కేటీ మార్టిన్ (PC: Twitter)
Katey Martin Retirement: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ కేటీ మార్టిన్ ఆటకు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు. కాగా 2003లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేటీ.. వైట్‌ఫెర్న్స్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించారు.
పందొమ్మిదేళ్ల తన కెరీలో మొత్తంగా 103 వన్డేలు, 95 టీ20 మ్యాచ్‌లు, ఒక టెస్టు ఆడారు. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ కేటీకి చివరిది. ఇందులో ఆమె 26 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఇక సుదీర్ఘకాలంగా వైట్‌ఫెర్న్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన కేటీ మూడు ఫార్మాట్లలో కలిపి 2900 పరగులు చేశారు. ఇందులో 11 అర్ద శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో కేటీ అత్యధిక స్కోరు 81.ఇక దేశవాళీ వన్డే కెరీర్‌లో 169 మ్యాచ్‌లు ఆడిన కేటీ.. ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్(న్యూజిలాండ్ మెన్, వుమెన్ క్రికెట్)గా నిలిచారు.
రిటైర్మెంట్ సందర్భంగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన కేటీ.. ‘‘అద్భుతమైన అనుభవం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు, ప్రత్యర్థి జట్ల ప్లేయర్లు.. అందరికీ ధన్యవాదాలు. క్రికెట్ నాకు జీవితాన్నిచ్చింది. దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న నా కలను నిజం చేసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమే. కానీ తప్పదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment