న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.
ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్‌లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం.
మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
న్యూజిలాండ్ క్రికెట్‌లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్‌లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్‌లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.
వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగననున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment