లండన్: మహిళల క్రికెట్‌లో దశాబ్ద కాలానికి పైగా తన ముద్ర చూపించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ సారా టేలర్ (30) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. కొంత కాలంగా భావోద్వేగాలను నియంత్రించుకోలేని ‘మానసిక బెంగ’తో బాధపడుతున్న టేలర్ ఇక ఆట తన వల్ల కాదని ప్రకటించేసింది. 17 ఏళ్ల వయసులోనే ఆమె 2006లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగమైంది. తమ జట్టు వన్డే, టి20 ప్రపంచ కప్‌లను గెలవడంలో టేలర్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి టేలర్ 232 వికెట్ల పతనంలో భాగం కావడం మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ఘనత కావడం విశేషం. తన కెరీర్‌లో సారా టేలర్ 10 టెస్టులు, 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 6,533 పరుగులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment