women cricketer
-
‘అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావడమే లక్ష్యం’
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి 2024లో 5 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. వాటిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 26 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటిన మ్యాచ్ కూడా ఉంది. ఇదే ఏడాది 7 టి20ల్లో కేవలం 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో వరల్డ్ కప్‌లో తీసిన 7 వికెట్లు కూడా ఉన్నాయి. ఎలా చూసినా భారత మహిళల జట్టు కోణంలో ఇది మెరుగైన ప్రదర్శనే. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఆమెపై వేటు వేశారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లతో పాటు ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా అరుంధతిని ఎంపిక చేయలేదు. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అరుంధతిపై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇలాంటివన్నీ తన చేతుల్లో లేవని... తన వైపు నుంచి అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తాను చేయగలిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో నాకూ తెలీదు. అయితే ఈ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు. క్రికెట్ బాగా ఆడటం మాత్రమే నాకు తెలిసిన విద్య. కాబట్టి భారత్ తరఫున ఎప్పుడు అవకాశం దక్కినా అదే చేసి చూపిస్తా. ఏ స్థాయిలో ఏ జట్టు తరఫున ఆడినా మైదానంలోకి దిగగానే జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తా. మొదటినుంచి నేను క్రికెట్‌ను ఇలాగే ఆడాను’ అని అరుంధతి పేర్కొంది. కోచ్ అండతో... భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఆడిన చాలెంజర్ ట్రోఫీ తనకు కూడా తగిన సవాల్ విసిరిందని... కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి తన జట్టు (టీమ్ ‘ఎ’)ను ఫైనల్ చేర్చడం సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించింది. అయితే ఆటలో ఉండే అనిశ్చితిని ఎదుర్కోవడం అంత సులువు కాదని అరుంధతి అంగీకరించింది. జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో తాను మానసికంగా నిరాశకు లోను కాకుండా తన కోచ్ అర్జున్ దేవ్ అండగా నిలిచారని అరుంధతి గుర్తు చేసుకుంది. బెంగళూరులోని ఎన్ఐసీఈ అకాడమీలో అర్జున్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘భారత జట్టుకు ఆడినా ఆడకపోయినా... వేరే ఏ టీమ్‌కు ఆడినా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారాలనే పట్టుదలతో సాధన చేయి అని ఆయన నాకు చెప్పారు. నేను మళ్లీ భారత్‌కు ఆడగలనా లేదా అంటే జవాబివ్వలేను. ప్రస్తుతం ఉండే అనిశ్చితిలో ఏ ప్లేయర్‌కు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ క్రికెటర్వు అంటూ ప్రతీ రోజు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. అదే నన్ను నడిపిస్తుంది’ అని ఈ హైదరాబాదీ తన మనసులో మాటను చెప్పింది. ఎక్కడైనా ఆట ఒక్కటే... ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ప్రస్తుతం నాకు వచ్చిందని చెప్పగలను. ఇప్పుడు ఏ టీమ్‌కు ఆడినా సీనియర్లలో ఒకరిగా ఉంటున్నాను. ఇది నాకు ఎంతో మేలు చేస్తోంది. జూనియర్ అమ్మాయిలకు కొన్ని విషయాలు నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను. నా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఆడుతున్నాను. ఏ జట్టు కోసం ఆడుతున్నాను అనేది పట్టించుకోకుండా దీనిపైనే దృష్టి పెడుతున్నాను’ అని ఆమె స్పష్టం చేసింది. జట్టు మార్పుతో... దేశవాళీ క్రికెట్లో ఐదేళ్ల పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రెండేళ్ల క్రితం అరుంధతి రెడ్డి కేరళ జట్టుకు మారింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎన్నో విధాలా ఆలోచించాల్సి వచ్చినా చివరకు ధైర్యం చేసింది. అయితే కేరళకు మారిన తర్వాత అటు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఆమె ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. అయితే గత రెండేళ్లుగా నా ఆటలో ఎంతో మార్పు వచ్చిందనేది వాస్తవం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కానీ అవి నాకు మేలు చేశాయి. ఇప్పుడు నా ఆటపై నాకు మరింత స్పష్టత రావడంతో టోర్నీలకు సరైన రీతిలో సిద్ధమవుతున్నా. ఆపై ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు నాలో ఓటమిభయం కూడా తగ్గింది’ అని అరుంధతి వివరించింది. ‘అటాకింగ్’పై దృష్టి... ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అరుంధతి... స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తన బౌలింగ్‌లో పలు మార్పులు చేసుకుంది. ముఖ్యంగా ఆమె బౌలింగ్‌లో ‘అటాకింగ్’ పెరిగింది. గతంలో బ్యాటర్‌ను ఆడకుండా చేసే లక్ష్యంతో ఆఫ్‌స్టంప్ బయటే వరుసగా బంతులు వేసేది. ఇప్పుడు నేరుగా స్టంప్స్‌పైకే బంతులు గురి పెడుతూ బౌలింగ్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా...ఈ తరహా బౌలింగే ప్రస్తుతం తన బలంగా మారిందని ఆమె స్పష్టం చేసింది. -
ఆటలోనే కాదు.. స్టైల్లోనూ తగ్గేదేలే.. మిథాలీ రాజ్ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
12th exams : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా క్రికెటర్ దూరం (ఫొటోలు)
-
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూ డేవిడ్
దుబాయ్: భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. డయానా ఎడుల్జీ తర్వాత భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్ స్పందించింది. పలు ఘనతలు... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహిళల టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్ అయ్యాక నీతూ డేవిడ్ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది. టెస్టుల్లో పరుగుల వరద...ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ అలిస్టర్ కుక్ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్ అధిగమించే వరకు ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్ గెలిచేందుకు దోహదం చేసిన అతను కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు. విధ్వంసానికి మారుపేరు... ఈతరం క్రికెట్ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అత్యంత అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టి రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్లో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు. వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది. రికార్డు విజయం కూడా ఇక ఈ మ్యాచ్‌లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే! వన్డేల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు 1. గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్‌కప్- 201 రన్స్(నాటౌట్) 2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్) 3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్) 4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్) 5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్. చదవండి: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్‌రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్‌తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్‌రౌండర్‌గా పేరుంది. -
Harleen Deol: టీమిండియా స్టైలిష్ క్రికెటర్ హర్లీన్ డియోల్ అందమైన ఫొటోలు
-
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్
Jess Jonassen Marriage: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జెస్సికా లూసీ జొనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వెర్న్‌ను పెళ్లాడింది. పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఏప్రిల్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జొనాసెన్- సారా పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్ జొనాసెన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘సర్ప్రైజ్! థర్డ్‌టైమ్ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని ట్వీట్ చేసింది. అవును లెస్బియన్నే కాగా జొనాసెన్ తాను లెస్బియన్ అన్న విషయాన్ని గర్వంగా ఈ ప్రపంచానికి చెప్పుకోగలనంటూ గతంలో ప్రకటించింది. ఈ క్రమంలోనే సారాతో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన ఆమె తాజాగా తనను వివాహమాడింది. ఇక ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించారన్న విషయం తెలిసిందే. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన జొనాసెన్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మెంబర్. ఆమె ఖాతాలో వన్డే వరల్డ్‌కప్(2022) కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆసీస్ జట్టులో కూడా జొనాసెన్ భాగమైంది. ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన 30 ఏళ్ల జొనాసెన్.. మొత్తంగా 88 మ్యాచ్‌లలో 135 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. 100 టీ20లు ఆడి 91 వికెట్లు తీసింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసింది. కొత్తేం కాదు ఇప్పటికే చాలా మంది మహిళా క్రికెటర్లు లెస్బియన్లుగా ప్రకటించుకోవడమే గాకుండా.. తమ భాగస్వాములను కూడా పెళ్లాడారు. డేనియెల్ వ్యాట్- జార్జ్ హాడ్జ్, డానే వాన్ నీకెర్క్-మారిజానే క్యాప్, లీ తహుహు- ఆమీ సాటెర్త్‌వైట్, నటాలీ సీవర్- కేథరిన్ బ్రంట్, లిజెల్లీ లీ- తంజా క్రోన్జ్, లారెన్ విన్ఫీల్డ్- కర్టెనీ హిల్, మేఘన్ షట్- జెస్ హొల్యోక్, హేలీ జెన్సెన్- నికోలా హాంకోక్, మ్యాడీ గ్రీన్- లిజ్ పెర్రీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. చదవండి: వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ SURPRISE!! 3rd time lucky - finally married my best friend 🥰 April 6th will always have a special place in my heart 👩❤️👩💍 #hawaii #wedding #love pic.twitter.com/rOYEyrOGFQ — Jessica Jonassen (@JJonassen21) April 14, 2023 -
WPL 2023: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్
WPL 2023- Shabnam- Gujarat Giants: ఎనిమిదేళ్ళవయసులో సరదాగా తండ్రితో గ్రౌండ్‌కు వెళ్ళేది. అక్కడ కొంతమంది అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఆసక్తిగా చూసేది. ఓ రోజు తనకూ క్రికెట్ ఆడాలనివుందనే అభిలాషను వ్యక్తపరిచింది. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో క్రికెట్ బాల్ అందుకుంది. నేడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్థాయికి ఎదిగిపోయింది. ఇటీవల అండర్19 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకున్న జట్టుకు ఆడింది. ఆరేళ్లలోనే తన మీడియం పేస్‌తో ప్రత్యర్థుల్ని బెంబెలెత్తించే స్థాయికి చేరుకుంది విశాఖ ఉమెన్ క్రికెటర్ షబ్నమ్ మహ్మాద్ షకీల్. ఆటే శ్వాసగా రాణిస్తున్న రైట్ ఆర్మ్ మీడియం పేసర్ షబ్నమ్ మహిళా దినోత్సవసందర్భంగా తన అంతరంగాన్ని సాక్షితో పంచుకుంది. క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది... 2017లో క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల్లో పా ల్గొన్నాను. నాకు మొదట్నించీ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే ఇష్టం ఉండేది. రెండేళ్ళలో మీడియం పేసర్‌గా ఎదిగాను. పేస్‌లో వేరియేషన్స్‌తో బంతులు విసురుతుండటంతో అండర్ 16 జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనతికాలంలోనే ఆంధ్రజట్టుకు ఆడాను. రైల్వేస్ జట్టుతో ప్రాక్టీస్‌లో నెట్‌బౌలర్‌గా సీనియర్స్‌తో ఎలా ఆడాలో నేర్చుకున్నాను. అనంతరం ఏకంగా ఉమెన్ అండర్ 19 వరల్డ్‌కప్, జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ప్రస్తుతం ఉమెన్ ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్నాను. చదువెలా సాగుతోంది... పదో తరగతి చదువుతున్నాను. ఏప్రిల్‌లో పరీక్షలున్నాయి. ఉమెన్ ఐపీఎల్ పూర్తికాగానే పరీక్షలు రాస్తాను. మా టీచర్లు ఓ ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. సబ్జెక్ట్ డౌట్స్ వివరిస్తుంటారు. ప్రాక్టీస్, పా ఠాలు ఏకకాలంలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతూ ముంబయ్‌లో ఉన్నాను. ఇటీవలే అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్‌లోనూ ఆడాను. ప్రస్తుత లక్ష్యం... సీనియర్ ఉమెన్ జట్టులో ఇండియా తరపున ఆడటమే నా లక్ష్యం. అండర్–19 వరల్డ్‌కప్‌కు ఆడిన జట్లలో నేనే చిన్నదానిని. ఇప్పుడు ప్రీమియర్ లీగ్‌లోనూ చిన్న దాన్ని. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమెన్ ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌ను. పదినేహేళ్ల ప్రాయంలోనే ఇది సాధ్యపడటం చాలా సంతోషాన్నిచ్చింది. జూనియర్ వుమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో... జూనియర్స్ వరల్డ్‌కప్ ఆడుతున్నప్పుడు, సీనియర్ల నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. కోచ్‌లు నీనియర్ సభ్యులు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, అప్పుడే ఎక్స్పోజర్ వస్తుందని సూచించారు. ముందు మన బలహీనతలు తెలుసుకుని, వాటి ని అధిగమించాలని కూడా చె΄్పారు. అందుకు తగినట్టు గానే మ్యాచ్‌ల్లో సీనియర్స్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నాను. అందరిలోకి చిన్నదాన్ని కావడంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. ఇన్స్పిరేషన్ ఎవరు... జులన్ గోస్వామి ఆట తీరును జాగ్రత్తగా గమనిస్తుంటాను. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆమె నా స్ఫూర్తి. ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు? యూనిఫామ్ వేనుకునే జాబ్ చేయాలనేది నా ఆకాంక్ష. దేశం పట్ల నాకు చాలా గౌరవం. డిఫెన్స్, పోలీస్ లాంటి రంగాల్లో పని చేయాలని ఉంది. మీ హాబీలేంటి? నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ఇష్టం ఏర్పడటంతో మిగిలిన విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కలగలేదు. అందుకే హాలిడే ఎంజాయ్ చేయాలని, ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదు. నాన్న షకీల్ తన జట్టుకు ఆడుతుంటే సరదాగా చెల్లెలు షాజహానాతో కలిసి కామెంటరీ చెప్పేదాన్ని. అలా సరదాగా ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేడు ప్రీమియర్ లీగ్, జూనియర్ వరల్డ్ కప్ ఆడేస్థాయికి చేరింది. మ్యాచ్‌లలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళాను తప్ప ప్రదేశాలను చూడడం కోసం ఎక్కడికీ వెళ్లలేదు. ఏ రంగు ఇష్టం? నీలం రంగు అంటే ఇష్టం. లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటాను. ఇక బాగా ఇష్టమైనది నిద్ర. ఖాళీ దొరికితే ఎక్కువగా పడుకుంటాను. సరదాగా మ్యాచ్‌లు చూసే స్థాయి నుంచి సీరియస్‌గా మ్యాచ్‌లాడే స్థాయికి ఎదగడంతో తీరిక అనేది ఉండటం లేదు. ఈ నెల 27న తిరిగి విశాఖ చేరుకోగానే పరీక్షలపై దృష్టి పెట్టాలి. చెస్, బ్యాడ్మింటన్ సరదాగా ఆడుతుంటాను. డైట్ ఎలా? నాకు బిరియానీ అంటే ఇష్టం. అమ్మ రాత్రికి పుల్కాల్లో రకరకాల వంటలు చేస్తుంది. డైట్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాను. ఆహారసూచనలను పా టిస్తాను. డ్రైప్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాను. స్వీట్స్ జోలికి వెళ్ళను. ఎలాంటి సినిమాలిష్టం? సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటివరకు ఆట, చదువే నా లోకం. కానీ ఆటల మీద వచ్చిన సినిమాల్ని చూస్తాను. ఉదయాన్నే ఐదుగంటల కల్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్తాను. కోచ్‌లు చెప్పిన వాటిని తూచ తప్పకుండా ఆచరించడం. వీలు దొరికినప్పుడల్లా సబ్జెక్ట్ బుక్స్ ముందేసుకు కూర్చోవడమే ప్రస్తుత నా దినచర్య. – డాక్టర్ ఎ. సూర్యప్రకాశరావు మాడిమి, విశాఖపట్నం -
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్ గుడ్‌బై
టీమిండియా సీనియర్ మహిళా వికెట్ కీపర్ కరుణ జైన్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. 36 ఏళ్ల కరుణ జైన్ 2005 నుంచి 2014 మధ్య కాలంలో టీమిండియా తరపున ఐదు టెస్టులు, 44 వన్డేలు, తొమ్మిది టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కరుణ జైన్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే అర్థశతకంతో ఆకట్టుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 64 పరుగులు చేసింది. 2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో కరుణ జైన్ సభ్యురాలు. ''క్రికెట్ కెరీర్ ఒక అద్భుతమైన ప్రయాణం ఈరోజుతో ముగిసింది. నా ప్రయాణంలో కుటుంబసభ్యులు అండగా నిలిచారు. నేను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటూ తోటి క్రికెటర్లు ఎంకరేజ్ చేయడం ఎప్పటికి మరిచిపోను. మీ అందరి సపోర్ట్‌తోనే ఇంత కాలం క్రికెట్ ఆడగలిగాను. నా క్రికెట్ ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, సహాయక సిబ్బంది, సహచరులందరికీ ధన్యవాదాలు.'' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. కరుణ జైన్.. టీమిండియా మహిళా జట్టుతో పాటు దేశవాలిలో ఎయిరిండియా, కర్ణాటక, పాండిచ్చేరి జట్లకు ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టు తరఫున 1100కు పైగా పరుగులు చేసిన కరుణ జైన్ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కరుణ జైన్ స్వస్థలం బెంగళూరు. Karuna Jain, who was a key part of the 🇮🇳's team that made the 2005 World Cup final, has retired from all formats. pic.twitter.com/H8mBtOvkv3 — Women’s CricZone (@WomensCricZone) July 24, 2022 చదవండి: R Sai Kishore: సంచలన బౌలింగ్‌తో మెరిసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ -
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
అలా ఈ ప్రయాణం అజేయ సెంచరీతో మొదలై హాఫ్ సెంచరీతో ముగిసింది!
Mithali Raj Retirement: రెండు దశాబ్దాలకుపైగా అలసటన్నది లేకుండా ఆడుతూ... లెక్కలేనన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తూ... ‘ఆమె’ ఆటను అందలాన్ని ఎక్కిస్తూ... భావితరాలకు బాటలు వేస్తూ... ఇక బ్యాట్‌తో సాధించాల్సిందీ ఏమీ లేదని భావిస్తూ... భారత మహిళల క్రికెట్ మణిహారం మిథాలీ రాజ్ ఆటకు అల్విదా చెప్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ అత్యున్నత దశలో ఆట నుంచి వీడ్కోలు తీసుకుంది. న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఈ మేరకు ఆమె ట్విటర్లో లేఖ విడుదల చేసింది. ఇన్నేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని పేర్కొన్న మిథాలీ... రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ను ప్రతిభావంతులైన క్రీడాకారిణుల చేతుల్లో పెడుతున్నానని పేర్కొంది. ఇన్నేళ్లపాటు అనుక్షణం తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని 39 ఏళ్ల ఈ హైదరాబాద్ క్రికెటర్ తెలిపింది. 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీ (114 నాటౌట్)తో అద్భుత అరంగేట్రం చేసిన మిథాలీ... 2022 మార్చి 27న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే (68 పరుగులు) ఆడింది. 23 ఏళ్ల ఆమె అంతర్జాతీయ కెరీర్ సెంచరీతో మొదలై అర్ధ సెంచరీతో ముగియడం విశేషం. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో నా ప్రస్థానం మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక సంఘటనతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. గత 23 ఏళ్లలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు వచ్చింది. అందుకే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్‌ను విజేతగా నిలబెట్టాలని కృషి చేశా. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ భవిష్యత్ ఉజ్వలంగా ఉందని... యువ క్రికెటర్ల చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తూ నా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఎల్లవేళలా నాకు మద్దతు ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా. ఏళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గర్వకారణంగా ఉంది. నాయకత్వ బాధ్యతలు నన్ను వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డాయి. ప్లేయర్‌గా నా ప్రయాణం ముగిసినా... భవిష్యత్‌లో మహిళల క్రికెట్ ఉన్నతికి నా వంతుగా కృషి చేస్తా. ఇన్నాళ్లు నా వెన్నంటే నిలిచి ప్రేమ, ఆప్యాయతలు పంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. –మిథాలీ రాజ్ మిథాలీ కెరీర్ గ్రాఫ్... ఆడిన వన్డేలు 232 ►చేసిన పరుగులు: 7,805, నాటౌట్: 57 ►అత్యధిక స్కోరు: 125 నాటౌట్ ►సగటు: 50.68 ►సెంచరీలు: 7, అర్ధ సెంచరీలు: 64 ►క్యాచ్‌లు: 64, తీసిన వికెట్లు: 8 ఆడిన టెస్టులు 12 ►చేసిన పరుగులు: 699, నాటౌట్: 3 ►అత్యధిక స్కోరు: 214, సగటు: 43.68 ►సెంచరీలు: 1, అర్ధ సెంచరీలు: 4, క్యాచ్‌లు: 12 ఆడిన టి20లు 89 ►చేసిన పరుగులు: 2,364 ►అత్యధిక స్కోరు: 97 నాటౌట్ ►సగటు: 37.52 ►సెంచరీలు: 0 ►అర్ధ సెంచరీలు: 17, క్యాచ్‌లు: 19 చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? You will continue to inspire millions, @M_Raj03! 👏 👏 We will miss your presence in the dressing room.#ThankYouMithali pic.twitter.com/qDBRYEDHAM — BCCI Women (@BCCIWomen) June 8, 2022 -
శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్!
Mithali Raj Retirement: భారత క్రికెటర్‌గా దాదాపు 23 ఏళ్ల పాటు కొనసాగించిన ప్రస్థానానికి మిథాలీ రాజ్ ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. కాగా 39 ఏళ్ల మిథాలీ క్రికెటర్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి లెజెండ్‌గా ఖ్యాతి గడించారు. మిథాలీ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి సంక్షిప్తంగా.. ♦1999లో మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ♦వన్డేల్లో అత్యధిక పరుగులు(7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు ♦వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా ఘనత ♦వుమెన్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ జాబితాలో రెండో స్థానంలో మిథాలీ రాజ్(1321 పరుగులు) ♦వన్డేల్లో అత్యధిక సెంచరీలు(7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి. ♦టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ సాధించిన పరుగులు 2364. 2019లో చివరి మ్యాచ్ ఆడిన ఆమె.. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ►మహిళా క్రికెట్లో ఇప్పటి వరకు 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ►మహిళా ప్రపంచకప్ ఈవెంట్లో ఏకంగా ఆరుసార్లు( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు. ►మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. 2002లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు సాధించిన మిథాలీ. ►మహిళా వన్డే క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌కు పేరు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. ►మహిళా క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన రికార్డు. ఆమె 22 ఏళ్ల 274 రోజుల పాటు క్రికెటర్‌గా ఉన్నారు. ♦మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా మిథాలీ(న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం). ♦అదే విధంగా కెప్టెన్‌గానూ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. ♦వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రికార్డు. ♦మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. చదవండి: Nicholas Pooran: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్! కానీ పాక్‌తో మ్యాచ్‌లో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
న్యూజిలాండ్ క్రికెటర్ రిటైర్మెంట్.. అరుదైన రికార్డు తనకు సొంతం!
Katey Martin Retirement: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ కేటీ మార్టిన్ ఆటకు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు. కాగా 2003లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన కేటీ.. వైట్‌ఫెర్న్స్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించారు. పందొమ్మిదేళ్ల తన కెరీలో మొత్తంగా 103 వన్డేలు, 95 టీ20 మ్యాచ్‌లు, ఒక టెస్టు ఆడారు. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ కేటీకి చివరిది. ఇందులో ఆమె 26 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇక సుదీర్ఘకాలంగా వైట్‌ఫెర్న్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన కేటీ మూడు ఫార్మాట్లలో కలిపి 2900 పరగులు చేశారు. ఇందులో 11 అర్ద శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో కేటీ అత్యధిక స్కోరు 81.ఇక దేశవాళీ వన్డే కెరీర్లో 169 మ్యాచ్‌లు ఆడిన కేటీ.. ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్(న్యూజిలాండ్ మెన్, వుమెన్ క్రికెట్)గా నిలిచారు. రిటైర్మెంట్ సందర్భంగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన కేటీ.. ‘‘అద్భుతమైన అనుభవం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు, ప్రత్యర్థి జట్ల ప్లేయర్లు.. అందరికీ ధన్యవాదాలు. క్రికెట్ నాకు జీవితాన్నిచ్చింది. దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న నా కలను నిజం చేసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమే. కానీ తప్పదు’’ అని పేర్కొన్నారు. చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి! -
హైదరాబాద్: భారత జట్టు మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పరిధి(సికింద్రాబాద్)లో మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు మహిళల రంజీ జట్టు క్రికెటర్ భోగి శ్రావణి ఇల్లును కూల్చివేశారు. కాగా, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గతంలో ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్‌లను ఆడుతోంది. -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు
Mithali Raj Becomes First Indian Woman Cricketer To Receive Khel Ratna Award: భారత మహిళా క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించనుంది. క్రీడల్లో భారత దేశపు అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలువనుంది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు పురుష క్రికెటర్లను మాత్రమే వరించింది. 1998లో సచిన్ టెండూల్కర్, 2008లో ఎంఎస్ ధోని, 2018లో విరాట్ కోహ్లి, 2020లో రోహిత్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన 38 ఏళ్ల మిథాలీ.. 10 వేలకు పైగా పరుగులతో పాటు మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ ఆమె 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇదిలా ఉంటే, ఈ అవార్డుకు మిథాలీతో పాటు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు నామినేట్ అయ్యారు. వీరితో పాటు మరో 34 మంది ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు ఉన్నారు. చదవండి: నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా.. -
Deepti Sharma: దీప్తి గంట కొట్టింది
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభించే అదృష్టం మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు దక్కింది. లార్డ్స్‌లో జరిగే ప్రతి టెస్టు జరిగే రోజు ఆట ఆరంభానికి సూచికగా గంట మోగించడం ఆనవాయితీ. ఆదివారం భారత ఆల్‌రౌండర్ దీప్తి గంట కొట్టి నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. 23 ఏళ్ల దీప్తి అక్కడ ‘ది హండ్రెడ్’ టోర్నీ లో లార్డ్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న ‘లండన్ స్పిరిట్’ జట్టు తరఫున ఆడుతోంది. ‘క్రికెట్ మక్కా’లో గంట మోగించే గౌరవం లభించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. (చదవండి: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్?) -
డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన దేశవాళీ మహిళా క్రికెటర్ అన్షులా రావ్ డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. దీంతో ఆమెపై జాతీయ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈ క్రమంలో డోపింగ్ బ్యాన్‌కు గురైన తొలి మహిళా క్రికెటర్‌గా అపకీర్తి మూటగట్టుకుంది. నిషేధిత ఉత్ప్రేరకం ‘19–నోరాండ్రోస్టెరాన్’ తీసుకున్నందుకు గాను ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. దోహా ప్రయోగాశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఆమె మూత్ర నమూనాల్లో అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ (ఏఏఎస్) ఉన్నట్లు తేలింది. అయితే అది తన శరీరంలోకి ఎలా వచ్చిందనే విషయమై ఆమె నోరు విప్పలేదు. కాగా, అన్షులా చివరిసారిగా 2019-20లో బీసీసీఐ నిర్వహించిన అండర్-23 టీ20 టోర్నీలో పాల్గొంది. నాడా పరిథిలోకి బీసీసీఐ వచ్చాక బయటపడిన తొలి కేసు ఇదే కావడం విశేషం. చదవండి: కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క ఫేక్ ఫైట్ ద్వారా ఆర్జించాడు -
'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా'
ముంబై: ప్రియా పూనియా ఇటీవల తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బారినపడిన పూనియా తల్లి సరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. అయితే బీసీసీఐ పూనియాను ఇంగ్లండ్ టూర్‌కి ఎంపిక చేశారు. జూన్ 2న భారత మహిళల జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ.. తల్లి కోల్పోయిన బాధలో ఉన్న పూనియాకు ఆమె తండ్రి సురేందర్ ధైర్యం చెప్పారు. తనలో స్ఫూర్తి నింపేందుకు విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపినట్లు ఆమె తండ్రి వెల్లడించాడు. ''ఇంగ్లండ్ టూర్ కోసం ప్రియా పూనియాలో నేను స్ఫూర్తి నింపాలనుకున్నా. ఈ క్రమంలో తండ్రిని కోల్పోయినా రంజీ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లి గురించి నేను చెప్పాను. నిజమే.. మా ఫ్యామిలీకి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ.. మానసికంగా మేము ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. జీవితంలో కూడా ఇలా సవాళ్లని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రియా పరిస్థితుల్ని అర్థం చేసుకుంది. నా కూతురు టీమిండియాకు ఆడేందుకు సిద్ధమని చెప్పింది'' అని పేర్కొన్నాడు. జూన్ 2న టీమిండియా పురుషుల జట్టుతో పాటు ఇంగ్లండ్‌కి వెళ్లనున్న భారత మహిళల జట్టు.. అక్కడ ఇంగ్లండ్‌తో జూన్ 16న ఏకైక టెస్టు, ఆ తర్వాత జూన్ 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనుంది. చదవండి: గబ్బర్ ఉన్నాడుగా.. ఇక వేరేవాళ్లు ఎందుకు? టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం -
టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం
న్యూఢిల్లీ: మరో భారత మహిళా క్రికెటర్ ఇంట్లో కరోనా కారణంతో విషాదం నెలకొంది. యువ క్రికెటర్ ప్రియా పూనియా తల్లి సరోజ్ పూనియా కోవిడ్–19తో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రియా భారత తరఫున 7 వన్డేలు, మూడు టి20లు ఆడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ప్రియా చోటు దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితం భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి కరోనాతో రెండు వారాల వ్యవధిలో తల్లిని, సోదరిని కోల్పోయింది. ఈ విషయాన్ని పూనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో పంచుకుంది. '' నా జీవితంలో ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయా. మనకు ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఈరోజు తెలిసింది. లవ్ యూ మామ్.. నువ్వు నా గైడింగ్ స్టార్... నేను తీసుకునే ప్రతి స్టెప్ వెనుక నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు మమ్మల్ని భౌతికంగా విడిచిపెట్టి వెళ్లావంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నువ్వు లేవన్న నిజాన్ని ఒప్పుకొని ముందుకు సాగాల్సిందే. నీతో గడిపిన క్షణాలు ఒక జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. రెస్ట్ ఇన్ పీస్.. మామ్. ఇది చాలా డేంజరస్ వైరస్. దయచేసి అందరు ఇంట్లోనే ఉంటూ బౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ రాసుకొచ్చింది. దీంతో పాటు తన తల్లితో, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. 2019లో టీమిండియాకు అరంగేట్రం చేసిన ప్రియా పూనియా ఇప్పటివరకు 7 వన్డేలు.. మూడు టీ20లు ఆడింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పూనియా ఎంపికైంది. చదవండి: Shafali Verma: వన్డేల కోసం శైలి మార్చుకుంటా View this post on Instagram A post shared by Priya Punia (@priyapunia16) -
