బిడ్డతో సహా మహిళా క్రికెటర్‌ మృతి | South Africa Former Women Cricketer Elisa Theunissen Fourie Died In Car Crash | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్‌ మృతి

Published Mon, Apr 8 2019 9:51 AM | Last Updated on Mon, Apr 8 2019 9:54 AM

South Africa Former Women Cricketer Elisa Theunissen Fourie Died In Car Crash - Sakshi

కేప్‌టౌన్‌ : దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్‌ ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం తన బిడ్డతో కలిసి సౌతాఫ్రికా మైనింగ్‌ సిటీ స్లిల్‌ఫౌంటెన్‌ మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం వారిరువురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన క్రికెట్‌ సౌతాఫ్రికా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎల్‌రీసా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘మాటలకందని విషాదం ఇది. ఎల్‌రీసా, ఆమె బిడ్డ మరణించారు. ఈ చేదు వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. క్రికెట్‌ను ప్రేమించిన ఎల్‌రీసా ఆల్‌రౌండర్‌గా రాణించి అద్భుత ప్రతిభ కనబరించింది. ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు, సహ క్రీడాకారులకు సీఎస్‌ఏ తరఫున సానుభూతి తెలుపుతున్నా’ ఆయన పేర్కొన్నారు.

కాగా దేశవాళీ క్రికెట్‌లో నార్త్‌వెస్ల్‌ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎల్‌రీసా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరంగేట్రం చేశారు. మొత్తం 3 వన్డేలాడిన ఆమె.. ఒక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. 2013 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న ఎల్‌రీసా..సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా కనిపించారు. స్థానికంగా పలు క్రికెట్‌ జట్లకు ఆమె కోచ్‌గా కూడా వ్యవహరించేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement