Third Time Lucky DC Jess Jonassen Ties Knot With Sarah Wearn - Sakshi
Sakshi News home page

Jess Jonassen: థర్డ్‌టైమ్‌ లక్కీ: ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌.. ఫొటోలు వైరల్‌

Published Fri, Apr 14 2023 2:36 PM | Last Updated on Fri, Apr 14 2023 3:38 PM

Third Time Lucky DC Jess Jonassen Ties Knot With Sarah Wearn Pics - Sakshi

Jess Jonassen Marriage: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జెస్సికా లూసీ జొనాసెన్‌ తన చిరకాల ప్రేయసి సారా వెర్న్‌ను పెళ్లాడింది. పదేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ఈ జంట ఏప్రిల్‌ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జొనాసెన్‌- సారా పెళ్లి జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్‌ జొనాసెన్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘సర్‌ప్రైజ్‌! థర్డ్‌టైమ్‌ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్‌ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని ట్వీట్‌ చేసింది.

అవును లెస్బియన్‌నే
కాగా జొనాసెన్‌ తాను లెస్బియన్‌ అన్న విషయాన్ని గర్వంగా ఈ ప్రపంచానికి చెప్పుకోగలనంటూ గతంలో ప్రకటించింది. ఈ క్రమంలోనే సారాతో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన ఆమె తాజాగా తనను వివాహమాడింది. ఇక ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించారన్న విషయం తెలిసిందే.

ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన జొనాసెన్‌.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ జట్టులో సభ్యురాలు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో మెంబర్‌. ఆమె ఖాతాలో వన్డే వరల్డ్‌కప్‌(2022) కూడా ఉంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆసీస్‌ జట్టులో కూడా జొనాసెన్‌ భాగమైంది.

ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన 30 ఏళ్ల జొనాసెన్‌.. మొత్తంగా 88 మ్యాచ్‌లలో 135 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. 100 టీ20లు ఆడి 91 వికెట్లు తీసింది. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసింది.

కొత్తేం కాదు
ఇప్పటికే చాలా మంది మహిళా క్రికెటర్లు లెస్బియన్లుగా ప్రకటించుకోవడమే గాకుండా.. తమ భాగస్వాములను కూడా పెళ్లాడారు. డేనియెల్‌ వ్యాట్‌- జార్జ్‌ హాడ్జ్‌, డానే వాన్‌ నీకెర్క్‌-మారిజానే క్యాప్‌, లీ తహుహు- ఆమీ సాటెర్త్‌వైట్‌, నటాలీ సీవర్‌- కేథరిన్‌ బ్రంట్‌, లిజెల్లీ లీ- తంజా క్రోన్జ్‌, లారెన్‌ విన్‌ఫీల్డ్‌- కర్టెనీ హిల్‌, మేఘన్‌ షట్‌- జెస్‌ హొల్యోక్‌, హేలీ జెన్సెన్‌- నికోలా హాంకోక్‌, మ్యాడీ గ్రీన్‌- లిజ్‌ పెర్రీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

చదవండి: వాళ్లదే పైచేయి; డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement