
దుబాయ్: ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ (Match Fixing) జాడ్యం ఇప్పుడు మహిళా క్రికెట్‌కు అంటుకున్నట్లుంది. ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షోహెలీ అక్తర్‌పై (Shohely Akhter) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో అవినీతి, ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా 36 ఏళ్ల షోహెలీ నిలిచింది.
2023లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్, ఆ్రస్టేలియాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. నిజానికి 2022లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఆ వరల్డ్‌కప్‌లో లేకపోయినా... టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌ను సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తను చెప్పినట్లు ఆ బంగ్లా క్రికెటర్ హిట్ వికెట్ అయితే 2 మిలియన్ల టాకాలు (బంగ్లా కరెన్సీ) ఇస్తానని ఆశచూపింది.
సదరు బంగ్లా క్రికెటర్... షోహెలీ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ షోహెలీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీలోని ఐదు ఆర్టికల్స్‌ను ఆమె అతిక్రమించిందని దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment