
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభించే అదృష్టం మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు దక్కింది. లార్డ్స్‌లో జరిగే ప్రతి టెస్టు జరిగే రోజు ఆట ఆరంభానికి సూచికగా గంట మోగించడం ఆనవాయితీ. ఆదివారం భారత ఆల్‌రౌండర్ దీప్తి గంట కొట్టి నాలుగో రోజు ఆటను ప్రారంభించింది.
23 ఏళ్ల దీప్తి అక్కడ ‘ది హండ్రెడ్’ టోర్నీ లో లార్డ్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న ‘లండన్ స్పిరిట్’ జట్టు తరఫున ఆడుతోంది. ‘క్రికెట్ మక్కా’లో గంట మోగించే గౌరవం లభించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. (చదవండి: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్?)
Comments
Please login to add a commentAdd a comment