కంగ్రాట్స్ హర్మన్.. ఆ నలుగురి తరువాత నువ్వే
లక్నో: టీమిండియా బ్యాట్స్‌వుమన్ హర్మన్ ప్రీత్ కౌర్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికతో జరిగిన తొలి వన్డే ద్వారా అరుదైన ఘనతను సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిథాలి రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116)లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో భారత వన్డే వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేరింది. ఆమె సాధించిన ఈ ఘనతకు గాను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ హర్మన్.. వెల్కమ్ టు ద క్లబ్ అంటూ సహచర క్రికెటర్లు ట్వీట్లతో అభినందించారు. హర్మన్ 100 మ్యాచ్‌ల్లో 3 శతకాలు 11 అర్ధ శతకాల సాయంతో 2,412 పరుగులు చేసింది. అజేయమైన 171 పరుగులు ఆమె అత్యధిక స్కోరుగా ఉంది. టీ20 కెప్టెన్ కూడా అయిన ఆమె..114 మ్యాచ్‌ల్లో ఒక శతకం, ఆరు అర్థ శతకాల సాయంతో 2186 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడే క్రికెటర్‌గా పేరున్న హర్మన్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం పెద్దగా లభించింది. ఆమె కేవలం 2 మ్యాచ్‌ల్లో 26 పరుగులు మాత్రమే సాధించింది. పార్ట్ టైమ్ బౌలర్‌గా కూడా రాణించే ఆమె..టెస్ట్‌ల్లో 9, వన్డేల్లో 23, టీ20ల్లో 29 వికెట్లు సాధించింది. -
స్టన్నింగ్ డైవ్ క్యాచ్, వహ్వా అనాల్సిందే!
అలా దూరంగా వెళ్తున్న బంతిని సైతం గాల్లో పల్టీలు కొడుతూ క్యాచ్ పడితే.. అదిరిపోయే క్యాచ్ అంటూ ఆ ఫీల్డర్‌పై ప్రశంసలు కురిపిస్తాం. అదే సమయంలో ఆ క్యాచ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే అభిమానులు మరింత కేరింతలు కొడతారు. తాజాగా, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇలాంటి ఓ డైవింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిస్బేన్ హీట్ వుమెన్ వర్సెస్ అడిలైడ్ స్ట్రయికర్స్ వుమెన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ స్టన్నింగ్ క్యాచ్ వెలుగు చూసింది. 17 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో.. అడిలైడ్ స్పిన్నర్ అమంద వెల్లింగ్టన్ విసిరిన ఫుల్‌టాస్ బంతిని అమెలియా కేర్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాలనుకుంది. ఆమె కొట్టిన షాట్ బాల్‌ను షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న మ్యాడీ పెన్నా క్యాచ్ కోసం ప్రయత్నించగా.. ఫలించలేదు. ఆమె చేతులను తాకుతూ బంతి అమాంతం పైకి లేచి బుల్లెట్లా బౌండరీ వైపుగా దూసుకెళ్తోంది. పెన్నాకు సమీపంలోనే ఉన్న తాహిలా మెక్‌గ్రాత్ చాకచక్యంగా ఫుల్‌లెంగ్త్‌లో డైవ్ చేసి ఆ బంతిని ఒడిసిపట్టింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిస్బేన్ జట్టు తాజా వికెట్‌తో ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అడిలైడ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేయగా.. బ్రిస్బేన్ జట్టు 135 పరుగులే చేయగలిగింది. -
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు మహిళా క్రికెటర్ల మద్దతు
లండన్: నల్లజాతీయులు చేస్తోన్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి వెస్టిండీస్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు మద్దతు ఇవ్వనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా డెర్బీ వేదికగా నేడు తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇరు జట్ల ఆటగాళ్లు జెర్సీలపై ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ధరించడంతో పాటు మ్యాచ్‌కు ముందు మోకాలిపై కూర్చొని సంఘీభావం తెలపనున్నారు. ‘ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో చెబితే అది ఆచరించడానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ నాకు సందేశం పంపింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా జెర్సీలపై లోగో ధరించడంతో పాటు ప్రతీ మ్యాచ్‌కు ముందు మేమంతా సంఘీభావం తెలుపుతాం’ అని విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ పేర్కొంది. మార్చిలో టి20 ప్రపంచ కప్ తర్వాత మహిళల క్రికెట్లో జరుగనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం గమనార్హం.