని మెచ్చకుంటున్న అభిమానులు ఆమె క్రీడాస్పూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇక టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 -
రెక్కలు తొడిగి... రివ్వున దూసుకెళ్లి
చిన్నప్పుడు ఆ అమ్మాయి క్రికెటర్ కావాలనుకుంది... మామూలుగా క్రికెట్ ఆడటమే కాదు దేశానికే ప్రాతినిధ్యం వహించింది...ఆమెను ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న అనుకున్నారు... సీరియస్‌గా చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంది... ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాలనేది ఆమె కల... అర్హత పరీక్షలో సత్తా చాటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా ఎంపికైంది... ఒకే అమ్మాయిలో ఇన్ని విభిన్న కోణాలు కలగలిస్తే ఆమె శిఖా పాండే అవుతుంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పేస్ బౌలర్. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగం కావాలనేది శిఖా బలమైన కోరిక. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తన రనౌట్‌తోనే ఆమె కల చెదిరింది. ఈ సారైనా అది నెరవేరుతుందా అనేది ఆసక్తికరం. (సాక్షి క్రీడా విభాగం): ప్రొఫెషనల్‌గా ఆటలో సత్తా చాటుతూ మరో వైపు సమాంతరంగా ఉన్నత చదువులను కొనసాగించేవారు క్రికెట్ ప్రపంచంలో అతి తక్కువ మంది కనిపిస్తారు. అనిల్ కుంబ్లే, అశ్విన్, అంజుమ్ చోప్రాలాంటి వారు కూడా ఇంజినీరింగ్‌లు చదివినా దానిని పేరుకు, డిగ్రీ పట్టా అందుకోవడం వరకే పరిమితం చేశారు. మరో వైపు ఆటగాళ్లకు ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు ఇచ్చే మేనేజర్ తరహా ఉద్యోగాలు కూడా ఉంటాయి. కానీ భారత మహిళా క్రికెటర్ శిఖా సుభాశ్ పాండే మాత్రం వీటికి భిన్నం. తన సామర్థ్యానికి తగినట్లుగా పోటీల్లో నిలిచి తాను అనుకున్న ఉద్యోగంలో చేరింది. ఒక వైపు క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చని చేతల్లో చూపించిన శిఖా కెరీర్ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. జూనియర్ క్రికెట్ నుంచి... శిఖా క్రికెట్ కెరీర్ గోవాలో మొదలైంది. గల్లీల్లో కుర్రాళ్లతో కలిసి ఆడిన ఆమె స్కూల్ క్రికెట్లో సత్తా చాటడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో అండర్–17, అండర్–19 స్థాయిలో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న గోవా క్రికెట్లో పెద్దగా పోటీ కూడా లేని సమయం కావడంతో వేగంగా దూసుకుపోవడం సులువైంది. అదే సమయంలో బీసీసీఐ కూడా మహిళా క్రికెట్‌ను గుర్తించడంతో శిఖా ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఉమెన్ చాలెంజర్ టోర్నీ, సౌత్‌జోన్ అండర్–19 జట్లలో అవకాశాలు దక్కాయి. అనంతరం గోవా సీనియర్ టి20 టీమ్‌లో వచ్చేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుతో టూర్ మ్యాచ్ ఆడిన భారత ‘ఎ’ జట్టులో, ఇంగ్లండ్‌పై ఆడిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో కూడా చోటు దక్కింది. వరుస వికెట్లతో శిఖా ఈ పోటీల్లో సత్తా చాటింది. ఆపై భారత జట్టులో స్థానం లభించడం లాంఛనమే అయింది. గోవా తరఫున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా పాండే అరుదైన ఘనత అందుకుంది. ప్రధానంగా పేస్ బౌలరే అయినా...లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడుతూ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చదువులో తగ్గకుండా... ఆటలో ఎదగాలనుకునేవారికి అందరికంటే ముందుగా కోచ్‌లు, సన్నిహితులు చెప్పే మాట ఒకటే. రెండు పడవల ప్రయాణం మంచిది కాదని, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. కానీ శిఖా అలా అనుకోలేదు. ఆటలో పడి చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్నుంచి కాలేజీ వరకు మంచి మార్కులతో నంబర్‌వన్‌గా ఉంటూ తనపై నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చింది. అప్లయిడ్ మ్యాథమెటిక్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కిచ్చిన మాట ప్రకారం గోవా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్నుంచి ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్’లో పట్టా అందుకుంది. ఆ అర్హతతో పలు పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనా... క్రికెట్లో ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుంది. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన శిఖా ఏడాది శిక్షణ అనంతరం ఫ్లయింగ్ ఏటీసీ ఆఫీసర్‌గా నియమితురాలైంది. అటు క్రికెట్ ఆడుతూ, ఇటు సీరియస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన కెరీర్‌ను కొనసాగించిన తీరు నిజంగా అద్భుతం. గత టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో చోటు కోల్పోయినా...పట్టుదలతో పోరాడి తిరిగొచ్చిన శిఖా పునరాగమనంలో మరింత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొడుతోంది. కరీంనగర్ నుంచి... శిఖా తండ్రి సుభాశ్ పాండే కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన ఆయన చివరకు గోవాలో స్థిరపడ్డారు. గతంలో తెలంగాణలోని రామగుండంలో ఆయన పని చేశారు. అదే సమయంలో శిఖా కరీంనగర్‌లోనే పుట్టింది. కేవీ కారణంగానే స్పోర్ట్స్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాలమ్ విమానాశ్రయంలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 31 ఏళ్ల శిఖాను పేస్ బౌలర్‌గా, యార్కర్ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలో భారత మాజీ పేసర్ సుబ్రతో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. -
ఆల్ ది బెస్ట్
టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెస్టిండీస్ చేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్. నవంబర్ 9 నుంచి 24 వరకు వెస్టిండీస్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ‘బి’లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు... గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ 24న జరుగుతుంది. -
మేం ప్రపంచకప్ గెలిస్తే...
ముంబై: ఇంగ్లండ్‌లో ఈనెల 24న మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌ను తాము గెలిస్తే భారత మహిళల క్రికెట్లో పెను మార్పులు సంభవించడం ఖాయమని కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. ఇటీవలికాలంలో తమ జట్టు రాణిస్తున్న తీరు చాలా బాగుందని తెలిపింది. ‘మేం ఈ ప్రపంచకప్‌ను గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అదే జరిగితే భారత మహిళ క్రికెట్‌కు అది విప్లవాత్మకమైన ముందడుగు అవుతుంది. మా విజయాన్ని ప్రేరణగా తీసుకుని ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకు వస్తారు. అది మహిళల క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని మిథాలీ పేర్కొంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందు కు జట్టు శనివారం రాత్రి బయలుదేరింది. మరోవైపు మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా పేరు తెచ్చుకునేందుకు మిథాలీ మరో 212 పరుగుల దూరంలో ఉంది. ప్రపంచకప్‌లో ముందుగా సెమీఫైనల్ బెర్త్‌పై దృష్టి పెడతామని తెలిపింది. గత రెండు సిరీస్‌ల్లో జట్టులోని ముగ్గురు పేసర్లు అద్భుతంగా రాణించారని, అయితే వారంతా గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్నెస్తో ఉండటం ముఖ్యమని ఈ హైదరాబాదీ క్రికెటర్ చెప్పింది. ‘నిజానికి ప్రతీ జట్టు కూడా ఓ అదనపు పేసర్ ఉండాలని కోరుకుంటుంది. కానీ భారత్ ఎక్కువగా స్పిన్నర్లను కలిగి ఉంటుంది. అయితే ఆసీస్, దక్షిణాఫ్రికా ఇలా ఎక్కడైనా వారు మెరుగ్గా రాణించగలిగారు’ అని గుర్తుచేసింది. గత నెలలో జరిగిన నాలుగు దేశాల సిరీస్‌లో అద్భుతంగా ఆడిన భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సీనియర్లపై ఒత్తిడి ఉంది... జట్టుకు విజయాలందించడంపై తనతోపాటు జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖా పాండే, వేద కృష్ణమూర్తిలపై ఒత్తిడి అధికంగానే ఉంటుందని మిథాలీ తెలిపింది. ‘ప్రపంచకప్‌లాంటి టోర్నీల్లో ఆడుతున్నప్పుడు మాపై ఉన్న అంచనాల గురించి తెలుసు. అయితే తొలిసారిగా ఆడుతున్న యువ క్రికెటర్లను ముందు మేం ఉత్సాహపరచాల్సి ఉంటుంది. ఇక టోర్నీలో మా బ్యాటింగ్ ఆర్డర్ కూర్పును ఎలా మార్చుకుంటామనేది పరిశీలిస్తాం. అయితే ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్టుగా మా సన్నాహకాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చెప్పలేను. మంచి వెలుతురు ఉన్న స్థితిలో ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో 300కు పైగా పరుగులు వస్తున్నాయి. మా జట్టు కూడా అదే రీతిలో ఆడాలని ఆశిస్తున్నాను’ అని 34 ఏళ్ల మిథాలీ తెలిపింది.